E-Paper
Advertisement

అమ్మకాల్లో టాటా పంచ్ జోష్.. ఏకంగా 8 లక్షల మార్క్ క్రాస్!

అమ్మకాల్లో టాటా పంచ్ జోష్.. ఏకంగా 8 లక్షల మార్క్ క్రాస్!
Advertisement

Tata Punch Hits 8 Lakh Sales: టాటా మోటార్స్‌  పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా పంచ్ మరో కీలక మైలురాయిని అందుకుంది. దేశీయ మార్కెట్లో ఏకంగా 8 లక్షల అమ్మకాల మార్కును దాటింది. టాటా ప్యాసింజర్ వాహనాల శ్రేణిలో నెక్సాన్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఎస్‌యూవీగా పంచ్ గుర్తింపు పొందింది. ముఖ్యంగా 7 లక్షల అమ్మకాల నుంచి 8 లక్షల యూనిట్లకు చేరుకోవడానికి ఐదు నెలల కంటే తక్కువ సమయం పట్టడం విశేషం.

అక్టోబర్‌ 2021లో మార్కెట్ లోకి అడుగు పెట్టిన పంచ్‌

టాటా మోటార్స్.. టాటా పంచ్ ను అక్టోబర్ 2021లో మార్కెట్లోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి జూన్ 2026 చివరి వరకు మొత్తం 7,97,479 యూనిట్లు అమ్మింది. జూలై మొదటి వారంలోనే మరో 2,521 యూనిట్లు అమ్ముడవడంతో మొత్తం అమ్మకాలు 8 లక్షల మార్కును దాటాయి. అంతేకాదు, ఈ ఏడాది జూన్ నెలలో పంచ్ అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. ఒక్క జూన్‌లోనే 21,006 యూనిట్లు డీలర్లకు పంపిణీ అయ్యాయి. అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ లో మొత్తం 60,321 యూనిట్లు విక్రయించి,  దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీల్లో ఒకటిగా నిలిచింది.

పంచ్ సక్సెస్ కు కారణం ఏంటంటే?

Advertisement

పంచ్ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి వినియోగదారులకు అందుబాటులో ఉన్నపలు రకాల పవర్‌ ట్రెయిన్ ఆప్షన్స్.ప్రస్తుతం ఈ మోడల్ పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వెర్షన్లలో లభిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ లో కొత్త డిజైన్, మెరుగైన ఇంటీరియర్, అదనపు ఫీచర్లు, కొత్త టర్బో పెట్రోల్ ఇంజిన్, సీఎన్‌జీ- ఏఎంటీ ఆప్షన్, అప్‌ డేట్ చేసిన పంచ్ ఈవీ లాంటి ఛేంజెస్ తో వినియోగదారులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం టాటా పంచ్ మొత్తం 32 వేరియంట్లలో అందుబాటులో ఉంది. పెట్రోల్ మోడల్ ప్రారంభ ధర రూ. 5.70 లక్షలు కాగా, సీఎన్‌జీ వేరియంట్ రూ. 6.80 లక్షలు, పంచ్ ఈవీ ధర రూ. 9.69 లక్షల నుంచి ప్రారంభమవుతోంది.

అమ్మకాల పరంగా పంచ్ సరికొత్త రికార్డులు

అమ్మకాల పరంగా పంచ్ వేగంగా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2021లో విడుదలైన కేవలం 10 నెలల్లోనే 1 లక్ష అమ్మకాల మైలురాయిని చేరుకుంది. ఆ తర్వాత వరుసగా 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షల మార్కులను దాటుతూ ఇప్పుడు 8 లక్షల విక్రయాల రికార్డును నమోదు చేసింది. దేశీయ మార్కెట్లో 8 లక్షల అమ్మకాల మార్కును అత్యంత వేగంగా చేరుకున్న కాంపాక్ట్ ఎస్‌యూవీగా టాటా పంచ్ నిలిచింది. ఈ మైలురాయిని చేరుకోవడానికి పంచ్‌కు కేవలం 57 నెలలు పట్టింది. ఇదే సమయంలో మారుతి బ్రెజ్జాకు సుమారు 80 నెలలు, హ్యుందాయ్ వెన్యూకు 85 నెలలు, టాటా నెక్సాన్‌కు 89 నెలలు పట్టినట్లు కంపెనీ తెలిపింది. అందుబాటు ధర, ఆకట్టుకునే డిజైన్, భిన్నమైన ఫ్యూయల్ ఆప్షన్స్, అత్యాధునిక   ఫీచర్లు టాటా పంచ్‌ను  వినియోగదారుల్లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటిగా నిలబెట్టాయి.

Advertisement

Read Also: తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×