E-Paper
Advertisement

జూన్ నెలలో అంతా ఆ కంపెనీ కారే కొన్నారు.. ఇంతకీ దాని స్పెషల్ ఏమిటీ?

జూన్ నెలలో అంతా ఆ కంపెనీ కారే కొన్నారు.. ఇంతకీ దాని స్పెషల్ ఏమిటీ?
Advertisement

June 2026 Car Sales:  జూన్ 2026 కార్ల అమ్మకాల్లో టాటా పంచ్ మరోసారి తన సత్తా చాటింది. పెట్రోల్, CNG, ఎలక్ట్రిక్ లాంటి మూడు రకాల పవర్‌ ట్రెయిన్‌లలో అందుబాటులో ఉన్న ఈ మైక్రో SUV,  దేశంలో అత్యధికంగా అమ్ముడైన ప్యాసింజర్ కారుగా నిలిచింది. టాటా మోటార్స్ జూన్‌ లో మొత్తం 21,006 పంచ్, పంచ్.ev యూనిట్లను అమ్మింది. మారుతి సుజుకి, మహీంద్రా, హ్యుందాయ్ లాంటి కంపెనీల ప్రముఖ మోడళ్లను వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అమ్మకాల పరంగా టాటా నెక్సాన్ 18,335 యూనిట్లతో రెండో స్థానంలో ఉండగా, మారుతి సుజుకి డిజైర్ 17,899 యూనిట్లతో మూడో స్థానంలో నిలిచింది.

పంచ్ సక్సెస్ వెనుక కారణం ఏంటంటే?

టాటా పంచ్ విజయానికి ప్రధాన కారణం విభిన్నమైన పవర్‌ ట్రెయిన్ ఆప్షన్స్. పెట్రోల్, CNG, టర్బో పెట్రోల్, EV రూపాల్లో అందుబాటులో ఉండటం వల్ల  కొనుగోలుదారులు తమకు సరిపోయే వేరియంట్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటిసారి కారు కొనేవారు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు కోరుకునేవారు, EV వైపు అడుగులు వేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా మారింది.

అద్భుతమైన ఫీచర్లు

Advertisement

ఫీచర్ల పరంగా కూడా 2026 టాటా పంచ్ ఆకట్టుకుంటోంది. ఇందులో 10.25 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, వైర్‌ లెస్ ఛార్జర్, 360 డిగ్రీల కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్, ప్రీమియం ఆడియో సిస్టమ్ లాంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. అలాగే 90 డిగ్రీల వరకు పూర్తిగా తెరుచుకునే డోర్లు రోజువారీ వినియోగాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి.

ఇంజిన్ గురించి..

కొత్త 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 120 bhp శక్తిని అందిస్తుంది. సాధారణ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కూడా మంచి పనితీరును ఇస్తుంది. CNG వేరియంట్‌లో ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో పాటు AMT గేర్‌బాక్స్‌ను అందించడం మరో ప్రత్యేకత. దీనివల్ల బూట్ స్పేస్ కూడా తగ్గకుండా ఉంటుంది.

Advertisement

ఎలక్ట్రిక్ వేరియంట్ అయిన పంచ్.ev కూడా మంచి ఆదరణ పొందుతోంది. దీని ధర రూ.9.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) పథకం ద్వారా తక్కువ ప్రారంభ ధరతో కొనుగోలు చేసే అవకాశం కూడా టాటా కల్పిస్తోంది. 30 kWh బ్యాటరీతో ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 365 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. పెద్ద బ్యాటరీ వేరియంట్‌ లో ఇంకా మంచి రేంజ్ అందిస్తుంది. ఛార్జింగ్ విషయంలో కూడా పంచ్.ev వేగంగా పని చేస్తుంది. 65kW DC ఫాస్ట్ ఛార్జర్‌ తో కేవలం 26 నిమిషాల్లో 20 నుంచి 80 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. అంతేకాకుండా హై వోల్టేజ్ బ్యాటరీపై అపరిమిత కిలోమీటర్లతో లైఫ్ టైమ్ వారంటీ ఇస్తుంది. పలు రకాల పవర్‌ ట్రెయిన్‌లు, ఆధునిక ఫీచర్లు, పోటీ ధరలు, మంచి భద్రతా ప్రమాణాలు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు లాంటి కారణాలతో టాటా పంచ్ ప్రస్తుతం భారత మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా కొనసాగుతోంది.

Read Also: మారుతి బంపర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.90 వేల డిస్కౌంట్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×