E-Paper
Advertisement

ఒకే ఛార్జ్‌ తో 350 మీ.. మార్కెట్లోకి అదిరిపోయే దేశీ ఎలక్ట్రిక్ కారు

ఒకే ఛార్జ్‌ తో 350 మీ.. మార్కెట్లోకి అదిరిపోయే దేశీ ఎలక్ట్రిక్ కారు
Advertisement

India’s New Affordable EV: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, తక్కువ ధరలో అందుబాటులో ఉండే కార్లకు డిమాండ్ కూడా పెరుగుతోంది. రోజువారీ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రేటర్ నోయిడాకు చెందిన సుందక్ సోలార్ సొల్యూషన్స్ సంస్థ సుందక్ నీరో EV అనే కొత్త ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసింది. ఈ కారును మధ్యతరగతి కుటుంబాలను లక్ష్యంగా పెట్టుకుని రూపొందించిన మోడల్‌  అని కంపెనీ వెల్లడించింది.

సిటీ ప్రయాణానికి తగినట్లుగా..

సుందక్ నీరో EVను ప్రధానంగా సిటీ ప్రయాణానికి అనువుగా డిజైన్ చేశారు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 300 నుంచి 350 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది. దీని కోసం సుమారు 45 kWh సామర్థ్యంలో కూడిన బ్యాటరీని ఉపయోగించారు. ఛార్జింగ్ విషయానికి వస్తే, ఫాస్ట్ ఛార్జర్ సాయంతో తక్కువ సమయంలోనే బ్యాటరీ ఛార్జ్ చెయ్యొచ్చు. సుమారు 45 నుంచి 50 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇంట్లో సాధారణ ఛార్జర్‌తో ఛార్జ్ చేస్తే 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఈ కారు గరిష్టంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇది ఎక్కువగా నగర ప్రయాణాలకు సరిపడే వేగం. రోజువారీ అవసరాల కోసం, ఆఫీసుకి వెళ్లడం, చిన్న దూర ప్రయాణాల కోసం ఈ కారు అనుకూలంగా ఉంటుంది.

ధర ఎంత అంటే?

Advertisement

ధరల విషయానికి వస్తే, సుందక్ నీరో EVను మూడు వేరియంట్లలో అందిస్తున్నారు. బేసిక్ మోడల్ ధర సుమారు రూ. 14.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మిడ్ సైజ్ వేరియంట్ ధర రూ. 16.49 లక్షల వరకు ఉండగా, టాప్ వేరియంట్ ధర సుమారు రూ.17.99 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరలు ఎక్స్ షోరూమ్‌గా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ రాయితీలు, నగరాన్ని కొంత మారే అవకాశం ఉంది. ఈఎంఐలో కొనాలనుకునే వారు రూ. 2 లక్షలు డౌన్ పేమెంట్ చేస్తే సరిపోతుంది.

ఆకట్టుకునే డిజైన్..

డిజైన్ పరంగా ఈ కారు కాంపాక్ట్‌ గా ఉండటంతో, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా సులభంగా నడపవచ్చు. ఇది 4-సీటర్ కారు కావడంతో చిన్న కుటుంబాలకు సరిపోతుంది. లోపలి భాగంలో అవసరమైన అన్ని ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ మీటర్, పవర్ విండోస్, ఎయిర్ కండిషనింగ్ వంటి ఫీచర్లు వినియోగదారులకు సౌకర్యాన్ని కలిగిస్తాయి. భద్రత విషయానికి వస్తే, ఈ కారులో ప్రాథమిక సేఫ్టీ ఫీచర్లు కూడా అందించారు. ఎయిర్‌బ్యాగ్స్, ABS బ్రేకింగ్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు లాంటి సదుపాయాలు డ్రైవింగ్ సమయంలో భద్రతను పెంచుతాయి.

నోయిడాలో సుందక్ నీరో తయారీ

Advertisement

సుందక్ నీరో EV కార్లను ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో తయారు చేస్తున్నారు. కంపెనీ బ్యాటరీ, మోటార్‌పై దీర్ఘకాలిక వారంటీ కూడా అందిస్తోంది. సాధారణంగా బ్యాటరీపై సుమారు 8 సంవత్సరాల వరకు, నిర్దిష్ట కిలోమీటర్ల వరకు వారంటీ ఇవ్వనుంది. తక్కువ ఖర్చుతో మంచి రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కారును వెతుకుతున్న వారికి సుందక్ నీరో EV బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: టాటా పంచ్ EVకి లైఫ్‌ టైమ్ బ్యాటరీ వారంటీ.. ఎలక్ట్రిక్ మార్కెట్‌ లో సంచలనం!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×