E-Paper
Advertisement

Yamaha EC 06: యమహా EC-06 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

Yamaha EC 06: యమహా EC-06 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
Advertisement

యమహా తొలిసారి ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. EC-06 పేరుతో దీనిని విడుదల చేసింది. దీనిని యమహా కంపెనీ, బెంగళూరుకు చెందిన RIVERతో కలిసి డెవలప్ చేసింది. అంతేకాదు, దేశంలో యమహా  ప్రారంభించిన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ గా గుర్తింపు తెచ్చుకుంది.

Yamaha EC-06 బ్యాటరీ, రేంజ్  

Yamaha EC-06 ఎలక్ట్రిక్ స్కూటర్ 4kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తుంది. దీనిలో మోటారు 6.7kW (9.1hp) శక్తిని, 26Nm పీక్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ గరిష్టంగా 79 kph వేగాన్ని కలిగి ఉంటుంది. ఇక రైడింగ్ రేంజ్, ఛార్జింగ్ సమయం గురించి పరిశీలిస్తే, EC-06 పూర్తి ఛార్జ్‌ లో 169 కిలోమీటర్ల IDC రైడింగ్ రేంజ్‌ను కలిగి ఉంది. ఈ స్కూటర్ బ్యాటరీ 0-100 శాతం ఛార్జ్ చేయడానికి 10 గంటల సమయం పడుతుంది. 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 9 గంటలు పడుతుందని కంపెనీ వెల్లడించింది.

Yamaha EC-06 ఫీచర్ల గురించి..  

Advertisement

Yamaha EC-06 24.5 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, ఎకో, స్టాండర్డ్, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు కలిగి ఉంటుంది. LED హెడ్‌ లైట్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, Y-కనెక్ట్ R అప్లికేషన్ ద్వారా కనెక్టివిటీతో కూడిన కలర్ LCD స్క్రీన్‌ ను కలిగి ఉంది. ఇక ఈ స్కూటర్ కెర్బ్ బరువు 132 కిలోలు ఉంటుంది.

యమహా EC-06, రివర్ ఇండీ మధ్య తేడాలు!  

Yamaha కంవపెనీ EC-06ను బెంగళూరుకు చెందిన స్టార్టప్ రివర్‌ తో కలిసి అభివృద్ధి చేసింది. ఈ రెండు స్కూటర్ల మధ్య తేడా కోసం న్న స్టైలింగ్‌ను కలిగి ఉన్నాయి. కానీ, ఇండీ 43 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్‌ తో పెద్ద బూట్‌ ను కలిగి ఉంటుంది. EC-06 ఇండీతో పోలిస్తే కొంచెం తక్కువ టాప్ స్పీడ్‌ను కూడా కలిగి ఉంది. అయితే, EC-06 క్లెయిమ్ చేసిన IDC పరిధి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇండీ 163 కి.మీ రేంజ్ ను అందిస్తుంది. ధర పరంగా యమహా రూ. 22,000 ఖరీదైనది. EC-06 మిస్ అయ్యే వేగవంతమైన 750W ఛార్జర్ ఎంపికను కూడా ఇండీ కలిగి ఉంటుంది. ఫాస్ట్ ఛార్జర్‌ ను ఉపయోగించినప్పుడు, ఇండీ కేవలం 5 గంటల్లో 0-80 శాతం ఛార్జింగ్‌ను అందుకుంటుంది.

Advertisement

Read Also: వామ్మో ఇదెక్కడి క్రేజ్ భయ్యా, 135 సెకెన్లలో కార్లన్నీ కొనేశారు!

Yamaha EC-06 ధర ఎంత? ఏ నగరాల్లో అందుబాటులో ఉంది?

Yamaha EC-06 స్కూటర్ ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంది. దీని ధర సుమారు రూ. 1.67 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది బెంగళూరు, ముంబై, పూణే, చెన్నైలో ప్రస్తుతం అందుబాటులో ఉంది. బెంగళూరులో రూ. 1,67,600, ముంబైలో రూ. 1,68,300, పూణేలో రూ. 1,68,300, చెన్నైలో రూ. 1,68,300  ధరను కలిగి ఉంది.

Read Also: ధరలు సవరించిన రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఏ బైక్స్ ధరలు పెరిగాయి? ఏ బైక్స్ ధరలు తగ్గాయంటే?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×