E-Paper
Advertisement

టాటా సియెర్రా సంచలనం.. ఒకేసారి మూడు కొత్త వెర్షన్లతో ఎంట్రీ!

టాటా సియెర్రా సంచలనం.. ఒకేసారి మూడు కొత్త వెర్షన్లతో ఎంట్రీ!
Advertisement

3 New Tata Sierra SUVs: భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మోడళ్లలో టాటా సియెర్రా ఒకటి. ఒకప్పుడు భారతీయ రోడ్లపై ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ ఐకానిక్ SUVని టాటా మోటార్స్ సరికొత్త లుక్ లో తిరిగి తీసుకొచ్చింది. గత ఏడాది సియెర్రాను అధికారికంగా పరిచయం చేయగా, 2026లో డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఈ SUV రోడ్లపై కనిపిస్తూ మంచి స్పందనను అందుకుంటోంది.  ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న సియెర్రాతో పాటు టాటా మరో మూడు కొత్త వెర్షన్లను కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. వీటిలో ఎలక్ట్రిక్ వెర్షన్, హైబ్రిడ్ వెర్షన్, అలాగే ఆల్ వీల్ డ్రైవ్(AWD) మోడల్ ఉన్నాయి.

1.సియెర్రా EV

రాబోయే మోడళ్లలో ఎక్కువ మంది ఎదురుచూస్తున్నది సియెర్రా ఎలక్ట్రిక్ వెర్షన్. ఈ SUV ఇప్పటికే చాలాసార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. ప్రస్తుతం ఉత్పత్తి దశకు చేరుకున్న ఈ మోడల్ త్వరలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. సియెర్రా EV, టాటా కొత్త Acti.ev+ ప్లాట్‌ ఫారమ్‌ పై ఆధారపడి ఉంటుంది. డిజైన్ పరంగా చూస్తే ఇది పెట్రోల్, డీజిల్ వెర్షన్‌ను పోలి ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ మోడల్ కావడంతో క్లోజ్డ్ గ్రిల్, కొత్త బంపర్ డిజైన్, ప్రత్యేక వీల్స్ లాంటి కొన్ని మార్పులు ఉండనున్నాయి. ఇందులో 65 kWh మరియు 75 kWh బ్యాటరీ ప్యాక్‌ లు వచ్చే అవకాశం ఉంది. ఇవే బ్యాటరీలు హారియర్ EVలో కూడా అందుబాటులో ఉన్నాయి. మంచి డ్రైవింగ్ రేంజ్‌తో పాటు సింగిల్ మోటార్, డ్యూయల్ మోటార్ ఆప్షన్లలో ఈ SUV అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే, మొదటి నుంచే RWD, AWD వెర్షన్లు కూడా అందుబాటులో ఉండొచ్చు.

2.సియెర్రా హైబ్రిడ్

Advertisement

టాటా సియెర్రాలో కంపెనీ సరికొత్త 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ ను అందించింది. తక్కువ వేరియంట్లలో నాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్, టాప్ వేరియంట్లలో టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అందిస్తున్నారు. ఈ ఇంజిన్ హైబ్రిడ్ టెక్నాలజీకి రెడీగా ఉంటుంది. అట్కిన్సన్ సైకిల్ ఆధారంగా పనిచేసే ఈ ఇంజిన్‌ ను చిన్న బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్‌ తో జతచేసి స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌గా మార్చే అవకాశం ఉంది.  భవిష్యత్తులో ఉద్గార నిబంధనలు మరింత కఠినతరం కానున్న నేపథ్యంలో, డీజిల్ ఇంజిన్లకు బదులుగా టాటా హైబ్రిడ్ టెక్నాలజీపై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

3.సియెర్రా AWD

సియెర్రా విడుదలైన సమయంలోనే చాలా మంది వినియోగదారులు AWD వెర్షన్ కోసం ఎదురుచూశారు. ఎందుకంటే, ఈ SUV ఆధారపడిన ప్లాట్‌ ఫారమ్ ఆల్ వీల్ డ్రైవ్‌కు సపోర్టు ఇస్తుందని టాటా ఇప్పటికే ప్రకటించింది. అయితే ప్రస్తుతం మార్కెట్లో రెండు చక్రాలకు మాత్రమే పవర్ అందించే 2WD వెర్షన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో AWD మోడల్‌ ను కూడా తీసుకురావాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ వెర్షన్ 2027 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా. అయితే ఇది పెట్రోల్ ఇంజిన్‌ తో వస్తుందా? డీజిల్‌ తో వస్తుందా? అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. మొత్తంగా టాటా సియెర్రా భవిష్యత్తులో EV, హైబ్రిడ్, AWD రూపాల్లో అన్ని వర్గాల కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది.

Advertisement

Read Also: విడుదలకు ముందు టాటా సియెర్రా ఈవీ టీజర్ లాంచ్.. లుక్ చూస్తే మతిపోవడం పక్కా!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×