E-Paper
Advertisement

రాయల్ ఎన్‌ ఫీల్డ్ కొత్త బైక్‌ల జోరు.. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మోడళ్లు కూడా వచ్చేస్తున్నాయ్!

రాయల్ ఎన్‌ ఫీల్డ్ కొత్త బైక్‌ల జోరు.. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మోడళ్లు కూడా వచ్చేస్తున్నాయ్!
Advertisement

New Royal Enfield Bikes 2026: ఇండియన్ బైక్ మార్కెట్లో సత్తా చాటేందుకు రాయల్ ఎన్‌ ఫీల్డ్ క్రేజీ ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాదిలో అదిరిపోయే కొత్త బైక్‌ లను విడుదల చేయడానికి రెడీ అవుతోంది. 450cc నుంచి 750cc వరకు కొత్త మోడళ్లను తీసుకురాబోతోంది. అదే సమయంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ బైక్‌ ల పైనా రాయల్ ఎన్‌ ఫీల్డ్ ఫోకస్ పెట్టింది. అడ్వెంచర్, టూరింగ్,  క్లాసిక్ బైక్‌ లను ఇష్టపడే రైడర్ల ను మరింత ఆకట్టుకోబోతోంది.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడళ్లకు అదనంగా కంపెనీ స్క్రామ్ 450, హిమాలయన్ 440, బుల్లెట్ 650, హిమాలయన్ 750 లాంటి కొత్త బైక్‌ లను తీసుకురానుంది. అటు ఫ్లయింగ్ ఫ్లీ S6 అనే ఎలక్ట్రిక్ మోడల్ కూడా ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే చేయాలని భావిస్తోంది. కొత్త సెగ్మెంట్లలోకి అడుగుపెట్టి కస్టమర్ బేస్‌ ను మరింత పెంచుకోవాలని భావిస్తోంది.

త్వరలో మార్కెట్ లోకి బుల్లెట్ 650

Advertisement

ఈ కొత్త బైక్‌లలో ముందుగా భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్న మోడల్ బుల్లెట్ 650 అని భావిస్తున్నారు.ఇప్పటికే మోటోవర్స్ 2025లో ఈ బైక్‌ను కంపెనీ ప్రదర్శించింది. ఈ మోడల్ కోసం బైక్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు హిమాలయన్ 440 కూడా త్వరలో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. స్క్రామ్ 450, ఫ్లయింగ్ ఫ్లీ S6 మోడళ్లను కూడా ఈ ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశం ఉంది.

పెద్ద ఇంజిన్ మోడళ్లపైనా ఫోకస్!

ఇదే సమయంలో రాయల్ ఎన్‌ ఫీల్డ్ పెద్ద ఇంజిన్ సామర్థ్యం గల మోడళ్లపై పని చేస్తోంది. కంపెనీ నవంబర్‌ లో జరిగే EICMA 2026లో హిమాలయన్ 750, కాంటినెంటల్ GT 750 బైక్‌ లను ప్రపంచానికి పరిచయం చేయనుంది. గతంలో వీటిని కాన్సెప్ట్ గా ప్రదర్శించింది.  ఇప్పుడు ప్రొడక్షన్ కు రెడీ అయిన వెర్షన్లు ప్రదర్శించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

హైబ్రిడ్ టెక్నాలజీ వైపు అడుగులు

Advertisement

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు హైబ్రిడ్ టెక్నాలజీ వైపు కూడా అడుగులు వేస్తోంది. చైనాకు చెందిన CFMotoతో కలిసి 250cc హైబ్రిడ్ బైక్‌ ను అభివృద్ధి చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఈ బైక్‌ను హంటర్ 350 కంటే తక్కువ ధరలో తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. సుమారు రూ.1.20 లక్షల ధరలో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ హైబ్రిడ్ బైక్ 50 కిలో మీటర్ల కంటే ఎక్కువ మైలేజీ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది.

ఉత్పత్తి సామర్థ్యం భారీగా పెంపు

ఇక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కంపెనీ భారీ పెట్టుబడులు పెడుతోంది. ప్రస్తుతం చెన్నై ప్లాంట్‌ లో సంవత్సరానికి 15 లక్షల బైక్‌ లను తయారు చేసే సామర్థ్యం ఉంది. దీన్ని 20 లక్షలకు పెంచేందుకు కంపెనీ రూ.958 కోట్లు పెట్టుబడి పెడుతోంది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్‌ లో కొత్త తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ పూర్తి స్థాయిలో పని చేయడం ప్రారంభించిన తర్వాత సంవత్సరానికి 9 లక్షల బైక్‌ లను తయారు చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది.

Read Also:  లాంచ్ కు ముందే నార్టన్ అట్లాస్ స్పై షాట్స్ లీక్.. చూడ్డానికి భలే ఉందిగా!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×