E-Paper
Advertisement

సియెర్రా ఈవీ బేస్ వేరియంట్ డీటైల్స్ లీక్.. వామ్మో.. సింగిల్ ఛార్జ్ తో అంత రేంజా!?

సియెర్రా ఈవీ బేస్ వేరియంట్ డీటైల్స్ లీక్.. వామ్మో.. సింగిల్ ఛార్జ్ తో అంత రేంజా!?
Advertisement

Tata Sierra EV India Launch: భారత ఆటో మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాటా సియెర్రా EV. ఇప్పటికే పలు ఆటో ఎక్స్‌ పోలలో ప్రదర్శించిన ఈ వెహికల్ త్వరలోనే భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఈ ఈవీకి సంబంధించి పలు కీలక వివరాలు లీక్ అయ్యాయి.

బేస్ వేరియంట్‌లో 65kWh బ్యాటరీ ప్యాక్‌

సియెర్రా ఈవీ బేస్ వేరియంట్‌లో 65kWh బ్యాటరీ ప్యాక్‌ ను అందించనున్నట్లు తెలుస్తోంది. టాటా సియెర్రా EV ప్యూర్ బేస్ వేరియంట్‌ లో ఈ 65kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించనున్నారు. ఇదే బ్యాటరీ ప్రస్తుతం టాటా హారియర్ EVలో కూడా అందుబాటులో ఉంది. దీంతో సియెర్రా EV కూడా మంచి డ్రైవింగ్ రేంజ్‌ ను అందిస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. హారియర్ EVలో ఉన్న 65kWh బ్యాటరీ ప్యాక్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే.. 538 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇందులో 238bhp శక్తి, 315Nm టార్క్ ఉత్పత్తి చేసే రియర్ వీల్ డ్రైవ్ మోటార్ ఉంటుంది. ఇదే సెటప్‌ ను సియెర్రా EVలో కూడా కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

టాప్ వేరియంట్ లో 75kWh బ్యాటరీ ప్యాక్‌

Advertisement

ఇక టాప్ వేరియంట్లలో పెద్ద 75kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించే అవకాశం ఉంది. ఈ బ్యాటరీతో కూడిన ఆల్ వీల్ డ్రైవ్,  క్వాడ్ వీల్ డ్రైవ్ వెర్షన్ ఒకసారి ఛార్జ్ చేస్తే 622 కిలోమీటర్ల వరకు ప్రయాణించనుంది. ఈ వెర్షన్‌ లో ముందు భాగంలో ఒక మోటార్, వెనుక భాగంలో మరో మోటార్ ఉండే అవకాశం ఉంది. ఈ పవర్‌ ట్రెయిన్ మొత్తం 504Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుందని తెలుస్తోంది. ఇది ఈ విభాగంలో అత్యధిక టార్క్ అందించే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ఎక్కువ దూరం ప్రయాణించే వినియోగదారులకు ఈ మోడల్ బెస్ట్ ఆప్షన్ కానుంది.

ఇంటి దగ్గరే ఛార్జింగ్ చేసుకునే అవకాశం

ఛార్జింగ్ విషయంలో కూడా టాటా కంపెనీ వినియోగదారులకు మంచి సౌకర్యాలను అందించే అవకాశం ఉంది. సియెర్రా EVతో పాటు 3.3kW ఛార్జర్‌, ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 7.2kW AC ఫాస్ట్ ఛార్జర్‌ ను కూడా అందించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇంటి దగ్గరే వాహనాన్ని సులభంగా ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Advertisement

టాటా మోటార్స్‌కు ఇది ఎనిమిదో ఎలక్ట్రిక్ వాహనం కానుంది. గత కొన్ని సంవత్సరాలుగా సియెర్రా EV కాన్సెప్ట్ రూపంలో పలు సందర్భాల్లో కనిపిస్తూ వస్తోంది. చివరకు ఈ ఎస్‌యూవీ జూన్ 30న భారత మార్కెట్లో అధికారికంగా విడుదల కానుంది.

ఆకట్టుకుంటున్న డిజైన్, ఫీచర్లు

డిజైన్, ఫీచర్ల పరంగా ఈ ఎలక్ట్రిక్ మోడల్, ఇప్పటికే అందుబాటులో ఉన్న సియెర్రా పెట్రోల్, డీజిల్ వెర్షన్లకు చాలా వరకు దగ్గరగా ఉండే అవకాశం ఉంది. విశాలమైన క్యాబిన్, ఆధునిక ఫీచర్లు, పెద్ద టచ్‌స్క్రీన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఇందులో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ధర ఎంత అంటే?

టాటా సియెర్రా EV ధర రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. మార్కెట్లో ఇది మారుతి ఇ-విటారా, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మహీంద్రా XEV 9e, మహీంద్రా BE6, టాటా కర్వ్ EV వంటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Read Also: 2031 నాటికి 15 మోడళ్లు.. టాటా ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×