// // High Speed Mega Charging Hub: ఇక ఈవీ ఛార్జింగ్‌ కోసం నో వెయిటింగ్.. హైస్పీడ్ మెగా ఛార్జింగ్ హబ్ ప్రారంభం! -->
E-Paper
Advertisement

ఇక ఈవీ ఛార్జింగ్‌ కోసం నో వెయిటింగ్.. హైస్పీడ్ మెగా ఛార్జింగ్ హబ్ ప్రారంభం!

ఇక ఈవీ ఛార్జింగ్‌ కోసం నో వెయిటింగ్.. హైస్పీడ్ మెగా ఛార్జింగ్ హబ్ ప్రారంభం!
Advertisement

Tata Fast Charging Hub in Hyderabad: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. టాటా పవర్ కంపెనీ లిమిటెడ్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ కలిసి హైదరాబాద్ హైటెక్ సిటీలో కొత్త హై-స్పీడ్ టాటా.ఈవీ మె గాఛార్జర్ హబ్‌ ను ప్రారంభించాయి. ఈ కొత్త ఛార్జింగ్ కేంద్రాన్ని హైటెక్ సిటీలోని ఐల్యాబ్స్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణంలో ఏర్పాటు చేశాయి.  హైదరాబాద్‌లో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ సదుపాయాన్ని అభివృద్ధి చేసినట్లు కంపెనీలు వెల్లడించాయి.

ఒకేసారి 6 ఈవీలకు ఛార్జింగ్

ప్రస్తుతం నగరంలో వ్యక్తిగత ఈవీలతో పాటు టాక్సీ సేవలు, కార్పొరేట్ వాహనాలు, కమర్షియల్ ఫ్లీట్లు, ఇంటర్‌ సిటీ ప్రయాణాలు చేసే వాహనాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. ఈ వాహనాలకు త్వరగా, ఈజీగా ఛార్జింగ్ అందించడమే ఈ మెగాఛార్జర్ హబ్ ముఖ్య ఉద్దేశమని కంపెనీ తెలిపింది. ఈ ఛార్జింగ్ హబ్ లో మొత్తం 360 కిలోవాట్ల ఛార్జింగ్ సామర్థ్యం ఉంది. ఇందులో మూడు 120 కిలోవాట్ల హైస్పీడ్ ఛార్జింగ్ డిస్పెన్సర్లు ఏర్పాటు చేశారు. వీటి సహాయంతో ఒకేసారి ఆరు ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

24 గంటల పాటు ఛార్జింగ్ సేవలు

Advertisement

ఈ ఛార్జింగ్ స్టేషన్ రోజుకు 24 గంటల పాటు పనిచేస్తుంది. దీంతో వాహనదారులు ఎప్పుడైనా తమ కార్లను ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రయాణాలు చేసే వారు, క్యాబ్ డ్రైవర్లు, కార్పొరేట్ ఉద్యోగులకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడనుంది. సాధారణ ఛార్జింగ్ స్టేషన్లతో పోలిస్తే ఈ హై స్పీడ్ మెగాఛార్జర్ హబ్‌ లో ఛార్జింగ్ సమయం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఈవీ వినియోగదారులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో టాటా పవర్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థలు దేశవ్యాప్తంగా వేగంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నాయి. హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ మెగాఛార్జర్ హబ్ భవిష్యత్తులో పెరగనున్న ఈవీ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని కంపెనీ వెల్లడించింది. నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత పెంచడానికి, ప్రజలు ఈవీల వైపు మళ్లించేలా చేయడానికి ఈ సదుపాయం ఉపయోగపడనుంది. హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ హై-స్పీడ్ టాటా.ఈవీ మెగాఛార్జర్ హబ్ సిటీ ఈవీ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మరో మైల్ స్టోన్ గా చెప్పుకోవచ్చు.

Advertisement

Read Also: సియెర్రా ఈవీ బేస్ వేరియంట్ డీటైల్స్ లీక్.. వామ్మో.. సింగిల్ ఛార్జ్ తో అంత రేంజా!?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×