E-Paper
Advertisement

టాటా నుంచి మరో రెండు ఎలక్ట్రిక్ SUVలు.. ప్లాన్ అదిరింది మాస్టారూ!

టాటా నుంచి మరో రెండు ఎలక్ట్రిక్ SUVలు..  ప్లాన్ అదిరింది మాస్టారూ!
Advertisement

Tata AWD Electric SUVs: ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టాటా మోటార్స్ టాప్ లో దూసుకెళ్తోంది. టియాగో EV, టిగోర్ EV, పంచ్ EV, నెక్సాన్ EV, కర్వ్ EV, హారియర్ EV లాంటి మోడళ్లతో కంపెనీ బంగా ఉంది. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ SUVలను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. మరికొద్ది రోజుల్లోనే టాటా సియెర్రా EV, టాటా సఫారీ EVలను భారత మార్కెట్లో విడుదల చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా ఈ రెండు వెహికల్స్ ఆల్ వీల్ డ్రైవ్ టెక్నాలజీతో అందుబాటులోకి రానున్నాయి.

ఈ నెల 30న టాటా సియెర్రా EV విడుదల

ముందుగా టాటా సియెర్రా EVను ఈ నెల 30న విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. గతంలో ఆటో ఎక్స్‌ పోలో కాన్సెప్ట్ రూపంలో కనిపించిన ఈ SUV ఇప్పుడు ఉత్పత్తి మోడల్‌ గా మార్కెట్లోకి రానుంది. డిజైన్ పరంగా పాత సియెర్రా లాగే ఉన్నా, ఆధునిక ఎలక్ట్రిక్ SUVగా రూపుదిద్దుకుంది. సియెర్రా EV, కర్వ్ EV, హారియర్ EV మధ్యలో ఉంటుంది. ఇది టాటా కొత్త acti.ev+ ప్లాట్‌ ఫామ్‌ పై రూపొందించబడింది. కంపెనీ ఇప్పటికే ఈ SUVను రియర్ వీల్ డ్రైవ్ (RWD), ఆల్ వీల్ డ్రైవ్ (AWD) వెర్షన్లలో అందిస్తామని ప్రకటించింది. టాప్ వేరియంట్‌లో 75 kWh బ్యాటరీ ప్యాక్‌తో AWD వ్యవస్థను అందించే అవకాశం ఉంది. ధర పరంగా చూస్తే సియెర్రా EV రూ.18 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా.

దీపావళికి టాటా సఫారీ EV విడుదల

Advertisement

ఇక టాటా సఫారీ EV కూడా ఈ ఏడాది దీపావళి సీజన్‌లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇటీవల ఈ SUV భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించడం ఆసక్తి రేకెత్తించింది. సఫారీ EV కంపెనీ ఫ్లాగ్‌ షిప్ ఎలక్ట్రిక్ SUVగా నిలవనుంది. ఇందులో మూడు వరుసల సీట్లు, ఏడు మంది కూర్చునే అవకాశం ఉంటుంది. కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మోడల్‌ ను అభివృద్ధి చేస్తున్నారు. సఫారీ EVలో హారియర్ EVలో ఉపయోగించిన 65 kWh, 75 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అలాగే, డ్యూయల్ మోటార్ AWD సిస్టమ్ కూడా ఇందులో ఉండనుంది. ప్రారంభ ధర సుమారు రూ.23 లక్షల వద్ద ఉండవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మోడల్ విడుదలైన తర్వాత మహీంద్రా XEV 9e వంటి ప్రీమియం ఎలక్ట్రిక్ SUVలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

రాబోయే 5 నెలల్లో టాటా మోటార్స్ నుంచి రెండు కీలక ఎలక్ట్రిక్ SUVలు మార్కెట్లోకి రానున్నాయి. సియెర్రా EV, సఫారీ EVల ద్వారా కంపెనీ భారత EV మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది.

Advertisement

Read Also: ప్లగ్ ఇన్ హైబ్రిడ్ vs స్ట్రాంగ్ హైబ్రిడ్.. ఇండియన్స్ వినియోగదారులకు ఏది బెస్ట్?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×