// // Royal Enfield Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కొంటున్నారా? ఈ 5 విషయాలు తెలుసుకోండి! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Royal Enfield Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కొంటున్నారా? ఈ 5 విషయాలు తెలుసుకోండి!

Royal Enfield Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కొంటున్నారా? ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Advertisement

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా యువతను ఆకట్టుకునే సూపర్ డూపర్ బైక్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. మంచి ఎగ్జాస్టింగ్ సౌండ్, రాయల్ లుక్ కు యువత ఫిదా అయిపోతారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వచ్చిన క్రేజీ బైక్ హంటర్ 350. మంచి లుక్ తో పాటు సరసమైన ధరలో ఈ బైక్ విడుదల అయ్యింది. ఈ బైక్ కు సంబంధించిన ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఇంజిన్‌ గురించి..  

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350  బైక్ క్లాసిక్, బుల్లెట్ 350 లాంటి బైక్ ను ఉపయోగిస్తుంది. ఇది 349cc, సింగిల్ సిలిండర్ ఇంజిన్. 6,100rpm దగ్గర ఈ బైక్ 20.2hp పవర్, 4,000rpm దగ్గర 27Nm గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ ఐదు స్పీడ్ గేర్‌ బాక్స్‌ తో వస్తుంది. స్లిప్పర్ క్లచ్‌ ను కలిగి ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఇంధన ట్యాంక్ సామర్థ్యం

Advertisement

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ 13 లీటర్ల ఇంధన ట్యాంక్ కు కలిగి ఉంటుంది. 181 కిలోల కెర్బ్ బరువును కలిగి ఉంది. సీటు ఎత్తు 790mm ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఫీచర్లు!  

హంటర్ 350 ఒక సాధారణ బైక్. కానీ, చక్కటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది టాకోమీటర్‌ను మిస్ అయ్యే సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ను కలిగి ఉంటుంది. కానీ, హై వేరియంట్లలో, బైక్ టర్న్ బై టర్న్ నావిగేషన్ కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ ట్రిప్పర్ నావిగేషన్ పాడ్‌ ను కలిగి ఉంటుంది. ఇది డ్యూయల్ ఛానల్ ABS, స్లిప్పర్ క్లచ్‌ ను కలిగి ఉంటుంది. కానీ, ట్రాక్షన్ కంట్రోల్ లాంటి రైడర్ ఎయిడ్‌ లను కలిగి ఉండదు.

Advertisement

Read Also: యమహా XSR 155 vs హోండా యూనికార్న్, వీటిలో ఏది బెస్ట్ బైక్?

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కలర్స్!  

ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ గ్రాఫైట్ గ్రే, టోక్యో బ్లాక్, లండన్ రెడ్, రెబెల్ బ్లూ, డాపర్ గ్రే, రియో ​​వైట్, ఫ్యాక్టరీ బ్లాక్ లాంటి ఏడు కలర్ స్కీమ్స్ లో అందుబాటులో ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ధర గురించి..

సెలెక్ట్ చేసుకునే కలర్ ఆప్షన్ ను బట్టి, హంటర్ 350 ధర రూ. 1,37,640 నుంచి రూ. 1,66,883 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. బేస్ ఫ్యాక్టరీ బ్లాక్ వేరియంట్ కలర్ స్కీమ్‌ లో ట్యూబ్డ్ టైర్లతో స్పోక్డ్ వీల్స్ ఉపయోగించగా, మిగతా వేరియంట్లలో ట్యూబ్‌ లెస్ టైర్లతో అల్లాయ్ వీల్స్ ను కలిగి ఉంటుంది.

Read Also: కొత్త లెక్సస్ ES లాంచ్ డేట్ ఫిక్స్, వావ్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×