E-Paper
Advertisement

డిమాండ్ పెరగడంతో టాటా మోటార్స్ కీలక నిర్ణయం.. EV ఉత్పత్తి 50% పెంపు!

డిమాండ్ పెరగడంతో టాటా మోటార్స్ కీలక నిర్ణయం.. EV ఉత్పత్తి 50% పెంపు!
Advertisement

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే మూడు నుంచి నాలుగు నెలల్లో ఈవీల ఉత్పత్తిని సుమారు 50 శాతం వరకు పెంచాలని కంపెనీ ప్రణాళికలు వేస్తోంది. ప్రస్తుతం నెలకు 9,000 నుంచి 10,000 ఈవీలను సరఫరా చేస్తున్న టాటా, త్వరలోనే ఈ సంఖ్యను 15,000 యూనిట్ల వరకు పెంచే లక్ష్యంతో ముందుకెళ్తోంది. టాటా మోటార్స్ కు గత రెండు నెలలుగా భారీ ఈవీ బుకింగ్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో  ఉత్పత్తికు నిర్ణయం తీసుకుంది.

ఈవీల వైపు మొగ్గు చూపుతున్న కొనుగోలుదారులు

ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కూడా వినియోగదారుల ఆలోచనా విధానాన్ని మార్చిందని టాటా మోటార్స్ వెల్లడించింది. ఎక్కువ మంది కొనుగోలుదారులు తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో కూడిన వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఈవీలు, సీఎన్‌జీ వాహనాలపై ఆసక్తి పెరుగుతోంది. ఇంధన ధరలు పెరిగితే కుటుంబాల నెలవారీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఒక లీటర్ పెట్రోల్ ధర రూ.10 పెరిగితే నెలకు 100 లీటర్లు వినియోగించే వ్యక్తికి అదనంగా రూ.1,000 భారం పడుతుంది. దీంతో కొత్త వాహనం కొనుగోలు చేసే సమయంలో చాలామంది ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు.

రెండున్నర రెట్లు పెరిగిన ఈవీల డిమాండ్

Advertisement

ప్రస్తుతం ఈవీలకు వస్తున్న డిమాండ్ గతంతో పోలిస్తే రెండు నుంచి రెండున్నర రెట్లు ఎక్కువగా ఉందని టాటా మోటార్స్ వెల్లడించింది. చాలా మంది తమ ఇంట్లో కనీసం ఒక ఎలక్ట్రిక్ కారైనా ఉండాలని భావిస్తున్నారని కంపెనీ చెబుతోంది. మే నెలలో వచ్చిన మొత్తం బుకింగ్‌లలో దాదాపు 30 శాతం ఈవీల వాటానే కావడం విశేషం. ప్రస్తుతం టాటా మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలలో ఈవీల వాటా సుమారు 15 శాతంగా ఉంది. ఉత్పత్తి సామర్థ్యం పెరిగితే ఈవీల అమ్మకాలు మరింత వేగంగా పెరిగే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది.

30 శాతానికి పెరగనున్న ఈవీల వాటా

రాబోయే మూడు నుంచి నాలుగు సంవత్సరాల్లో మొత్తం అమ్మకాలలో ఈవీల వాటాను 30 శాతానికి పైగా తీసుకెళ్లాలని టాటా లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కంపెనీ ఇప్పటికే సరఫరాదారులతో కలిసి పనిచేస్తోంది. అవసరమైన విడిభాగాల సరఫరా పెరిగేలా చర్యలు తీసుకుంటోంది. కంపెనీ తయారీ సామర్థ్యం బలంగానే ఉన్నప్పటికీ, కొన్ని అదనపు పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది.

Advertisement

పెరుగుతున్న ఇంధన ధరలు, వినియోగదారుల మారుతున్న అభిరుచులు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు దేశంలో ఈవీలకు కొత్త ఊపునిస్తున్నాయి. ఈ పరిస్థితిని అవకాశంగా మార్చుకుని టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని భారీగా పెంచేందుకు సిద్ధమవుతోంది.

Read Also: వచ్చే 12 నెలల్లో 5 కొత్త కార్లు లాంచ్.. మారుతి ప్లాన్ మామూలుగా లేదుగా!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×