E-Paper
Advertisement

క్లాసిక్ లుక్.. పవర్ ఇంజిన్.. బుల్లెట్ 650 వచ్చేసింది!

క్లాసిక్ లుక్.. పవర్ ఇంజిన్.. బుల్లెట్ 650 వచ్చేసింది!
Advertisement

Royal Enfield Bullet 650 Launched: రాయల్ ఎన్‌ ఫీల్డ్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త మోడల్ బుల్లెట్ 650ని భారత మార్కెట్‌ లో అధికారికంగా విడుదల చేసింది. ఈ బైక్ ధర సుమారు రూ. 3.65 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. 650cc సెగ్మెంట్‌ లో బుల్లెట్ బ్రాండ్‌ ను తీసుకొచ్చింది. క్లాసిక్ లుక్‌ తో పాటు లేటెస్ట్ ఇంజిన్ పనితీరుతో ఈ మోడల్‌ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇంజిన్ గురించి..

ఈ బైక్‌ లో చెప్పుకోవాల్సిన అంశం ఇంజిన్. ఇందులో 648cc ఎయిర్, యిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉపయోగించారు. ఇది సుమారు 47 bhp శక్తిని, 52 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ కు 6 స్పీడ్ గేర్‌ బాక్స్ యాడ్ చేసింది. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ కూడా ఇందులో ఉండటం వల్ల గేర్ మార్పులు మరింత స్మూత్‌ గా ఉంటాయి. ఇదే ఇంజిన్ ఇప్పటికే రాయల్ ఎన్‌ ఫీల్డ్ 650 సిరీస్‌ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది.

డిజైన్ గురించి..

Advertisement

బుల్లెట్ 650 క్లాసిక్ గుర్తింపును పూర్తిగా కొనసాగించింది. చేతితో వేసిన పిన్‌ స్ట్రైప్స్, మెటల్ బ్యాడ్జింగ్, టియర్‌ డ్రాప్ ఆకారంలోని ఫ్యూయల్ ట్యాంక్, గుండ్రని హెడ్‌ ల్యాంప్ లాంటి అంశాలు దీనికి ప్రత్యేక ఆకర్షణను ఇస్తాయి. క్రోమ్ ఫినిష్ చేసిన ఎగ్జాస్ట్ కూడా ఈ బైక్‌ కు రాయల్ లుక్‌ ను ఇస్తుంది. పాత బుల్లెట్ స్టైల్ అభిమానులకు ఆకట్టుకుంటుంది.

ధర గురించి..

ధర పరంగా చూస్తే, ఇది క్లాసిక్ 650 మోడల్‌ కు చాలా దగ్గరగా ఉంది. దాదాపు ఒకే ధర శ్రేణిలో ఉండటం వల్ల కొనుగోలుదారులకు రెండు ఆప్షన్స్ లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే, బుల్లెట్ 650 ప్రత్యేకంగా మరింత సాంప్రదాయ లుక్‌ ను ఇష్టపడే వారికి అనుకూలంగా ఉంటుంది. సీటింగ్ కూడా మరింత సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేశారు.

నిర్మాణం గురించి..

Advertisement

బైక్ నిర్మాణం విషయానికి వస్తే.. ఇది డ్యూయల్ క్రాడిల్ ఫ్రేమ్‌పై ఆధారపడి ఉంటుంది. ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపు ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. వీల్ సెటప్‌ గా ముందు 19 అంగుళాలు, వెనుక 18 అంగుళాల స్పోక్ వీల్స్ ఉపయోగించారు. బ్రేకింగ్ కోసం రెండు వైపులా డిస్క్ బ్రేకులు ఉన్నాయి, అలాగే డ్యూయల్ ఛానల్ ABS సేఫ్టీ ఫీచర్‌ గా అందించారు.

రెండు కలర్ ఆప్షన్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650ని ప్రారంభం దశలో రెండు ఎంపికలలో అందిస్తోంది. కానన్ బ్లాక్, బ్యాటిల్‌ షిప్ బ్లూ అనే రెండు కలర్ వేరియంట్లు ఉన్నాయి. రెండు రంగులూ క్లాసిక్ లుక్‌ను మరింత పెంచేలా డిజైన్ ఉంటుంది.

Read Also: బజాజ్ కొత్త అడ్వెంచర్ బైక్ వచ్చేస్తోంది, హీరో ఎక్స్‌ పల్స్‌ కు షాక్ తప్పదా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×