E-Paper
Advertisement

2031 నాటికి 15 మోడళ్లు.. టాటా ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే!

2031 నాటికి 15 మోడళ్లు.. టాటా ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Tata’s Big 2031 Plan: భారత ఆటోమొబైల్ రంగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు టాటా మోటార్స్ అదిరిపోయే ఫ్లాన్స్ వేస్తోంది. ప్రస్తుతం కంపెనీ దగ్గర తొమ్మిది ప్యాసింజర్ వెహికల్ మోడళ్లు ఉండగా, 2031 ఆర్థిక సంవత్సరం నాటికి వాటిని 15 మోడళ్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఆరు కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకురావడంతో పాటు, ఇప్పటికే ఉన్న మోడళ్లలో 20కి పైగా మార్పులు చేయాలని కంపెనీ నిర్ణయించింది.

2031 నాటికి 12 లక్షల యూనిట్ల అమ్మకాలు

ఇన్వెస్టర్ డే సమావేశంలో టాటా మోటార్స్ తన ఫ్యూచర్ ప్లాన్ ను వెల్లడించింది. వచ్చే ఐదేళ్లలో భారత ప్యాసింజర్ వాహన మార్కెట్‌లో 18 నుంచి 20 శాతం మార్కెట్ వాటా సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి కొత్త మోడళ్లతో పాటు అత్యాధునిక టెక్నాలజీ, కొత్త పవర్‌ ట్రెయిన్ ఆప్షన్స్, విభిన్న బాడీ స్టైల్స్‌ పై దృష్టి పెట్టనుంది. టాటా మోటార్స్ వార్షిక ప్యాసింజర్ వాహనాల అమ్మకాలను కూడా భారీగా పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఏడాదికి సుమారు 6.4 లక్షల కార్లను విక్రయిస్తోంది. అయితే 2031 నాటికి ఈ సంఖ్యను 12 లక్షల యూనిట్లకు పైగా తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఎలక్ట్రిక్ మోడల్స్ పై స్పెషల్ ఫోకస్

Advertisement

ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కూడా కంపెనీ భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం టాటా దగ్గర ఆరు ఎలక్ట్రిక్ మోడళ్లు ఉండగా, వాటిని 10 మోడళ్లకు విస్తరించనుంది. 2031 నాటికి మొత్తం ప్యాసింజర్ వాహన అమ్మకాలలో 30 శాతం వాటా ఎలక్ట్రిక్ కార్లదే ఉండాలని కంపెనీ భావిస్తోంది. ఈ లెక్కన చూస్తే, ఏడాదికి దాదాపు 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యే అవకాశం ఉంది. రాబోయే కొత్త మోడళ్లలో టాటా సియెర్రా ఈవీకి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ కారు జూన్ 30న అధికారికంగా ఆవిష్కరించనున్నారు. పండుగ సీజన్ నాటికి సఫారీ ఈవీ కూడా మార్కెట్లోకి రానుంది. మరోవైపు, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అవిన్యా ఈవీ సిరీస్ కూడా వచ్చే ఏడాది ప్రారంభం కానుంది.

సీఎన్‌జీ వాహనాలపైనా దృష్టి

ఎలక్ట్రిక్ కార్లతో పాటు సీఎన్‌జీ వాహనాలపై కూడా టాటా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. 2031 నాటికి భారత ప్యాసింజర్ వాహన మార్కెట్‌లో ఈవీ, సీఎన్‌జీ వాహనాలు కలిపి దాదాపు 45 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంటాయని కంపెనీ అంచనా వేస్తోంది. అందుకే ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల అభివృద్ధికి పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. భవిష్యత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచనుంది. ప్రస్తుతం సంవత్సరానికి సుమారు 9 లక్షల వాహనాలను తయారు చేసే సామర్థ్యం ఉండగా, రాబోయే రెండు నుంచి మూడు సంవత్సరాల్లో దీన్ని 13 లక్షల యూనిట్లకు పెంచాలని నిర్ణయించింది.

Advertisement

Read Also: టాటా To మహీంద్రా.. మేలో అమ్మకాల్లో దుమ్మురేపిన టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×