E-Paper
Advertisement

కొత్త స్టైల్.. లేటెస్ట్ ఫీచర్స్.. మే 28న టాటా టియాగో, టియాగో EV ఫేస్‌ లిఫ్ట్ లాంచ్!

కొత్త స్టైల్.. లేటెస్ట్ ఫీచర్స్.. మే 28న టాటా టియాగో, టియాగో EV ఫేస్‌ లిఫ్ట్ లాంచ్!
Advertisement

Tata Tiago EV 2026:  దిగ్గజ దేశీ ఆటో మోబైల్ కంపెనీ టాటా మోటార్స్ మే 28న కొత్త టాటా టియాగో ఫేస్‌ లిఫ్ట్, టాటా టియాగో ఈవీ ఫేస్‌ లిఫ్ట్ మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఇవి పూర్తిగా న్యూ జనరేషన్ కార్లు కాకపోయినా, డిజైన్‌, ఫీచర్లు, ఇంటీరియర్ పరంగా అప్ డేట్ కాబోతున్నాయి. ముఖ్యంగా యువత, చిన్న ఫ్యామిలీలను ఆకట్టుకునేలా కంపెనీ ఈ మోడళ్లను మరింత స్టైలిష్‌ గా తయారు చేసింది.

డిజైన్ మార్పులు

కొత్త టియాగో ఫేస్‌ లిఫ్ట్ డిజైన్ మోడ్రన్ గా తయారైంది. ముందు భాగంలో హెడ్‌ ల్యాంప్‌ ల మధ్య గ్లాస్ బ్లాక్ స్ట్రిప్ ఇవ్వడంతో కారు మరింత వెడల్పుగా కనిపిస్తుంది. బంపర్‌ను కూడా కొత్తగా డిజైన్ చేశారు. ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌, బ్లాక్ ఫినిషింగ్‌, కొత్త అల్లాయ్ వీల్స్ కారుకు స్పోర్టీ లుక్ తీసుకొచ్చాయి. వెనుక భాగంలో కనెక్టెడ్ స్టైల్ టెయిల్‌ ల్యాంప్స్ ఇవ్వడంతో మరింత ప్రీమియంగా కనిపిస్తోంది.

Advertisement

టియాగో EVలో కూడా ఇదే తరహా డిజైన్ మార్పులు ఉన్నాయి. అయితే, ఇది ఎలక్ట్రిక్ వాహనం కావడంతో ప్రత్యేక EV బ్యాడ్జింగ్‌, క్లోజ్డ్ గ్రిల్‌, కొత్త కలర్ ఆప్షన్లు, బ్లాక్ రూఫ్ లాంటి ప్రత్యేక ఫీచర్లు ఇవ్వనున్నారు. పెట్రోల్ మోడల్‌ తో పోలిస్తే EV వెర్షన్ మరింత మోడర్న్‌ గా కనిపించనుంది.

ఇంటీరియర్ గురించి..

రెండు కార్లలో కొత్త డ్యాష్‌ బోర్డ్ డిజైన్ ఇచ్చారు. పెద్ద ఫ్లోటింగ్ టచ్‌ స్క్రీన్‌, పూర్తిగా డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్‌, కొత్త స్టీరింగ్ వీల్ డిజైన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. టియాగో EVలో Tata.ev బ్రాండింగ్ ఉన్న స్టీరింగ్ ఉండగా, సాధారణ టియాగోలో టాటా లోగో ఉంటుంది. అంతేకాదు, 360 డిగ్రీ కెమెరా, వైర్‌ లెస్ ఛార్జింగ్‌, కొత్త స్టోరేజ్ స్పేస్‌ లు, ఛార్జింగ్ పోర్ట్‌ లు కూడా ఉన్నాయి. క్యాబిన్‌ లో డ్యూయల్ టోన్ బ్లాక్ బీజ్ థీమ్ ఉపయోగించారు. కొత్త సీటు డిజైన్‌, వెనుక AC వెంట్లు, USB ఛార్జింగ్ పోర్ట్‌ లు ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని ఇస్తాయి. చిన్న హ్యాచ్‌ బ్యాక్ అయినప్పటికీ, లోపల ప్రీమియం ఫీలింగ్ ఇవ్వడానికి టాటా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.

ఇంజిన్ గురించి..

Advertisement

ఇంజన్ పరంగా పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. టియాగోలో ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కొనసాగనుంది. CNG ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. మాన్యువల్, AMT గేర్‌ బాక్స్ ఎంపికలు కొనసాగనున్నాయి. CNG మోడల్‌ లో డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ ఉండటం వల్ల బూట్ స్పేస్ ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు.  టియాగో EVలో 19.2kWh, 24kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు కొనసాగవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 223 నుంచి 293 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వొచ్చని కంపెనీ చెబుతోంది. కొత్త వెర్షన్‌లో బ్యాటరీ సెటప్‌లో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. అటు BaaS   ఆప్షన్ కూడా తీసుకురావచ్చని సమాచారం.

ధర ఎంత అంటే?

ధరల విషయానికి వస్తే.. ప్రస్తుతం టియాగో ధర రూ.4.59 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, టియాగో EV ధర రూ.7.99 లక్షల నుంచి మొదలవుతోంది. కొత్త ఫీచర్లు రావడంతో ధరలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది.

Read Also: ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ల లాంచ్ డేట్ ఫిక్స్.. వారెవ్వా.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×