E-Paper
Advertisement

మేలో అమ్మకాల్లో దూసుకెళ్లిన టాప్ టూవీలర్స్.. మళ్లీ టాప్ లో స్ప్లెండర్, యాక్టివా!

మేలో అమ్మకాల్లో దూసుకెళ్లిన టాప్ టూవీలర్స్.. మళ్లీ టాప్ లో స్ప్లెండర్, యాక్టివా!
Advertisement

Best-Selling Two-Wheelers in May 2026: ఇండియన్ టూ వీలర్ మార్కెట్ మే 2026లో మరింత జోష్ కనబర్చింది. దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 బైక్‌లు, స్కూటర్లు కలిపి మొత్తం 12.68 లక్షల యూనిట్లకు చేరాయి. గత ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 11.76 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది దాదాపు 7.84 శాతం పెరుగుదల. ఎప్పటిలాగే హీరో స్ప్లెండర్, హోండా యాక్టివా అమ్మకాల లిస్టులో టాప్ ప్లేస్ దక్కించుకున్నాయి. మరోవైపు టీవీఎస్ ఐక్యూబ్ అమ్మకాల్లో మరింత దూసుకెళ్లింది.

1.హీరో స్ప్లెండర్

మే 2026లో హీరో స్ప్లెండర్ 3.48 లక్షల యూనిట్ల అమ్మకాలతో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 38 వేల యూనిట్లు ఎక్కువగా విక్రయమయ్యాయి. మొత్తం టాప్-10 అమ్మకాలలో ఈ బైక్ ఒక్కటే 27 శాతం కంటే ఎక్కువ వాటాను దక్కించుకుంది. తక్కువ ధర, మంచి మైలేజ్, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత డీలర్ నెట్‌ వర్క్ కారణంగా అమ్మకాల్లో సత్తా చాటింది.

2.హోండా యాక్టివా

Advertisement

హోండా యాక్టివా 2.28 లక్షల యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే 20 శాతం వృద్ధిని సాధించింది. పట్టణాల్లో స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్ యాక్టివా అమ్మకాలకు బాగా కలిసొచ్చింది.

3.హోండా షైన్

హోండా షైన్ 1.55 లక్షల యూనిట్లతో మూడో స్థానంలో నిలిచింది. అయితే, గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. అయినప్పటికీ 125 సీసీ కమ్యూటర్ బైక్ విభాగంలో ఈ మోడల్‌కు మంచి డిమాండ్ కొనసాగుతోంది.

4.టీవీఎస్ జూపిటర్

Advertisement

టీవీఎస్ జూపిటర్ 1.24 లక్షల యూనిట్ల అమ్మకాలతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 28 శాతం వృద్ధిని సాధించింది. యాక్టివా తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్‌ గా నిలిచింది.

5.బజాజ్ పల్సర్

బజాజ్ పల్సర్ శ్రేణి 1.24 లక్షల యూనిట్లతో ఐదో స్థానంలో నిలిచింది. అమ్మకాలు స్వల్పంగా పెరిగినప్పటికీ, స్పోర్టీ బైక్ విభాగంలో పల్సర్ ఇప్పటికీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

6.సుజుకి యాక్సెస్

సుజుకి యాక్సెస్ 75 వేల యూనిట్లకు పైగా విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలలో పెద్దగా మార్పు లేదు. అయినప్పటికీ, ఈ స్కూటర్‌ కు మంచి కస్టమర్ బేస్ కొనసాగుతోంది.

7.హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్‌ కు మాత్రం భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమ్మకాలు 38 శాతం తగ్గి 66 వేల యూనిట్లకు పడిపోయాయి. ఎంట్రీ-లెవల్ బైక్ కొనుగోలుదారులు స్కూటర్లు, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

8.టీవీఎస్ అపాచీ

టీవీఎస్ అపాచీ 53,900 యూనిట్ల అమ్మకాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. దాదాపు 10 శాతం వృద్ధిని నమోదు చేసిన ఈ బైక్, పెర్ఫార్మెన్స్ బైక్ విభాగంలో మంచి సెబులిటీని కొనసాగిస్తోంది.

9.టీవీఎస్ ఎక్స్ఎల్

టీవీఎస్ ఎక్స్ ఎల్ మోపెడ్ 48,569 యూనిట్ల అమ్మకాలతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వెహికల్ కు  వాహనానికి ఇంకా మంచి డిమాండ్ ఉంది.

10.టీవీఎస్ ఐక్యూబ్

టాప్-10 జాబితాలో అత్యధిక వృద్ధి సాధించిన వాహనం టీవీఎస్ ఐక్యూబ్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు 52 శాతం కంటే ఎక్కువ పెరిగి 42 వేల యూనిట్లను దాటాయి.

Read Also: అదిరిపోయే ఫీచర్లు.. ఆకట్టుకునే రేంజ్.. హోండా క్యూట్ ఈవీ వచ్చేసింది!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×