E-Paper
Advertisement

Car Tips: ఇలా ఆన్, ఆఫ్ చేస్తున్నారా? అయితే, మీ కారు గోవిందా!

Car Tips:  ఇలా ఆన్, ఆఫ్ చేస్తున్నారా? అయితే, మీ కారు గోవిందా!
Advertisement

చాలా కార్లు తయారీ లోపాల కంటే, రోజువారీ డ్రైవింగ్ అలవాట్ల వల్ల త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కంపెనీ సూచించిన పద్దతులను, విధానాలను పాటించకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తే, కారు త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది డ్రైవర్లు తెలియకుండానే, కారును స్టార్ట్ చేసేటప్పుడు, ఆపేటప్పుడు చిన్న చిన్న తప్పులు చేయడం ద్వారా కారు లైఫ్ టైమ్ ను తగ్గేందుకు కారణం అవుతారు. ఈ అలవాట్లు ఇంజిన్, గేర్‌ బాక్స్, బ్యాటరీ, సెన్సార్లు, టర్బోచార్జర్ లాంటి కీలకమైన భాగాలకు కూడా ఇబ్బంది కలిగిస్తాయి.

కారు లైఫ్ తగ్గించే కామన్ మిస్టేక్స్   

కారు స్టార్ట్ చేసే ముందు హెడ్‌ లైట్లు, ఎయిర్ కండిషనర్, ఇతర ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ ను ఆఫ్ చేయాలని నిపుణులు సూచిస్తారు. ఇవి ఆన్‌ లో ఉంటే, బ్యాటరీ ఇగ్నిషన్ సమయంలో అకస్మాత్తుగా లోడ్‌ పడుతుంది. వోల్టేజ్ డ్రాప్‌ నకు కారణమవుతుంది. నెమ్మది నెమ్మదిగా, సున్నితమైన, ఖరీదైన ఎలక్ట్రానిక్ భాగాలను తీవ్రంగా నష్టం చేస్తుంది.

స్టార్ట్ చేసిన వెంటనే ఇంజిన్‌ను రివ్ చేయకూడదు!  

Advertisement

చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఇది. దయం కారు స్టార్ట్ చేసిన వెంటనే యాక్సిలరేటర్‌ను నొక్కడం. ఇంజిన్ ఆయిల్ సరిగ్గా ప్రసరించడానికి, అన్ని అంతర్గత భాగాలను చేరుకోవడానికి దాదాపు 20 నుంచి 30 సెకన్లు పడుతుంది. ఇంజిన్‌ను చాలా త్వరగా రేస్ పెట్టడం వల్ల ఘర్షణ పెరుగుతుంది. ఇంజిన్ భాగాలు త్వరగా అరిగిపోతాయి. ఇంజిన్ పనితీరు, ఇంధన సామర్థ్యం రెండింటినీ ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

మీ కారును సేఫ్ గా ఎలా ఆపాలి?  

చాలా మంది డ్రైవర్లు కారును నిలిపిన వెంటనే ఇంజిన్‌ ను ఆపివేస్తారు. ఇలా చేయడం వల్ల ఇంజిన్, ట్రాన్స్‌ మిషన్‌పై అనవసరమైన ఒత్తిడిని పడుతుంది. టర్బో చార్జ్డ్ వాహనాల్లో ఈ విధానం చాలా నష్టం కలిగిస్తుంది. ఆకస్మిక ఇంజిన్ నిలిపివేత అనేది లూబ్రికేషన్‌ కు అంతరాయం కలిగిస్తుంది. టర్బోచార్జర్ దెబ్బతినడం, లేదంటే డెడ్ అవడం జరుగుతుంది. రిపేర్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది.

Advertisement

Read Also: కార్లలో పుష్ స్టార్ట్, స్టాప్ బటన్.. లాభాలే కాదు, నష్టాలూ ఉన్నాయ్!

సో, ఇకపై కారు స్టార్ట్ చేసేటప్పుడు, ఆఫ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకపోవడం మంచింది. ఒకవేళ ఇవే మిస్టేక్స్ మళ్లీ మళ్లీ చేస్తే, ఇంజిన్ లో పెద్ద పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. ఫలితంగా కారు లైఫ్ కూడా తగ్గుతుంది.

Read Also:  వామ్మో ఒక్క నెలలో ఇన్ని కార్లు అమ్ముడయ్యాయా? ఎక్కువ సేల్స్ సాధించిన బ్రాండ్ ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×