E-Paper
Advertisement

Second-Hand Car: సెకెండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? కచ్చితంగా ఇవి చెక్ చేయాల్సిందే!

Second-Hand Car:  సెకెండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? కచ్చితంగా ఇవి చెక్ చేయాల్సిందే!
Advertisement

Second-Hand Car Buying Tips:  సెకండ్ హ్యాండ్ కారు కొనే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను అస్సలు మర్చిపోకూడదు. మోసాలు,  లోపాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మంచి డీల్ పొందడానికి ఈ 10 కీలక విషయాలు తప్పనిసరిగా చెక్ చేయాలి. ఇవి కారు కరెంట్ స్టేటస్, హిస్టరీ, వ్యాల్యూ తెలుసుకోవడానికి సాయపడుతాయి. ఇంతకీ అవేంటంటే..

⦿ కారు డాక్యుమెంట్లు చూడండి

కొనుగోలు చేయబోయే కారుకు సంబంధించిన RC బుక్, ఇన్సూరెన్స్, PUC సర్టిఫికేట్, ఒకవేళ లోన్ ఉంటే NOC, సర్వీస్ హిస్టరీ బుక్ చూడాలి. అన్నీ ఒరిజినల్‌గా, అప్‌డేట్‌గా ఉన్నాయేమో చెక్ చేయాలి. చాసిస్ నంబర్, ఇంజిన్ నంబర్ RCలో మ్యాచ్ అవుతున్నాయో? లేదో? వెరిఫై చేయాలి.

⦿ ఓడోమీటర్ ట్యాంపరింగ్ చెక్

Advertisement

ఓడోమీటర్ రీడింగ్ అప్ నార్మల్ గా ఉందేమో చూడండి. సర్వీస్ రికార్డులు, ఓల్డ్ ఇన్సూరెన్స్ పాలసీలతో క్రాస్ చెక్ చేయండి. పెడల్స్, స్టీరింగ్ వీల్, సీట్ల వేర్ అండ్ టియర్‌తో మ్యాచ్ అవుతుందేమో చూడండి.

⦿ యాక్సిడెంట్ హిస్టరీ

కారు గతంలో ఏదైనా పెద్ద యాక్సిడెంట్‌కు గురైందేమో తెలుసుకోండి. చాసిస్, ఫ్రేమ్, పిల్లర్స్‌ లో వెల్డింగ్ మార్కులు, పెయింట్ డిఫరెన్స్, ప్యానల్ గ్యాప్స్ చూడండి. కారు హిస్టరీ రిపోర్ట్ తీసుకోవడం మంచిది.

⦿ ఇంజిన్, మెకానికల్ కండిషన్

Advertisement

ఇంజిన్ స్టార్ట్ చేసి స్మూత్‌గా రన్ అవుతుందేమో చూడాలి. అబ్ నార్మల్ సౌండ్స్ ఏమైనా వస్తున్నాయేమో చెక్ చేయాలి. ఇంజిన్ ఆయిల్ లీకేజ్, కూలెంట్ లెవెల్, బెల్ట్స్ స్టేట్ చూడాలి. తప్పనిసరిగా తెలిసిన మెకానిక్‌తో చెక్ చేయించాలి.

⦿ అండర్ బాడీ ఇన్‌స్పెక్షన్

కారును లిఫ్ట్ చేసి అండర్ బాడీని చూడాలి. రస్ట్, లీకేజ్‌లు, డ్యామేజ్ ఉందేమో పరిశీలించాలి. రస్ట్ ఎక్కువగా ఉంటే ఫ్యూచర్‌ లో ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది.

⦿ టైర్లు, బ్రేకులు

నాలుగు టైర్లు ఒకే కంపెనీవా?  ఒకే సంవత్సరం మ్యానుఫ్యాక్చరింగ్‌ చేశారా? చూడాలి. ట్రెడ్ డెప్త్ 3-4 mm కంటే ఎక్కువ ఉండాలి. బ్రేక్ ప్యాడ్స్, డిస్క్‌ లు చెక్ చేయాలి.

⦿ సస్పెన్షన్, స్టీరింగ్

టెస్ట్ డ్రైవ్‌లో రోడ్ బంప్స్ మీదుగా వెళ్లి సస్పెన్షన్ నాయిస్ వస్తుందేమో చూడాలి. స్టీరింగ్ ప్లే ఎక్కువగా ఉందా?  టైట్ టర్న్స్‌ లో వైబ్రేషన్ ఉందా? అనే విషయాలను గమనించాలి.

⦿ ఎలక్ట్రికల్స్, ఫీచర్లు

AC, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లైట్స్, వైపర్స్, హారన్ సహా అన్నీ సరిగా పని చేస్తున్నాయో? లేదో? చెక్ చేయాలి. బ్యాటరీ పని తీరును పరిశీలించాలి.

⦿ ఇంటీరియర్, ఎక్స్‌ టీరియర్ కండిషన్

సీట్లు, డాష్‌ బోర్డ్, డోర్ ప్యానల్స్‌ లో డ్యామేజ్ ఉందేమో చూడాలి. బయట పెయింట్ ఫేడ్ అయిందా? స్క్రాచెస్, డెంట్స్ ఎక్కువగా ఉన్నాయా? అనేది పరిశీలించాలి. రాత్రి టైంలో చూడటం వల్ల పెయింట్ డిఫరెన్స్ కూడా స్పష్టంగా తెలుస్తుంది.

⦿ టెస్ట్ డ్రైవ్ తప్పనిసరి

సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు కనీసం 10 నుంచి 15 కిలో మీటర్ల దూరం డ్రైవ్ చేయాలి. హైవే, సిటీ, బంపీ రోడ్స్‌ లో తిరగాలి. ఇంజిన్ పికప్, బ్రేకింగ్, గేర్ షిఫ్టింగ్, వైబ్రేషన్స్, అసహజ స్మెల్స్ వస్తున్నాయేమో గమనించాలి.  చివరగా నమ్మకమైన మెకానిక్ లేదంటే ప్రొఫెషనల్ కార్ ఇన్‌స్పెక్షన్ సర్వీస్ తో చెక్ చేయించడం మంచిది. కాస్త ఖర్చు అయినా మున్ముందు ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. అన్ని విషయాలు ఓకే అనుకున్న తర్వాతే సెకెండ్ హ్యాండ్ కారు కొనడం మంచిది.

Read Also: ఒక్క ఛార్జ్ తో 150 కి.మీ రేంజ్, ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అదుర్స్ అంతే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×