E-Paper
Advertisement

Tips Less Fuel: కారు మైలేజ్ పెంచుకోవాలా? సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!

Tips Less Fuel: కారు మైలేజ్ పెంచుకోవాలా? సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!
Advertisement

ఈ రోజుల్లో చాలా మంది కార్లను ఉపయోగిస్తున్నారు. వారికి సాధారణం ఎదురయ్యే సమస్య మైలేజ్. ప్రతిసారి పెట్రోల్ నింపేందుకు బంకులోకి వెళ్లినప్పడు తెగ బాధపడిపోతుంటారు. అయ్యో.. తమ కారు మైలేజ్ సరిగా ఇవ్వడం లేదే అని ఆందోళన చెందుతారు. చాలా మంది ప్యూయెల్ ఖర్చు తగ్గించుకోవడానికి మార్గాలను వెతుకుతుంటారు. అయితే, మీరు కూడా కొన్ని టిప్స్ పాటించడం వల్ల మీ కారు పెట్రో బడ్జెట్ ను తగ్గించుకునే అవకాశం ఉంది. ఇంతకీ ఆ టిప్స్ ఏవి? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ ఒకే స్పీడ్ మెయింటెయిన్ చేయడం  

ఒకే స్పీడ్ తో డ్రైవింగ్ చేయడం వల్ల ఫ్యూయెల్ ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. హైవేలో గంటలకు 80 కిలో మీటర్లకు బదులుగా 60 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తే చాలా వరకు ఇంధనాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.

⦿ ముందుగానే ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి

Advertisement

ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవడం వల్ల ట్రాఫిక్ లో చిక్కుకోకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ లేని సమయంలో ప్రయాణాలు చేయడం వల్ల ఈజీగా వెళ్లిపోవచ్చు. రద్దీ లేకపోవడం వల్ల ఫ్యూయెల్ సేవ అవుతుంది.

⦿ ఓవర్ లోడ్ వద్దు

కారును ఓవర్ లోడ్ లేకుండా చూసుకోవాలి. అదనపు బరువు కారణంగా ప్యూయెల్ ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి 100 కేజీల బరువుకు అదనంగా 5 శాతం ఇంధనం తీసుకుంటుంది. వీలైనంత వరకు వాహనాలను బరువు లేకుండా తీసుకెళ్లాలి.

⦿ ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఇంజిన్ ఆపండి

Advertisement

కొన్నిసార్లు ట్రాఫిక్ లో చిక్కుకుపోతారు. ఆ సమయంలో అనవరసరంగా ఇంజిన్ ఆన్ లో ఉండటం వల్ల ప్యూయెల్ ఎక్కువగా తీసుకుంటుంది. ఎక్కువ రద్దీ ఉన్నప్పుడు ఇంజిన్ ఆపడం మంచిది.

⦿ ఏసీ తక్కువగా ఉపయోగించండి

లాంగ్ జర్నీలో ఏసీ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ ఎక్కువ పవర్ ను తీసుకుంటుంది. ఫలితంగా ఇంధన వినియోగాన్ని 20 శాతం వరకు పెంచుతుంది. కారు ప్రారంభం అయిన వెంటనే ఏసీ ఆన్ చేయకుండా వెంటిలేషన్ కోసం విండోస్ ఓపెన్ చేయడం మంచిది. ఆ తర్వాత, బయటి ఉష్ణోగ్రతతో పోల్చితే 7°C కంటే తక్కువ ఉష్ణోగ్రతను సెట్ చేయడం మంచిది.

⦿ కిందికి వెళ్లేటప్పుడు ఇంజిన్ బ్రేకింగ్‌ వాడండి

ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి వెళ్లే సమయంలో ఇంజిన్ బ్రేక్‌ను ఉపయోగించడం వల్ల ఇంధన వినియోగం తగ్గుతుంది. బ్రేక్‌ ను నొక్కకుండా నెమ్మదిగా డౌన్‌ షిఫ్ట్ చేయాలి. ఫలితంగా ఇంధన వినియోగం తగ్గుతుంది.

⦿ టైర్ ప్రెజర్‌ను చెక్ చేయండి

టైర్లలో తక్కువ గాలి ఉండటం వల్ల తక్కువ స్పీడ్ తిరుగుతాయి. రోడ్డు హోల్డింగ్, బ్రేకింగ్ మీద ప్రభావం చూపిస్తాయి. కారు నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటుంది. తక్కువ ఎయిర్ ప్రెజర్ కారణంగా 4 శాతం ఎక్కువ ఇంధనాన్ని వినియోగించేలా చేస్తుంది. కనీసం నెలకు ఒకసారి టైర్లలో గాలిని చెక్ చేయాలి.

⦿  ఎకో డ్రైవింగ్‌ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి

ఎకో డ్రైవింగ్‌ లో ఇంజిన్ ఈజీగా నడుస్తుంది. నెమ్మదిగా వేగం పెంచండి. ఎకో డ్రైవింగ్ కారణంగా ఇంధన వినియోగాన్ని 10 నుంచి 20 శాతం వరకు తగ్గించే అవకాశం ఉంటుంది.

⦿ టైమ్ ప్రకారం సర్వీస్ చేయించండి

టైమ్ ప్రకారం సర్వీస్ చేయించాలి. ఫిల్టర్లు క్లీన్ చేయడంతో పాటు, ఆయిల్ ఛేంజ్ చేయించాలి. ఫలితంగా ఇంధనం ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.

⦿ మంచి ఫ్యూయెల్ స్టేషన్ ను సెలెక్ట్ చేసుకోవాలి

వీలైనంత వరకు రెగ్యులర్ గా ఒకే ఫ్యూయెల్ స్టేషన్ ను ఉపయోగించాలి. వేర్వేరు ఫ్యూయెల్ స్టేషన్లను ఉపయోగించడం వల్ల ఇంజిన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఫలితంగా ప్యూయెల్ ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది.

Read Also:  క్రెటా, కియా, సెల్టోస్.. రూ.15 లక్షల లోపు బెస్ట్ SUV ఏదంటే?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×