E-Paper
Advertisement

Royal Enfield Continental GT 750: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి క్రేజీ బైక్, ఇండియన్ మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడంటే?

Royal Enfield Continental GT 750: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి క్రేజీ బైక్, ఇండియన్ మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Advertisement

Royal Enfield Continental GT 750 Launch Date:  పాపులర్ మోటార్ సైకిల్ కంపెనీ రాయల్ ఎన్‌ ఫీల్డ్ నుంచి అదిరిపోయే బైక్ విడుదలకు రెడీ అవుతోంది. కాంటినెంటల్ GT 750 పేరుతో లాంచ్ కానుంది. ప్రస్తుతం ఈ బైక్ కు సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో దేశంలో కనిపించిన GT 750 టెస్ట్ మ్యూల్ లా కాకుండా, ఈ వెర్షన్‌లో క్వార్టర్ ఫెయిరింగ్ కనిపించలేదు. అంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ మల్టీఫుల్ వేరియంట్స్ పై పని చేస్తోంది, కొన్ని ఫెయిరింగ్‌ తో, మరికొన్ని లేకుండా అందుబాటులోకి రానున్నాయి. స్పై షాట్‌ లలో GT 750 ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT 650 మాదిరిగానే క్లాసిక్ రెట్రో స్టైలింగ్‌ను కలిగి ఉంది. ఇది రౌండ్ LED హెడ్‌ ల్యాంప్ సెటప్, స్కల్ప్టెడ్ ట్యాంక్, క్రోమ్ ఫినిష్డ్ ఇంజిన్ క్రాంక్‌కేస్, ట్విన్ ఎగ్జాస్ట్‌ లను పొందుతుంది.

మరింత భిన్నంగా కాంటినెంటల్ GT 750

లుక్స్ పరంగానే కాదు, ఇంటర్నల్స్ కూడా చాలా భిన్నంగా ఉంటాయి. కాంటినెంటల్ GT 750 పెద్ద 750cc మోటారుతో పవర్ ను పొందనుంది. ఇది కాంటినెంటల్ GT 650 లోని ఇంజిన్ బోర్ అవుట్ వెర్షన్. ఇది దాదాపు 55bhp పవర్ తో పాటు  65Nm  టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.  ఈ బైక్ టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ షాక్ అబ్జార్బర్లను కలిగి ఉంటుంది. బైక్ రెండు చివర్లలో 18 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ పై వ్రెడెస్టీన్ సెంచురో ST టైర్లను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. బ్రేకింగ్ హార్డ్‌ వేర్ కూడా భిన్నంగా ఉంటుంది. బైక్ ముందు భాగంలో బైబ్రే కాలిపర్లతో ట్విన్ డిస్క్ సెటప్‌ను కలిగి ఉంటుంది. అటు GT 750లోని ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ప్రస్తుతం హిమాలయన్ 450, గెరిల్లా 450, బేర్ 650 లో ఉన్నట్లు గానే సింగిల్ పాడ్ TFT యూనిట్ లాగా కనిపిస్తుంది. ఇది Google Maps ద్వారా పూర్తి స్థాయి నావిగేషన్ లాంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది.

Advertisement

Read Also: హోండా యాక్టివా ఇ vs సుజుకి యాక్సెస్ 125, వీటిలో ఏది బెస్ట్ అంటే?

2027 మార్కెట్లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT 750

ఈ సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT 750..  2027 ప్రారంభంలో ఇండియన్ మార్కెట్లోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. ఇక ఈ క్రేజీ బైక్ ధర సుమారు 4 లక్షలు(ఎక్స్ షోరూమ్) ఉంటుందని భావిస్తున్నారు. అంతకు ముందు, కాంటినెంటల్ GT R 750 అని పిలిచే కాంటినెంటల్ GT 750 రేస్ స్పెక్ వెర్షన్‌ను మోటోవర్స్ 2025లో లాంచ్ చేశారు. త్వరలోనే ఈ బైక్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది.

Advertisement

Read Also: ఫిబ్రవరిలో మార్కెట్లోకి అడుగు పెట్టబోయే క్రేజీ బైక్స్ ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×