E-Paper
Advertisement

Skoda Kylaq: స్కోడా కైలాక్ సరికొత్త రికార్డు, 50 వేల యూనిట్ల మార్క్ క్రాస్!

Skoda Kylaq: స్కోడా కైలాక్ సరికొత్త రికార్డు, 50 వేల యూనిట్ల మార్క్ క్రాస్!
Advertisement

Skoda Kylaq New Milestone: స్కోడా కంపెనీ నుంచి వచ్చిన క్రేజీ కాంపాక్ట్ SUV  స్కోడా కైలాక్. స్కోడా ఆటో ఇండియాలో విడుదల చేసిన కొత్త సబ్ కాంపాక్ట్ క్రాస్ఓవర్ SUV. ఇది కుషాక్ కంటే చిన్నదిగా ఉంటుంది. అదిరిపోయే డిజైన్, మంచి స్పేస్, ఆధునిక ఫీచర్లను కలిగి ఉంది. ముఖ్యంగా అద్భుతమైన సేఫ్టీ, 1.0L TSI ఇంజిన్, సరసమైన ధరలో అందుబాటులో ఉంటుంది.  రీసెంట్ గా కొత్త వేరియంట్లు కూడా లాంచ్ అయ్యాయి. 2025లో స్కోడా గ్రూప్ 36 శాతం వార్షిక వృద్ధికి కీలక సహకారం అందించింది.

సరికొత్త రికార్డును నెలకొల్పిన స్కోడా కైలాక్

అటు స్కోడా కైలాక్ ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పింది.  సరికొత్త రికార్డును నెలకొల్పింది. దేశంలో 50,000 యూనిట్ ప్రొడక్షన్ మార్కును దాటింది. కైలాక్ కోసం పెరుగుతున్న డిమాండ్‌కు సపోర్టుగా స్కోడా తన చకన్ సౌకర్యంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని 30 శాతం పెంచింది. దీంతోపాటు ఎక్కుశాతం లోకల్ ప్రొడక్షన్ సాధించేందుకు ఈ కంపెనీ దేశీయ సరఫరాదారులతో ఎంగేజ్ మరింత బలోపేతం చేసింది.  ఈ కారు ప్రారంభం అయినప్పటి నుంచి కైలాక్ మార్కెట్ లో మంచి దూకుడు కొనసాగిస్తోంది. కాంపాక్ట్ SUV విభాగంలో స్కోడా ఫుట్ ప్రింట్ ను పెంచే ప్రయత్నం చేస్తుంది.

Advertisement

ఇక రీసెంట్ గా కంపెనీ తన కార్ల ధరలను సవరించింది. ఎంపిక చేసిన వేరియంట్లపై కైలాక్ ధరలను రూ. 33,000 వరకు సవరించింది. ప్రస్తుతం ఈ SUV ధర రూ. 7.59 లక్షల నుంచి రూ. 12.99 లక్షలు(ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

స్కోడా కైలాక్  కీ ఫీచర్లు  

సబ్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ SUV స్కోడా కైలాక్.. స్కోడా సిగ్నేచర్ డిజైన్‌ తో పాటు, స్టైలిష్ గ్రిల్, LED హెడ్‌ లైట్స్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉంటుంది.  1.0-లీటర్ 3-సిలిండర్ TSI పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ ఆప్షన్లతో వస్తుంది. స్టైలిష్, ఫంక్షనల్ ఇంటీరియర్, విశాలమైన క్యాబిన్, 446 లీటర్ల బూట్ స్పేస్, సింప్లీ క్లెవర్ ఫీచర్లను కలిగి ఉంటుంది. భద్రతా ఫీచర్ల విషయానికి వస్తే, 6 ఎయిర్‌ బ్యాగ్స్, ABS, ESC వంటి 25+ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటుంది. 5-స్టార్ భారత్ NCAP రేటింగ్ ను కలిగి ఉంటుంది. ఈ కారు క్లాసిక్, ప్రెస్టీజ్ ప్లస్ లాంటి వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Read Also: మహీంద్రా To మారుతి.. జనవరిలో అమ్మకాల్లో దుమ్మురేపిన కార్లు ఇవే!

స్కోడా కైలాక్  రీసెంట్ అప్ డేట్స్

స్కోడా కైలాక్   జనవరి 2025లో లాంచ్ అయింది. కొత్త క్లాసిక్ ప్లస్, ప్రెస్టీజ్ ప్లస్ వేరియంట్లు విడుదలయ్యాయి. CNG వెర్షన్‌ ను కూడా స్కోడా పరిశీలిస్తోంది. స్కోడా డ్రైవింగ్ డైనమిక్స్, స్టైలిష్ లుక్, బలమైన బిల్డ్ క్వాలిటీ కావాలనుకునే వారికి మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. కాంపాక్ట్ సైజులో ఎక్కువ ప్లేస్, భద్రత, ఫీచర్లను కోరుకునేవారికి సరిపోతుంది.

Read Also: టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టెక్ ప్యాకేజీ ప్రారంభం, ధర కాస్ట్ ఎంతో తెలుసా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×