E-Paper
Advertisement

Low Coolant: కూలెంట్ తగ్గి ఏసీ పని చేయట్లేదా? సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!

Low Coolant: కూలెంట్ తగ్గి ఏసీ పని చేయట్లేదా? సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!
Advertisement

Low Coolant and AC Failure: ఇంజిన్ కూలెంట్ తగ్గి, ఏసీ పని చేయకపోవడం చాలా చాలా మంది కారు వినియోగదారులకు ఎదురయ్యే సమస్య. ముందుగానే జాగ్రత్త పడకపోతే, పెద్ద సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఏసీ చల్లని గాలి బదులు వేడి గాలి రావడం, అదే సమయంలో టెంపరేచర్ గేజ్ పెరిగితే, వెంటనే అలర్ట్ కావాలి. కావాలి. ఎక్కువగా ఇంజిన్ వేడెక్కుతోందని అర్థం చేసుకోవాలి.  ఇలాంటి సమయంలో  ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ వెంటనే వాహనాన్ని ఆపి, ఏసీ ఆఫ్ చేయాలి

డాష్‌ బోర్డ్‌ మీద టెంపరేచర్ ఎక్కువగా చూపిస్తే లేదంటే వార్నింగ్ లైట్ వెలిగితే, వెంటనే కారు సైడ్‌ కు ఆపాలి.  డ్రైవింగ్ కొనసాగించడం ప్రమాదకరం. వెంటనే ఏసీని కూడా ఆఫ్ చేయాలి. అదే సమయంలో  హీటర్‌ ను ఫుల్ హాట్ మోడ్‌ లో పెట్టడం ద్వారా ఇంజిన్ వేడిని కొంచెం బయటకు పంపవచ్చు. అసౌకర్యంగా అనిపించినా, ఇంజిన్‌ కు మేలు కలుగుతుంది.

⦿ ఇంజిన్ పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేయాలి!

Advertisement

కారు ఆపిన వెంటనే బోనెట్ ఓపెన్ చేయాలి. కానీ, ఏ భాగాన్ని తగలకూడదు. కనీసం 30–60 నిమిషాలు ఇంజిన్ చల్లబడేందుకు సమయం ఇవ్వాలి. వేడి ఉన్నప్పుడు రేడియేటర్ క్యాప్ తెరవడం చాలా ప్రమాదకరం. ప్రెజర్ వల్ల వేడి కూలెంట్ బయటకు చిమ్మి గాయాలకు కారణం కావచ్చు.

⦿ కూలెంట్ లెవెల్, లీక్‌ లను చెక్ చేయాలి   

ఇంజిన్ చల్లారిన తర్వాత, కూలెంట్ రిజర్వాయర్‌ లో లెవెల్ చెయ్ చేయాలి. చాలా తక్కువగా, ఖాళీగా ఉంటే అదే ఈ సమస్యకు కారణంగా భావించాలి. కారు కింద లీక్ ఉందేమో చూసుకోవాలి. సాధారణంగా కూలెంట్ ఆకుపచ్చ, గులాబీ, ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. హోస్ పగిలిపోవడం, రేడియేటర్ డ్యామేజ్ అవ్వడం, వాటర్ పంప్,  థర్మోస్టాట్ సమస్యలు కారణాలు కావచ్చు.

⦿ కూలెంట్‌ను జాగ్రత్తగా నింపాలి

Advertisement

కూలెంట్ తక్కువగా ఉంటే, యాంటీఫ్రీజ్ తో పాటు డిస్టిల్డ్ వాటర్ సమానంగా నింపాలి. అత్యవసర పరిస్థితిలో కేవలం నీళ్లు పోయవచ్చు. కానీ, తాత్కాలిక పరిష్కారం మాత్రమే. రిజర్వాయర్ పూర్తిగా ఖాళీగా ఉంటే, కారును నడపకండి.

⦿ ఇంజిన్ స్టార్ట్ చేసి గేజ్‌ ను గమనించండి

కూలెంట్ నింపిన తర్వాత, ఇంజిన్ స్టార్ట్ చేసి టెంపరేచర్ గేజ్‌ ను చూడాలి. మళ్ళీ వేగంగా పెరిగితే వెంటనే ఆపేయండి. ఇది పెద్ద సమస్యకు సంకేతం కావచ్చు. సాధారణంగా ఉన్నా కూడా, తప్పనిసరిగా మెకానిక్‌ తో చెక్ చేయించాలి. ఎందుకంటే కూలెంట్ సిస్టమ్ ఇంజిన్‌ కు చాలా కీలకం. అది సరిగా పనిచేయకపోతే, ఇంజిన్ వేడెక్కి భారీ నష్టం కలిగిస్తుంది. సో, ఏసీ ఆగిపోవడం, టెంపరేచర్ పెరగడం కనిపిస్తే, దాన్ని చిన్న సమస్యగా తీసుకోకండి. వెంటనే గ్యారేజీకి తీసుకెళ్లి చెక్ చేయించండి.

Read Also: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే, ఈ ఈవీ బ్యాటరీ ఫెయిల్ అయినట్టే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×