E-Paper
Advertisement

Remote Keyless Entry vs Keyless Entry: రిమోట్ కీలెస్ ఎంట్రీ vs కీలెస్ ఎంట్రీ.. వీటిలో ఏది బెస్ట్ అంటే?

Remote Keyless Entry vs Keyless Entry: రిమోట్ కీలెస్ ఎంట్రీ vs కీలెస్ ఎంట్రీ..  వీటిలో ఏది బెస్ట్ అంటే?
Advertisement

కార్లలో ఎంట్రీ సిస్టమ్స్ సౌకర్యంగా, సెక్యూరిటీగా ఉండేందుకు కీస్ డిజైన్ చేశారు. వాటిలో ఒకటి రిమోట్ కీలెస్ ఎంట్రీ కాగా, మరొకటి కీలెస్ ఎంట్రీ. ఈ రెండింటి మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. ఆపరేషన్ మోడ్, కన్వీనియెన్స్, టెక్నాలజీలో తేడాలు ఉన్నాయి. ఇవి రెండూ కీలెస్ రిమోట్ ని ఉపయోగిస్తాయి. కానీ, వాడే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

రెండు రకాల కీస్ మధ్య తేడాలు ఏంటి?

⦿ రిమోట్ కీలెస్ ఎంట్రీ: ఇది ఒక ఎలక్ట్రానిక్ సిస్టమ్. దీనిలో కీ ఫాబ్‌ లోని బటన్లు నొక్కి కారును కంట్రోల్ చేస్తారు. రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ద్వారా సాధారణంగా 5 నుంచి 20 మీటర్ల దూరం నుంచి పని చేస్తుంది. మాన్యువల్ బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది.

Advertisement

⦿ కీలెస్ ఎంట్రీ: ఇది పాసివ్ సిస్టమ్ తో పని చేస్తుంది. దీనిలో కీ ఫాబ్ పాకెట్‌ లో ఉంచితే సరిపోతుంది. కారు డోర్ హ్యాండిల్ టచ్ చేస్తే లేదంటే ప్రాక్సిమిటీలో ఉంటే ఆటోమేటిక్‌గా అన్‌లాక్ అవుతుంది. సెన్సర్లు, లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ సాయంతో పని చేస్తుంది. బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని మోడల్స్‌ లో బటన్స్ కూడా ఉంటాయి. రిమోట్ కీలెస్ ఎంట్రీ  హ్యుండాయ్ క్రెటా లాంటి బేసిక్ వేరియంట్లలో ఉంటుంది. కీలెస్ ఎంట్రీ కీ కియా సెల్టోస్ HTX, వోక్స్‌ వాగన్ విర్టస్ లాంటి టాప్ మోడల్స్ లో ఉంటుంది.

RKE అనుకూల అంశాలు, ప్రతికూల అంశాలు

సింపుల్, రిలయబుల్ గా ఉంటుంది. బ్యాటరీ లైఫ్ ఎక్కువ. డిస్టెన్స్ నుంచి ఉపయోగపడుతుంది. పార్కింగ్ లాట్‌ లో కారు లొకేట్ చేయడం ఈజీ అవుతుంది. సెక్యూరిటీ బాగుంటుంది. ప్రతికూల అంశాల విషయానికి వస్తే ఫాబ్ తీసి బటన్ నొక్కాలి.  హ్యాండ్స్ ఫ్రీ కాదు. బ్యాగ్‌ లో ఫాబ్ ఉంటే అన్‌కన్వీనియెంట్ గా ఉంటుంది.

కీలెస్ ఎంట్రీ అనుకూల అంశాలు, ప్రతి కూల అంశాలు  

Advertisement

హ్యాండ్స్ ఫ్రీ,  ఫుట్ జెస్చర్‌ తో ట్రంక్ ఓపెన్ అవుతుంది. పుష్ బటన్ స్టార్ట్‌ తో కలిసి ఉంటుంది, డ్రైవింగ్ సులభంగా ఉంటుంది. ప్రతికూల అంశాల విషయానికి వస్తే  బ్యాటరీ డ్రెయిన్ ఎక్కువగా ఉంటుంది. సెక్యూరిటీ రిస్క్స్ ఉంటాయి. రిపేర్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది.

Read Also: జర్నీలో మీ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ డెడ్ అయ్యిందా? ఇకపై నో టెన్షన్!

ఇక టెక్నాలజీ విషయానికి వస్తే RKE యూని డైరెక్షనల్ RF సిగ్నల్స్ ఉపయోగిస్తుంది. PKE బై డైరెక్షనల్ సిగ్నల్స్, ప్రాక్సిమిటీ సెన్సర్లు ఉపయోగిస్తుంది. కొన్ని అడ్వాన్స్డ్ సిస్టమ్‌ లలో జెస్చర్ కంట్రోల్ ఉంటుంది.  రెండింటిలోనూ సిగ్నల్ జామింగ్, రిలే అటాక్స్ నివారణకు ఫాబ్‌ని ఫారడే పౌచ్‌లో ఉంచాలి. మోడరన్ కార్లలో ఎన్‌క్రిప్షన్ మెరుగ్గా ఉంటుంది. క్రెటా, సెల్టోస్ మొదలైన టాప్ వేరియంట్లలో కీలెస్ ఎంట్రీ ఉంటుంది. బేస్ మోడల్స్‌ లో RKE ఉంటుంది.

Read Also: క్రెటా, కియా, సెల్టోస్.. రూ.15 లక్షల లోపు బెస్ట్ SUV ఏదంటే?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×