E-Paper
Advertisement

Suzuki e-Access Scooter: సుజుకి ఈ-యాక్సెస్ వచ్చేసింది, ఒక్క ఛార్జ్ తో ఎంత దూరం వెళ్తుందంటే..

Suzuki e-Access Scooter: సుజుకి ఈ-యాక్సెస్ వచ్చేసింది, ఒక్క ఛార్జ్ తో ఎంత దూరం వెళ్తుందంటే..
Advertisement

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త సుజుకి ఈ-యాక్సెస్ వచ్చేసింది. సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను పరిచయం చేసింది. తన సక్సెస్ ఫుల్ పెట్రోల్ వెర్షన్ ను ఇప్పుడు ఎలక్ట్రిక్ వెర్షన్ లో తీసుకొచ్చింది. దీని ధరను కంపెనీ సుమారు రూ.1.88 లక్షలుగా నిర్ణయించింది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. సుజుకి కొత్త డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. మెటాలిక్ మ్యాట్ ఫైబ్రోయిన్ గ్రేతో మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ ను మిక్స్ చేసింది. ఈ కలర్ యాడిషన్ తో ఈ-యాక్సెస్  నాలుగు కలర్ ఆప్షన్స్ లో రానుంది.

బ్యాటరీ పర్ఫార్మెన్, రేంజ్

సుజుకి ఈ-యాక్సెస్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీతో వస్తుంది. ఇది సాంప్రదాయ బ్యాటరీ కెమిస్ట్రీలతో పోలిస్తే ఎక్కువ సర్వీసును అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. సుజుకీ ఈ-యాక్సెస్‌ లో 3.07 kWh లిథియం ఐరన్‌ పాస్ఫేట్‌ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది ఫుల్ ఛార్జ్ తో 95 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ స్కూటర్‌లో 4.1kW ఎలక్ట్రిక్‌ మోటార్‌ పవర్ ను జెనరేట్ చేస్తుంది. ఇది 15 Nm పీక్‌ టార్క్‌ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ పోర్టబుల్‌ ఛార్జర్‌తో 0 నుంచి 80 శాతం ఛార్జింగ్‌ను 4 గంటల 30 నిమిషాల్లో చేస్తుంది. ఫాస్ట్‌ ఛార్జర్‌తో పూర్తి బ్యాటరీని ఛార్జ్‌ చేయడానికి 2 గంటల 12 నిమిషాల సమయం పడుతుందని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ టాప్‌ స్పీడ్‌ గంటకు 71 కిలోమీటర్లు ఉంటుందని సుజుకి తెలిపింది.

Advertisement

సుజుకి ఈ-యాక్సెస్ రివర్స్ మోడ్, రీజెనరేటివ్ బ్రేకింగ్‌తో పాటు మూడు రైడ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. వాటిలో ఒకటి  ఎకో, మరొకటి రైడ్ A, ఇంకొకటి రైడ్ B. తక్కువ బ్యాటరీ ఛార్జ్ స్థాయిలలో కూడా పనితీరు బాగుంటుందని సుజుకి తెలిపింది.  ఫీచర్ల పరంగా, ఎలక్ట్రిక్ స్కూటర్ LED లైటింగ్, డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్,  బెల్ట్ డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.

ఈ స్కూటర్ ఎక్కడ కొనుగోలు చేయాలంటే?

సుజుకి ఇ-యాక్సెస్‌ను ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న 1,200 కంటే ఎక్కువ సేల్స్, సర్వీస్ అవుట్‌ లెట్ నెట్‌ వర్క్‌ లో లభిస్తాయి. ఇక దేశ వ్యాప్తంగా 240 కంటే ఎక్కువ ప్రదేశాలలో DC ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. నెట్‌ వర్క్ అంతటా పోర్టబుల్ AC ఛార్జర్లను అందిస్తున్నట్లు వెల్లడించింది. అమ్మకాల తర్వాత కస్టమర్ సపోర్టింగ్ కోసం EV సాంకేతిక నిపుణులకు కూడా శిక్షణ ఇచ్చింది. గత ఏడాది భారత్ మొబిలిటీ ఎక్స్‌ పోలో ఈ-యాక్సెస్‌ ను కంపెనీ ప్రదర్శించింది. సుమారు ఏడాది తర్వాత దీనిని లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ఏథర్ రిజ్టా, టీవీఎస్ ఐక్యూబ్ లాంటి వాటికి పోటీ ఇచ్చినా, వాటితో పోల్చితే ధర ఎక్కువగా ఉండటం మైనస్ గా చెప్పుకోవచ్చు.

Advertisement

Read Also: కియా నుంచి కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV లాంచ్, EV2 ప్రత్యేకత ఏంటో తెలుసా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×