E-Paper
Advertisement

మార్కెట్ లోకి కొత్త సుజుకి బర్గ్‌ మ్యాన్ స్ట్రీట్, ధర ఎంతో తెలుసా?

మార్కెట్ లోకి కొత్త సుజుకి బర్గ్‌ మ్యాన్ స్ట్రీట్, ధర ఎంతో తెలుసా?
Advertisement

Suzuki Burgman Street 2026 Launched: సుజుకి మోటార్ సైకిల్ ఇండియా కొత్త స్కూటర్ ను విడుదల చేసింది. బర్గ్ మ్యాన్ స్ట్రీట్ పేరుతో మార్కెట్ కు పరిచయం చేసింది. ఈ మ్యాక్సీ స్టైల్ 125cc స్కూటర్ ఇప్పటికే దేశంలో మంచి గుర్తింపు పొందింది. ఇప్పటి వరకు 11 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడవడంతో, ఫ్యామిలీ స్కూటర్ సెగ్మెంట్‌ లో బలమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు వచ్చిన ఈ కొత్త వెర్షన్ మరింత స్టైలిష్‌గా, సౌకర్యవంతంగా, టెక్నాలజీ పరంగా మరింత అప్ డేటెడ్ గా ఉంది.

రెండు వేరియంట్లలో అందుబాటులోకి..

కొత్త బర్గ్‌ మ్యాన్ స్ట్రీట్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. రైడ్ కనెక్ట్ ఎడిషన్ ధర సుమారు రూ.1.01 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, రైడ్ కనెక్ట్ TFT ఎడిషన్ ధర రూ.1.13 లక్షల వరకు ఉంటుంది. పాత బర్గ్‌ మ్యాన్ స్ట్రీట్ EX మోడల్ కూడా ఇంకా అమ్మకాల్లో కొనసాగుతుంది.

Advertisement

ఈ స్కూటర్ డిజైన్ లో పెద్దగా మార్పులు లేకపోయినా, కొన్ని కొత్త అప్‌ డేట్స్ పొందింది. ముందు భాగంలో LED హెడ్‌ ల్యాంప్స్‌ ను మరింత స్టైలిష్‌ గా మార్చారు. కొత్త ఇండికేటర్లు, టెయిల్ ల్యాంప్, మెటాలిక్ ఫినిష్ ఎంబ్లెమ్స్ స్కూటర్‌ కు ప్రీమియం లుక్ ఇస్తాయి. డార్క్ విండ్‌ స్క్రీన్, సైలెన్సర్ డిజైన్ కూడా కొంచెం స్పోర్టీగా కనిపిస్తుంది. రైడింగ్ సౌకర్యంలో కూడా  మార్పులు చేశారు. పెద్ద, వెడల్పాటి ఫుట్‌ బోర్డ్ అలాగే ఉంచడంతో, కాళ్లు ఎలాంటి ఇబ్బందిలేకుండా పెట్టుకుని కూర్చోవచ్చు. సీటు కూడా పొడవుగా ఉండటంతో రైడర్, పిలియన్ ఇద్దరికీ సరిపడా స్థలం ఉంటుంది. ముఖ్యంగా, సీటు కింద స్టోరేజ్‌ ను 24.6 లీటర్లకు పెంచడం పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఫుల్ ఫేస్ హెల్మెట్ కూడా సులభంగా పెట్టుకోవచ్చు.

ఫీచర్ల గురించి..

ఫీచర్ల పరంగా చూస్తే.. ఇందులో ఫ్రంట్ స్టోరేజ్ బాక్స్‌ లు, USB ఛార్జింగ్ పోర్ట్, హుక్స్ లాంటి రోజువారీ ఉపయోగానికి అవసరమైన సదుపాయాలు ఉన్నాయి. హైఎండ్ వేరియంట్‌ లో కీలెస్ స్టార్ట్ సిస్టమ్, రిమోట్ ఫాబ్ లాంటి ఆధునిక ఫీచర్లు కూడా అందిస్తున్నారు. TFT వేరియంట్‌ లో 4.2-అంగుళాల డిస్‌ ప్లే ఉంటుంది, ఇది మొబైల్ కనెక్టివిటీతో పాటు నావిగేషన్ సపోర్ట్ కూడా ఇస్తుంది.

బర్గ్ మ్యాన్ స్ట్రీట్ ఇంజిన్ గురించి..

Advertisement

ఈ స్కూటర్‌లో 124cc సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. సుమారు 8.2 bhp పవర్, 10.2 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. గత మోడల్‌ తో పోలిస్తే టార్క్ కొంచెం పెరిగింది. దీని వల్ల  రైడింగ్ మరింత స్మూత్‌గా ఉంటుంది. CVT ట్రాన్స్‌ మిషన్‌ ను కూడా మెరుగుపరిచారు. ఇంజన్ స్టార్ట్ సమయంలో సూండ్ తగ్గించే విధంగా కొత్త టెక్నాలజీ ఉపయోగించారు. ఎగ్జాస్ట్ సౌండ్ కూడా మరింత సాఫ్ట్‌ గా ఉండేలా ట్యూన్ చేశారు. స్కూటర్ ఫ్రేమ్‌ను తేలికగా, బలంగా మార్చారు. రోజువారీ ప్రయాణాలకు ప్రీమియం ఫీలింగ్‌ తో కూడిన స్కూటర్ కోసం చూస్తున్న వారికి బర్గ్ మ్యాన్ స్ట్రీట్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: TVS ఆర్బిటర్ V1, V2.. రెండింటిలో ఏది బెస్ట్ అంటే?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×