E-Paper
Advertisement

Hero Destini 110: హీరో డెస్టినీ 110 కొనాలనుకుంటున్నారా? ఈ 5 విషయాలు తెలుసుకోండి!

Hero Destini 110: హీరో డెస్టినీ 110 కొనాలనుకుంటున్నారా? ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Advertisement

Hero Destini 110 Scooty: హీరో కంపెనీ నుంచి మరో సరికొత్త స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. హీరో డెస్టినీ 110 పేరుతో మార్కెట్ లోకి విడుదల అయ్యింది. ఈ స్కూటర్ రోజువారీ ప్రయాణాలకు అనుగుణంగా, మంచి ఫ్యూయెల్ ఎఫిషియెన్సీతో అందుబాటులోకి వచ్చింది. ఈ స్కూటర్ ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఇంజిన్ ప్రత్యేకతలు ఏంటి? ఎంత మైలేజ్ ఇస్తుంది? ధర ఎంత ఉంటుంది? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

హీరో డెస్టినీ 110 ధర ఎంత?

హీరో డెస్టినీ 110 ప్రస్తుతం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. VX, ZX వేరియంట్స్ గా పరిచయం అయ్యాయి. బేస్ VX వేరియంట్ ధర రూ. 72,000గా ఉంది. ZX  ప్రీమియం ఫీచర్లతో రూ. 79,750 (ఎక్స్ షోరూమ్) ధరను కలిగి ఉంది. టాప్ ZX వేరియంట్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌తో పాటు పిలియన్ బ్యాక్‌ రెస్ట్‌ ను తో వస్తుంది. రెండు వేరియంట్లలో డిజి అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. స్కూటర్ పలు రంగుల్లో అందుబాటులో ఉంది.

హీరో డెస్టినీ 110 ఇంజిన్‌ గురించి..  

Advertisement

హీరో డెస్టినీ 110 స్కూటర్ 110.9cc, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ తో వస్తుంది. ఇది 8.1hp పవర్, 8.7Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో హీరో ఐడల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్(i3S) కూడా ఉంది. ఈ స్కూటర్ ప్రయాణ సమయంలో కొన్ని సెకెన్ల పాటు నిలిపి ఉంటే ఆటో మేటిక్ గా ఇంజిన్ ఆగిపోతుంది. థ్రోటిల్‌ ను ట్విస్ట్ చేసి బ్రేక్‌ ను పట్టుకుంటే మళ్లీ ఆన్ అవుతుంది.

హీరో డెస్టినీ 110 మైలేజ్ ఎంత ఇస్తుంది?

హీరో డెస్టినీ 110 సిటీ ప్రయాణంలో సుమారు 54 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. హైవే ప్రయాణంలో 64 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. సిటీలో ఒకే రకమైన వేగంతో ప్రయాణించడం ద్వారా, హైవే మీద కూడా ఇదే పద్దతిని ఫాలో అయితే, సుమారు 65 నుంచి 70 కిలో మీటర్ల మేర మైలేజ్ పొందే అవకాశం ఉంటుంది. రైడింగ్ స్టైల్, పరిస్థితులను బట్టి మైలేజ్ ఎక్కువ, తక్కువగా ఉంటుంది. ఈ స్కూటర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌పై లైవ్ ఫ్యూ యెల్ రీడింగ్ కనిపిస్తుంది.

Advertisement

Read Also: చేతులు కలిపిన సుజుకి మోటార్ సైకిల్ ఇండియా, రాయల్ బ్రదర్స్‌.. ప్లాన్ మామూలుగా లేదుగా!

ఇక హీరో డెస్టినీ 110 సీటు ఎత్తు 770mm ఉంటుంది. ఇది లీనియర్‌గా అనిపించే పవర్ డెలివరీ, సున్నితమైన థ్రోటిల్ రెస్పాన్స్‌ తో పాటు, అన్ని వయసుల రైడర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈజీగా హ్యాండిల్ చెయ్యొచ్చు. హీరో డెస్టినీ 110 బరువు కూడా తక్కువగానే ఉంటుంది. 114 కిలో వెయిట్ తో తేలికగా ఉంటుంది. దాని బరువు పరంగా, స్కూటర్ రోజువారీ ప్రయాణానికి మంచి పనితీరును అందిస్తుంది.  40 కిలో మీటర్ల వేగాన్ని చేరుకోవడాని జస్ట్ 3.83 సెకన్ల సమయం పడుతుంది. 60 కిలో మీటర్ల వేగాన్ని 8.59 సెకన్లు, 80 కిలో వేగాన్ని చేరుకోవడానికి 18.18 సెకన్ల సమయం తీసుకుంటుంది.

Read Also: హోండా To యమహా.. మహిళలకు సూటయ్యే బెస్ట్ స్కూటర్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×