E-Paper
Advertisement

Tata Tiago EV 2026: విడుదలకు రెడీ అయిన కొత్త టాటా టియాగో, టియాగో EV.. ఫస్ట్ లుక్ అదిరింది గురూ!

Tata Tiago EV 2026: విడుదలకు రెడీ అయిన కొత్త టాటా టియాగో, టియాగో EV.. ఫస్ట్ లుక్ అదిరింది గురూ!
Advertisement

Tata Tiago Facelift 2026: వినియోగదారులను ఎప్పటికప్పుడు ఆకట్టుకోవడంలో ముందుంటున్న టాటా మోటార్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తన పాపులర్ హ్యాచ్‌ బ్యాక్‌ లైన టియాగో, టియాగో ఈవీ ఫేస్‌ లిఫ్ట్ వెర్షన్లను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ రెండు కార్లు మే 28 భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ మోడల్స్ కొత్త డిజైన్, అడిషనల్ ఫీచర్లతో మరింత ఆకట్టుకుంటున్నాయి.

డిజైన్ ను పూర్తిగా మార్చిన టాటా మోటార్స్

ఈసారి టాటా ప్రధానంగా ఈ మోడల్స్ బయటి లుక్ ను పూర్తిగా మార్చింది. ముందు భాగంలో కొత్త హెడ్‌ లైట్లు, ఐబ్రోస్ ఆకారంలో ఉన్న LED DRLs, కొత్త బంపర్ ఈ కార్లకు స్పోర్టీ లుక్ ఇచ్చాయి. పెట్రోల్ టియాగోలో పెద్ద బ్లాక్ గ్రిల్ ఇవ్వగా, టియాగో ఈవీలో బాడీ కలర్‌ తో క్లోజ్డ్ గ్రిల్ డిజైన్ ఆకట్టుకుంటుంది. అంతేకాదు, కొత్త ఫాగ్ ల్యాంప్ డిజైన్ ను ICE మోడల్‌ లో ఇచ్చారు. సైడ్ ప్రొఫైల్‌ లో కొత్త అల్లాయ్ వీల్ డిజైన్లు కనిపిస్తున్నాయి. అయితే, వీల్ సైజుల్లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. వెనుక భాగంలో కూడా కొత్త LED టెయిల్ లైట్లు, కనెక్టెడ్ లైట్ బార్‌ తో మరింత మోడర్న్ లుక్ అందించారు. బంపర్ డిజైన్‌ ను మారింది.

ఇంటీరియర్ లో చిన్న అప్ డేట్స్         

Advertisement

ఇంటీరియర్‌ లో పెద్ద మార్పులు లేకపోయినా, కొన్ని ముఖ్యమైన అప్‌ డేట్లు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న 10.25 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్‌ తో పాటు కొత్త స్టీరింగ్ వీల్ అలాగే కొనసాగనుంది. ఈసారి కొత్త డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్ ఇవ్వొచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా 360 డిగ్రీ కెమెరా ఫీచర్‌ ను కంపెనీ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. ముందు బంపర్, ORVMల కింద కెమెరాలు ఉన్నాయి.

భద్రత విషయాలో కీలక మార్పులు

ఇంకా ఆటోమేటిక్ హెడ్‌ ల్యాంప్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, TPMS, కూల్డ్ గ్లోవ్ బాక్స్ లాంటి ఫీచర్లు కొనసాగనున్నాయి. భద్రత విషయంలో కూడా టాటా కీలక మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 2 ఎయిర్‌ బ్యాగ్‌ ల స్థానంలో, కొత్త టియాగో మోడళ్లలో స్టాండర్డ్‌ గా 6 ఎయిర్‌ బ్యాగ్‌ లు ఇవ్వొచ్చని తెలుస్తోంది.

ఇంజిన్ గురించి..

Advertisement

ఇంజిన్ విషయానికి వస్తే, టియాగో ICEలో ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే కొనసాగించే అవకాశం ఉంది. ఇది 86hp పవర్, 113Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌ బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉండొచ్చు. అలాగే CNG వెర్షన్ కూడా కొనసాగనుంది. అటు టియాగో ఈవీలో బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం 19.2kWh, 24kWh బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటి రేంజ్ వరుసగా 223 కిమీ, 293 కిమీగా ఉంది. కొత్త మోడల్‌ లో మరింత రేంజ్ ఇచ్చే పెద్ద బ్యాటరీ ప్యాక్‌ లు వచ్చే అవకాశముంది.

ధరలు ఎలా ఉన్నాయంటే?

ఫేస్‌ లిఫ్ట్ కారణంగా ధరలు కాస్త పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం టియాగో ధర రూ.4.60 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, టియాగో EV ధర రూ.7.99 లక్షల నుంచి ఉంది. టాటా, పంచ్ EV తరహాలో బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) ఆప్షన్‌ ను కూడా తీసుకురావచ్చని తెలుస్తోంది.

Read Also: హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెర్షన్ లో ఆక్టేవియా.. స్కోడా ప్లాన్ అదిరిందయ్యో!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×