E-Paper
Advertisement

Kushaq Facelift: స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది బాస్! ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే.. కానీ ఆ ఒక్క విషయంలోనే ‘ట్విస్ట్’!

Kushaq Facelift: స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది బాస్! ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే.. కానీ ఆ ఒక్క విషయంలోనే ‘ట్విస్ట్’!
Advertisement

Kushaq Facelift: మార్కెట్లో ఎస్‌యూవీ (SUV)ల మధ్య యుద్ధం ముదిరిపోతోంది! హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ లాంటి హేమాహేమీలకు చుక్కలు చూపించడానికి స్కోడా (Skoda) తన అమ్ములపొదిలో నుంచి కొత్త అస్త్రాన్ని వదిలింది. అదే.. ‘కుషాక్ ఫేస్‌లిఫ్ట్’ (Kushaq Facelift).
కేవలం రూ. 10.69 లక్షల స్టార్టింగ్ ప్రైస్‌తో మార్కెట్లోకి దూసుకొచ్చిన ఈ కారులో ఏముంది? ఏం లేదు? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్!

లుక్స్ అంటే ఇవే కదా.. కిల్లింగ్ డిజైన్!
పాత కుషాక్ గుర్తుందా? దాన్ని మర్చిపోండి! కొత్త ఫేస్‌లిఫ్ట్ లుక్ చూస్తే ‘మిని కొడియాక్’ లా అనిపిస్తుంది.
గ్రిల్ మ్యాజిక్: కొత్త కొడియాక్ స్టైల్ గ్రిల్ చూస్తుంటేనే ఒక గంభీరమైన లుక్ వస్తోంది.
లైటింగ్: ఆ DRLs హెడ్‌లైట్స్, వెనుక ఉన్న LED టెయిల్ లైట్స్ రాత్రి పూట రోడ్డు మీద వెళ్తుంటే అందరి కళ్ళు మీ కారు మీదే ఉంటాయి. గ్యారెంటీ!
ఇక లోపలికి వెళ్తే ఇది కారా లేక లగ్జరీ ఫ్లాటా అనిపించడం పక్కా.
డిజిటల్ కాక్‌పిట్: 10.25 అంగుళాల డిజిటల్ స్క్రీన్, దానికి తోడు AI అసిస్టెంట్ ఉన్న 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్. మీ కారుతో మీరు ముచ్చట్లు పెట్టుకోవచ్చు కూడా.

Advertisement

మసాజ్ ఫంక్షన్: బాబోయ్!
ఈ సెగ్మెంట్‌లో మొదటిసారి వెనుక సీటులో మసాజ్ ఫంక్షన్ ఇచ్చారు. ట్రాఫిక్‌లో చిరాకు వచ్చినా, లాంగ్ డ్రైవ్‌లో అలసిపోయినా.. మీ కారే మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది.
పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ సీట్లు..వీటికి మించి ఇంకా ఏం కావాలి బాస్?

ఇంజిన్ పవర్: రోడ్డు మీద రాకెట్టే!
దీనిలో రెండు ఆప్షన్లు ఉన్నాయి:
1.0 లీటర్ టర్బో: సిటీలో సింపుల్‌గా, పవర్‌ఫుల్‌గా తిరగడానికి. (6-స్పీడ్ మాన్యువల్ / 8-స్పీడ్ ఆటోమేటిక్).
1.5 లీటర్ టర్బో: ఒకసారి యాక్సిలరేటర్ తొక్కితే.. గాలిలో తేలిపోవడమే! (7-స్పీడ్ DCT).
మరి ఆ ‘ట్విస్ట్’ ఏంటి?
ఇన్ని ఫీచర్లు ఉన్నా.. ఇక్కడ ఒక చిన్న మైనస్ ఉంది.
“ఈ రోజుల్లో చిన్న కార్లలో కూడా వస్తున్న ADAS (Advanced Driver Assistance Systems) మరియు 360-డిగ్రీ కెమెరా ఈ కొత్త మోడల్‌లో లేకపోవడం పెద్ద మైనస్ .”అంటే.. పార్కింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. కానీ సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటివి గట్టిగానే ఇచ్చారండోయ్
ధరలు ఇవే (Ex-Showroom):
స్టార్టింగ్ ధర: రూ. 10.69 లక్షలు
టాప్ ఎండ్ ధర: రూ. 18.99 లక్షలు
వేరియంట్లు: క్లాసిక్+, సిగ్నేచర్, స్పోర్ట్‌లైన్, ప్రెస్టీజ్, మాంటే కార్లో (మొత్తం 5 ఆప్షన్లు!).

Advertisement

also read :Allu vs Mega Family: అల్లు ఆర్మీకి పోటీగా మెగా యూత్ ఫోర్స్? ఫ్యామిలీ ఫైట్.. ఫ్యాన్ వార్‌గా మారనుందా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×