E-Paper
Advertisement

Tata Motors Sales: జనవరిలో దుమ్మురేపిన టాటా మోటర్స్, అమ్మో.. ఒకే నెలలో అన్ని కార్లు అమ్మిందా?

Tata Motors Sales: జనవరిలో దుమ్మురేపిన  టాటా మోటర్స్, అమ్మో.. ఒకే నెలలో అన్ని కార్లు అమ్మిందా?
Advertisement

Tata Car Sales In January 2026: ప్రముఖ ఇండియన్ ఆటో మోబైల్ కంపెనీ టాటా మోటర్స్ కు దేశంలో ఉన్న క్రేజ్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కంపెనీకి చెందిన కార్లు మంచి సేఫ్టీ ఫీచర్స్, అంతకు మించి లుక్ తో వినియోగదారులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. గత ఏడాది అమ్మకాల్లో సత్తా చాటిన టాటా మోటార్స్ 2026లోనూ సత్తా చాటాయి. టాటా మోటార్స్ జనవరిలో ఏకంగా 71,000కి పైగా ఎక్కువ ప్యాసింజర్ కార్లను అమ్మింది. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. వీటిలో 822 యూనిట్లు అంతర్జాతీయ మార్కెట్లలో అమ్ముడయ్యాయి. మిగిలిన 70,222 యూనిట్లు మన దేశంలోనే అమ్ముడయ్యాయి. అటు టాటా నెక్సాన్ నేమ్‌ ప్లేట్, ICE, EV వెర్షన్లతో సహా, 23,000 యూనిట్లకు పైగా అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది.

గత ఏడాది డిసెంబర్ తో పోల్చితే భారీగా అమ్మకాలు 

టాటా మోటార్స్ జనవరి 2026 ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు,  డిసెంబర్ 2025తో పోల్చితే భారీగా పెరిగాయి. డిసెంబర్ లో 48,316 యూనిట్ల అమ్మగా, జనవరిలో 47.1 శాతం పెరిగాయి. అమ్ముడైన 71,044 యూనిట్లలో 9,052 ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. ఇవి డిసెంబర్ 2025తో పోల్చితే 72.7 కంటే ఎక్కువ శాతం వృద్ధిని సాధించాయి.

అమ్మకాల్లో దుమ్మురేపిన నెక్సాన్, పంచ్  

Advertisement

ఇక 2026లో కంపెనీ అమ్మకాల్లో టాటా నెక్సాన్, పంచ్ కార్లు రికార్డు అమ్మకాలను నమోదు చేశాయి. జనవరి 2026లో 19,000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. ఒక నెలలోనే ఇన్ని కార్లు అమ్ముడు కావడం ఇదే తొలిసారి. అదే సమయంలో టాటా పంచ్ 7 లక్షల క్యుమిలేటివ్ అమ్మకాలను దాటింది. టాటా కంపెనీలో ఇంత వేగంగా ఈ మైల్ స్టోన్ అందుకున్న తొలి కారుగా టాటా పంచ్ గుర్తింపు తెచ్చుకుంది.

సేల్స్ లో నెక్స్ జోష్..

జనవరి 2026లో టాటా కంపెనీ ఏకంగా 23,000 యూనిట్లకు పైగా నెక్సాన్‌ కార్లు విక్రయించింది. దీంతో ఈ SUV 10 లక్షల క్యుమిలేటివ్ అమ్మకాల మైలురాయిని దాటింది. ఇది మాత్రమే కాదు, టియాగో హ్యాచ్‌ బ్యాక్ మొత్తం అమ్మకాలు కూడా 7 లక్షల యూనిట్లను దాటాయి.

Advertisement

Read Also: బీఎండబ్ల్యూ లవర్స్‌కు క్రేజీ న్యూస్, కొత్త లోగో వచ్చేస్తోంది!

అటు టాటా సియెర్రా, హారియర్, సఫారీ పెట్రోల్ వెర్షన్లు, అలాగే ఫేస్‌లిఫ్టెడ్ పంచ్‌ తో సహా కొత్త లాంచ్‌లు వినియోగదారుల నుంచి మంచి ఆసక్తిని సంపాదించుకున్నాయి. కస్టమర్ డిమాండ్‌ కు అనుగుణంగా టాటా మోటార్స్ సియెర్రా ఉత్పత్తిని కూడా క్రమంగా పెంచింది. త్వరలోనే టాటా సియెర్రా కొత్త వెర్షన్ మార్కెట్ లోకి అందుబాటులోకి రానుంది. కొత్త సంవత్సరంలో కనబరిచిన అమ్మకాల వృద్ధిపై టాటా మోటార్స్ సంతోషం వ్యక్తం చేసింది. కొనుగోలుదారుల నుంచి వచ్చిన మంచి స్పందన, ఇలాగే కొనసాగాలని కోరుకుంటుంది.

Read Also: యమహా నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది, ఒకే ఛార్జ్ తో ఎంత దూరం వెళ్లొచ్చంటే?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×