E-Paper
Advertisement

టాటా కార్లు కొనేవారికి షాక్.. మళ్లీ ధరలు పెరిగాయ్!

టాటా కార్లు కొనేవారికి షాక్..  మళ్లీ ధరలు పెరిగాయ్!
Advertisement

Tata Cars Price Hike: టాటా కార్లు కొనాలనుకుంటున్న వారికి కంపెనీ బ్యాడ్ న్యూస్ చెప్పింది. మరోసారి కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జూలై 1 నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నట్లు టాటా అధికారికంగా ప్రకటించింది. ఈ ధరల పెంపు పెట్రోల్, డీజిల్ మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా వర్తించనున్నట్లు ప్రకటించింది. వాహనాల ధరలు గరిష్ఠంగా 1.5 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, అన్ని కార్లపై ఒకే స్థాయిలో పెంపు ఉండదని, మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల మార్పు ఉంటుందని టాటా మోటార్స్ వెల్లడించింది.

ధరల పెంపునకు కారణం ఏంటంటే?

కార్ల ధరల పెంపునకు ప్రధాన కారణం పెరుగుతున్న ముడి పదార్థాల ఖర్చులు, ఉత్పత్తి ధరలు, ద్రవ్యోల్బణ ప్రభావాన్ని కంపెనీ చూపించింది. గత కొంతకాలంగా తయారీ ఖర్చులు పెరుగుతున్నప్పటికీ, వాటిలో ఎక్కువ భాగాన్ని కంపెనీ భరించిందని తెలిపింది. అయితే, పరిస్థితులు సర్దుబాటుకాకపోవడంతో ధరలను పెంచక తప్పడం లేదని వెల్లడించింది.

Advertisement

ప్రస్తుతం టాటా మోటార్స్ భారత మార్కెట్లో పలు ప్రముఖ మోడళ్లను విక్రయిస్తోంది. వాటిలో టియాగో, టిగోర్, పంచ్, నెక్సాన్, కర్వ్, హారియర్, సఫారీ లాంటి ఐసీఈ వాహనాలతో పాటు టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ లాంటిఎలక్ట్రిక్ మోడళ్లు కూడా ఉన్నాయి. జూలై నుంచి ఈ మోడళ్లన్నింటి ధరల్లో స్వల్ప మార్పులు కనిపించే అవకాశం ఉంది.

ఏ కారు ధర ఎంత పెరుగుతుందంటే?

ప్రస్తుతం టాటా కార్ల ధరలు ఎంట్రీ లెవల్ టియాగోకు సుమారు రూ.4.70 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, టాప్ ఎండ్ హారియర్ ఈవీ ధర రూ.28.99 లక్షల వరకు ఉంది. 1.5 శాతం పెంపు అమలైతే కొన్ని హైఎండ్ వేరియంట్ల ధరలు రూ.40 వేలకుపైగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  ఈ ఏడాది టాటా కార్ల ధరలు పెరగడం ఇది రెండోసారి. గత ఏప్రిల్‌ లో కూడా కంపెనీ తన పెట్రోల్, డీజిల్ వాహనాల ధరలను సుమారు 0.5 శాతం వరకు పెంచింది. అయితే, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెరగడం మాత్రం ఈ ఏడాది ఇదే మొదటిసారి.

Advertisement

టాటా మాత్రమే కాకుండా ఇతర ప్రముఖ కార్ల తయారీ సంస్థలు కూడా ఇదే మార్గంలో నడుస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు పెరుగుతున్న తయారీ ఖర్చులు, ముడి పదార్థాల ధరల పెరుగుదలను కారణంగా చూపుతూ వాహనాల ధరలను సవరించాయి. ఇటీవల మారుతి సుజుకి, హ్యుందాయ్ లాంటి సంస్థలు కూడా ధరల పెంపును ప్రకటించాయి. సో, టాటా కారు కొనుగోలు చేయాలనుకునే వారు జూలై 1 వరకే నిర్ణయం తీసుకోవాలని ఆటో నిపుణులు సూచిస్తున్నారు.

Read Also: కొత్త హ్యుందాయ్ i20 లీక్.. క్రాసోవర్ లుక్‌ లో సూపరో సూపరు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×