// // Skoda Kushaq Facelift: కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Skoda Kushaq Facelift: కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Skoda Kushaq Facelift: కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Advertisement

Skoda Kushaq Facelift Launched: కారు లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ అయ్యింది. భారత్ లో రూ.10.69 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభం ధరతో విడుదల అయ్యింది. ఈ కారు వేరియంట్లు, రెండు ఇంజన్ ఆప్షన్లు, ఎనిమిది రంగులలో అందుబాటులో ఉంది. ఈ కారును జనవరిలో లాంచ్ చేశారు. అదే సమయంలో బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. డెలివరీలు ఈ రోజు నుంచే షురూ కానున్నాయి. 1.0-లీటర్ TSI ఎనిమిది-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ తో ఈ కారు అందుబాటులోకి వచ్చింది.

కుషాక్ ఫేస్‌ లిఫ్ట్ డిజైన్ గురించి..

స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్  కారు కొత్త గ్రిల్, 17 అంగుళాల వీల్స్, డోర్ హ్యాండిల్స్,  కనెక్ట్ చేయబడిన టెయిల్ ల్యాంప్స్ లాంటి ఆధునిక సాలిడ్ డిజైన్ లాంగ్వేజ్‌ తో వచ్చింది. లోపల, మొత్తం లే అవుట్ మారలేదు. కానీ, స్కోడా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం OSను అప్‌ డేట్ చేసింది. కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ను, సెగ్మెంట్‌ లో మొదటిసారిగా రెండవ వరుస సీట్ బ్యాక్ మసాజర్‌ను యాడ్ చేసింది. మొత్తం కొలతలు మారలేదు.

8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్

Advertisement

ఈ కుషాక్ ఫేస్‌ లిఫ్ట్‌ లోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్. ఈ గేర్‌ బాక్స్ డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరిచింది. మైలేజీని కూడా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. 1.5-లీటర్ TSI పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఇది 148bhp పవర్, 250Nm పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతానికి కేవలం 7 స్పీడ్ DSGతో మాత్రమే అందించబడుతుంది.

సరికొత్త వారంటీ ప్యాకేజీ

కొత్త కుషాక్ ఇప్పుడు స్కోడా సూపర్ కేర్‌ తో వస్తుంది. 4 సంవత్సరాలు లేదంటే 100,000 కిలోమీటర్ల వారంటీ ఉంటుంది. దానితో పాటు 4 సంవత్సరాల రోడ్‌ సైడ్ అసిస్టెన్స్ అందిస్తుంది. దీనికి అదనంగా, వినియోగదారులు రెండు సంవత్సరాల వరకు లేదంటే, 30,000 కిలోమీటర్ల వరకు నాలుగు ఫ్రీ సర్వీసులను కూడా పొందుతారు. చెల్లింపు ప్రాతిపదికన వారంటీని ఎనిమిదవ సంవత్సరం వరకు పొడిగించుకోవచ్చు. దీనికి తోడుగా, ఆరు సంవత్సరాల తుప్పు నిరోధక వారంటీ, మూడు సంవత్సరాల పెయింట్ వారంటీ కూడా లభిస్తుంది.

Advertisement

Read Also:  రెండేళ్లలో 5 SUVలు.. టయోటా నుంచి రాబోయే క్రేజీ కార్లు ఇవే!

కుషాక్ ఫేస్‌ లిఫ్ట్ ఏ కార్లతో పోటీ పడుతుందంటే? 

స్కోడా కుషాక్‌ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, ఎంజి ఆస్టర్, టాటా కర్వ్, టాటా సియెర్రా, మారుతి విక్టోరిస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ లాంటి కార్లతో పోటీ పడుతుంది. అటు వోక్స్‌ వ్యాగన్ టైగన్‌ కు కూడా  మరో అప్‌ డేట్ తో రానుంది. ఇది ఏప్రిల్ 9న విడుదల కానుంది.

Read Also: పైసా లేకున్నా రాయల్ ఎన్‌ ఫీల్డ్ క్లాసిక్ 650 కొనొచ్చు, ఎలాగో తెలుసా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×