E-Paper
Advertisement

మారుతి To టాటా.. FY26 అమ్మకాల్లో దుమ్మురేపిన టాప్ 10 మోడళ్లు ఇవే!

మారుతి To టాటా..  FY26 అమ్మకాల్లో దుమ్మురేపిన టాప్ 10 మోడళ్లు ఇవే!
Advertisement

Top 10 Best-Selling Cars in FY2026: 2026 ఆర్థిక సంవత్సరంలో భారత ఆటోమొబైల్ మార్కెట్‌ మంచి స్వింగ్ లో కొనసాగింది. ప్యాసింజర్ వెహికల్స అమ్మకాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా సెప్టెంబర్‌లో జరిగిన GST మార్పులు మార్కెట్‌పై పెద్ద ప్రభావం చూపించాయి. గత సంవత్సరం‌తో పోలిస్తే మొత్తం అమ్మకాలు సుమారు 13 శాతం పెరిగాయి. ఈ పెరుగుదలతో పాటు, టాప్ 10 కార్ల జాబితాలో కూడా పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి.  ఈసారి టాప్ 3లో నిలిచిన మూడు కార్లు ఒక్కొక్కటి 2 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. ఇది భారత మార్కెట్‌లో ఒక కొత్త రికార్డుగా చెప్పుకోవచ్చు. ఇంతకీ ఈ ఏడాది అమ్మకాల్లో సత్తా చాటిన టాప్ 10 కార్లు ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ మారుతి సుజుకి డిజైర్

ఈ ఏడాది ఈ కారు నెంబర్ 1గా నిలిచింది.  2026 ఆర్థిక సంవత్సరంలో 2.29 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 39 శాతం వృద్ధిని సాధించింది. డిజైర్ మంచి మైలేజ్, సరసమైన ధర కారణంగా వినియోగదారుల ఆదరణ దక్కించుకుంది.

⦿ టాటా నెక్సాన్

Advertisement

రెండవ స్థానంలో టాటా నెక్సాన్ ఉంది. ఇది 2.16 లక్షల యూనిట్ల అమ్మకాలతో ఆకట్టుకుంది. సుమారు 32 శాతం వృద్ధి నమోదు చేసింది. భద్రతా ఫీచర్లు, SUV డిజైన్ కారణంగా నెక్సాన్‌కు మంచి డిమాండ్ ఉంది.

⦿ హ్యుండాయ్ క్రెటా

మూడవ స్థానంలో హ్యుండాయ్ క్రెటా నిలిచింది. ఇది 2 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రెటా మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో  తన స్థానాన్ని స్థిరంగా కొనసాగించింది.

⦿ మారుతి సుజుకి ఎర్టిగా

Advertisement

నాలుగో స్థానంలో మారుతి సుజుకి ఎర్టిగా ఉంది. ఇది 1,98,876 యూనిట్ల అమ్మకాలు కొనసాగించింది. కుటుంబ అవసరాలకు అనుకూలంగా ఉండటంతో మంచి అమ్మకాలు సాధించింది.

⦿ మారుతి సుజుకి స్విఫ్ట్

ఐదో స్థానంలో మారుతి సుజుకి స్విఫ్ట్ నిలిచింది. ఇది 1,85,350 యూనిట్ల సేల్ సాధించింది. యువతలో ఈ కారుకు ఇప్పటికీ మంచి ఆదరణ ఉంది.

⦿ టాటా పంచ్

ఆరవ స్థానంలో టాటా పంచ్ ఉంది. ఈ మోడల్ 1,83,980 అమ్మకాలు సాధించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే కొంత తగ్గుదల చూసింది.

⦿ మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

ఈ మోడల్ ఏడో స్థానంలో నిలిచింది. మొత్తంగా 1,80,134 అమ్మకాలు సాధించింది.

⦿ మారుతి సుజుకి బ్రెజ్జా

ఎనిమిదో స్థానంలో మారుతి సుజుకి బ్రెజ్జా ఉంది. ఇది 1,80,104 అమ్మకాలు నమోదు చేసింది.

⦿ మహీంద్రా స్కార్పియో ఎన్

తొమ్మిదో స్థానంలో మహీంద్రా స్కార్పియో ఎన్,  క్లాసిక్ మోడళ్లు నిలిచాయి. ఈ మోడల్ 1,78,800 అమ్మకాలు సాధించింది. గతంతో పోల్చితే అమ్మకాల్లో కొంత వృద్ధి నమోదు చేసింది.

⦿ మారుతి సుజుకి బాలెనో

పదో స్థానంలో మారుతి సుజుకి బాలెనో ఉంది. 1,72,560 అమ్మకాలు సాధించింది.  ఇది కూడా స్థిరమైన అమ్మకాలను కొనసాగించింది.

మొత్తంగా ఈ జాబితాలో సగం SUVలే ఉన్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్‌లో SUVలకు ఎక్కువ డిమాండ్ ఉంది. అయితే, హ్యాచ్‌ బ్యాక్‌ లు, సెడాన్, MPVలు కూడా తమ స్థాయిని నిలబెట్టుకున్నాయి.

Read Also: క్రెటా To ఐయోనిక్ 5.. హ్యుండాయ్ నుంచి రాబోతున్న క్రేజీ కార్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×