E-Paper
Advertisement

నానో 2.0 రిలీజ్‌ కు కౌంట్‌డౌన్.. టీజర్‌ తోనే దుమ్మురేపిన టాటా!

నానో 2.0 రిలీజ్‌ కు కౌంట్‌డౌన్.. టీజర్‌ తోనే దుమ్మురేపిన టాటా!
Advertisement

Tata Nano 2.0 Coming Soon: భారత ఆటోమొబైల్ రంగంలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన టాటా నానో మరోసారి మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. “టాటా నానో 2.0 – సమయం ఆసన్నమైంది!” అంటూ తాజాగా టాటా మోటార్స్ విడుదల చేసిన టీజర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నానో కొత్త వెర్షన్ నిజంగానే రాబోతోందా? అనే ఆసక్తి కార్ లవర్స్ లో పెరిగింది.

సామాన్యుల కోసం టాటా నానో   

కొన్నేళ్ల క్రితం టాటా నానోను దేశంలోని మధ్యతరగతి, సామాన్య కుటుంబాలు కూడా సొంతంగా కారు కొనుగోలు చేయాలనే లక్ష్యంతో మార్కెట్లోకి తీసుకొచ్చారు. తక్కువ ధరలో కారును అందించాలనే ఆలోచనతో రూపొందించిన ఈ కారు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే, ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగకపోవడంతో చివరకు దీని ఉత్పత్తిని నిలిపివేశారు. ఇప్పుడు విడుదలైన తాజా టీజర్‌తో నానో మళ్లీ రాబోతుందనే ప్రచారం జోరందుకుంది. “ప్రగతి పథంలో ఏ కుటుంబమూ వెనుకబడిపోకూడదు” అంటూ.. అదే కలను కొత్త లక్ష్యంతో తీసుకొస్తున్నట్లు టీజర్‌లో కంపెనీ వివరించింది. చివర్లో ‘త్వరలో విడుదల’ అని రాయడంతో మరింత ఆసక్తి పెరిగింది.

ఇంకా వెల్లడికాని అధికారిక వివరాలు

Advertisement

ప్రస్తుతం టాటా మోటార్స్ నుంచి నానో 2.0కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు. కొత్త మోడల్ ఎలా ఉండబోతోంది? పెట్రోల్ కారా? ఎలక్ట్రిక్ వెర్షనా? ధర ఎంత ఉండొచ్చు? వంటి అంశాలపై కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆటో నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుతం భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలపై డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టాటా నానో పేరుతో కొత్త ఎలక్ట్రిక్ కారు తీసుకురావచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే ఇది పూర్తిగా ఊహాగానమే తప్ప, దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.

నానో ఒకప్పుడు సామాన్యుల కారుగా గుర్తింపు పొందింది. తక్కువ ధరలో కారును అందించాలనే టాటా మోటార్స్ ప్రయత్నం అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అందుకే ఇప్పుడు నానో పేరును మళ్లీ వినగానే చాలామందిలో పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. కొత్త టీజర్ విడుదల కావడంతో సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కొందరు నానో 2.0 ఎలక్ట్రిక్ వెర్షన్ లో రావాలని కోరుకుంటుండగా, మరికొందరు లేటెస్ట్ డిజైన్, మెరుగైన ఫీచర్లతో మార్కెట్లోకి వస్తే మంచి ఆదరణ పొందుతుందని అభిప్రాయపడుతున్నారు. ‘టాటా నానో 2.0 – సమయం ఆసన్నమైంది’ అనే టీజర్ ఆటోమొబైల్ రంగంలో ఆసక్తిని పెంచింది.

Advertisement

Read Also: ఏంటీ.. ఈ టైమ్ లో ఈవీ ఛార్జ్ చేస్తే కరెంటు బిల్లు అంత తక్కువగా వస్తుందా? వెంటనే ట్రై చేయండి!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×