E-Paper
Advertisement

భారత్ లోకి కొత్త టెస్లా కారు, సింగిల్ ఛార్జ్ తో 681 కి.మీ రేంజ్!

భారత్ లోకి కొత్త టెస్లా కారు, సింగిల్ ఛార్జ్ తో 681 కి.మీ రేంజ్!
Advertisement

New Tesla Model Y L: భారతీయ మార్కెట్ లో అనుకున్న స్థాయిలో సత్తా చాటలేకపోయినా, ఎలాగైనా నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే టెస్లా మోడల్ Yని మరింత విస్తరిస్తోంది. తాజాగా లాంగ్ వీల్‌ బేస్(LWB) వేరియంట్‌ ను రూ. 61.99 లక్షల ధరతో లాంచ్ చేసింది. ఈ లాంచ్ తో మోడల్ Y ఇప్పుడు దేశంలో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు సుమారు రూ. 59.89 లక్షల నుంచి రూ. 67.89 లక్షల వరకు ఉన్నాయి.

6 సీట్లు.. 681 కి.మీ రేంజ్

కొత్త వేరియంట్‌ లో ప్రధాన ఆకర్షణ 6-సీట్ల లే అవుట్. 2+2+2 మూడు వరుసల సీటింగ్ ఉంటుంది. కుటుంబ ప్రయాణాలకు అనువుగా దీన్ని రూపొందించారు. ఈ వేరియంట్‌ లో డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్  సిస్టమ్‌ ను అందించారు. భారత్ లో ఈ సెటప్‌తో వచ్చే మొదటి మోడల్ Yగా నిలిచింది. పనితీరు విషయానికి వస్తే, కేవలం 5 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. రేంజ్ పరంగా కూడా చాలా ముందుంది. ఈ కారు ఒకే ఛార్జ్ తో సుమారు 681 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి, జూన్ నుంచి డెలివరీలు మొదలయ్యే అవకాశం ఉంది.

కొత్త టెస్లా మోడల్ కొలతలు

Advertisement

టెస్లా కొత్త కారుకు సంబంధించి వీల్‌ బేస్‌ ను 150 మిల్లీమీటర్లు పెంచారు. మొత్తం పొడవు కూడా పెరిగి సుమారు 4,969 మిల్లీమీటర్లకు చేరుకుంది. ఎత్తు కొద్దిగా పెరిగినా, వెడల్పు మాత్రం పాత మోడల్ మాదిరిగానే ఉంది.  ఈ మార్పులు లోపల ఎక్కువ స్థలం, ముఖ్యంగా మూడో వరుస ప్రయాణికులకు సౌకర్యం కల్పించేందుకు ఉపయోగపడుతున్నాయి.

డిజైన్ గురించి..

డిజైన్ పరంగా చూస్తే, సాధారణ మోడల్‌తో పెద్దగా తేడా కనిపించదు. అయితే పక్కనుంచి చూస్తే పొడవైన డోర్లు, మారిన రూఫ్‌ లైన్, పెద్ద గ్లాస్ ఏరియా లాంటి చిన్న మార్పులు కనిపిస్తాయి. వెనుక భాగంలో స్పాయిలర్ డిజైన్ కొంచెం భిన్నంగా ఉంటుంది. లైటింగ్ సెటప్ మాత్రం టెస్లాకు ప్రత్యేకమైన స్టైల్లోనే కొనసాగుతుంది. ఇంటీరియర్‌ లో మినిమలిస్టిక్ డిజైన్ యథాతథంగా ఉంది. పెద్ద 16 అంగుళాల టచ్‌ స్క్రీన్ ద్వారా ఎక్కువ ఫంక్షన్లు కంట్రోల్ చేయవచ్చు. రెండో వరుస ప్రయాణికుల కోసం ప్రత్యేక స్క్రీన్ కూడా ఉంది. మంచి సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, పవర్డ్ అడ్జస్ట్మెంట్లు లాంటి ఫీచర్లు ఈ వేరియంట్‌లో ఉన్నాయి. మూడో వరుసలో కూడా రిక్లైన్, ఏసీ వెంట్స్ లాంటి సౌకర్యాలు కల్పించారు.

భద్రత విషయానికి వస్తే..

Advertisement

భద్రత పరంగా 9 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ అసిస్ట్ లాంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. టెస్లా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ఆప్షన్ కూడా ఉంది.అయితే ఇది అదనపు ఖర్చుతో పాటు, భారత్‌ లో పూర్తిగా యాక్టివ్‌ గా ఉండకపోవచ్చు. కొత్త మోడల్ Y లాంగ్ వీల్‌బేస్ వేరియంట్ పెద్ద కుటుంబాలకు, ఎక్కువ రేంజ్ కోరుకునే వినియోగదారులకు మంచి ఆప్షన్‌ కానుంది. ప్రీమియం ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌లో ఇది కియా EV6, వోల్వో  EC40 లాంటి మోడళ్లతో పోటీ పడనుంది.

Read Also: అదిరిపోయే మారుతి ఇగ్నిస్‌.. మార్కెట్‌ లో ఎందుకు సక్సెస్ కాలేకపోయింది?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×