E-Paper
Advertisement

ఈవీ స్కూటర్లలో సంచలనం .. సింపుల్ వన్ అల్ట్రా కొనేందుకు టాప్ 5 రీజన్స్ ఇవే!

ఈవీ స్కూటర్లలో సంచలనం .. సింపుల్ వన్ అల్ట్రా కొనేందుకు టాప్ 5 రీజన్స్ ఇవే!
Advertisement

Simple One Ultra EV Scooter: భారతీయ ఎలక్ట్రిక్  స్కూటర్ మార్కెట్‌ లో మరో క్రేజీ మోడల్‌గా సింపుల్ వన్ అల్ట్రా  ఈవీ స్కూటర్‌ను విడుదల అయ్యింది. సుమారు రూ. 2.35 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో వచ్చిన ఈ స్కూటర్, ప్రీమియం ఫీచర్లు,  శక్తివంతమైన పనితీరుతో వినియోగదారులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఓలా S1 ప్రో+, టీవీఎస్ ఐక్యూబ్ ST లాంటి పాపులర్ మోడల్స్ కు ఈ స్కూటర్ నేరుగా పోటీ ఇవ్వనుంది. ఈ కొత్త మోడల్ ను కొనేందుకు 5 కీలక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ అత్యధిక రేంజ్

ఈ స్కూటర్‌లో ఆకట్టుకునే అంశం రేంజ్. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇది రోజువారీ ప్రయాణాలతో పాటు దీర్ఘ దూర ప్రయాణాలకు కూడా అనువుగా ఉంటుంది. చాలా మంది EV వినియోగదారులకు ఉండే  రేంజ్ టెన్షన్  సమస్యను తగ్గిస్తుంది. ఇందులో 6.5kWh సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అంతేకాదు, రిమూవబుల్  బ్యాటరీ ఉంటుంది.

⦿ లేటెస్ట్ టెక్నాలజీ

Advertisement

రెండవ ముఖ్యమైన అంశం టెక్నాలజీ. ఈ స్కూటర్‌లో 7 అంగుళాల టచ్‌ స్క్రీన్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత సిస్టమ్‌ పై పని చేస్తుంది. ఇందులో నావిగేషన్, కాల్ అలర్ట్స్, మ్యూజిక్ కంట్రోల్స్ లాంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.  OTA అప్‌డేట్స్ ద్వారా కొత్త ఫీచర్లు కూడా ఉంటాయి. ఈ కనెక్టివిటీ ఫీచర్లు స్కూటర్‌ ను మరింత స్మార్ట్‌ గా మారుస్తాయి.

⦿ ఆధునిక భద్రతా ఫీచర్లు

భద్రత విషయానికి వస్తే, ఈ మోడల్‌లో అనేక ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ వంటి ఫీచర్లు రైడింగ్‌ను సులభంగా మరియు సురక్షితంగా చేస్తాయి. అలాగే ట్రాక్షన్ కంట్రోల్, ఫాల్ డిటెక్షన్ వంటి ఫీచర్లు ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతాయి. రోజువారీ ప్రయాణాల్లో ఇవి ఉపయోగకరంగా ఉంటాయి.

⦿115 కి.మీ గరిష్ట వేగం

Advertisement

పనితీరు ఈ స్కూటర్‌కు మరో బలం. ఇందులో ఉన్న మోటార్ మంచి టార్క్‌ ను అందిస్తుంది. దీని వల్ల వేగం త్వరగా పెరుగుతుంది. ట్రాఫిక్‌ లో ఓవర్‌ టేక్ చేయడం సులభంగా ఉంటుంది. పలు రైడింగ్ మోడ్‌లు ఉండటంతో అవసరాన్ని బట్టి రేంజ్, పనితీరును ఎంపిక చేసుకోవచ్చు. గరిష్టంగా 115 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

⦿ ఆకట్టుకునే డిజైన్

ఈ స్కూటర్ ఏరోడైనమిక్స్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది. స్పోర్టీ లుక్‌ తో పాటు గాలి ప్రవాహాన్ని మెరుగుపరచే విధంగా డిజైన్ చేశారు. ఇది స్కూటర్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.  సింపుల్ వన్ అల్ట్రా కంప్లీట్ ప్యాకేజ్‌ గా కనిపిస్తోంది. మంచి రేంజ్, స్మార్ట్ ఫీచర్లు, భద్రత, పనితీరుతో ప్రీమియం EV స్కూటర్ గా గుర్తింపు తెచ్చుకోనుంది.

Read Also: యమహా లవర్స్‌ కు గుడ్ న్యూస్.. ఫాసినో హైబ్రిడ్ స్కూటర్ వచ్చేసింది!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×