E-Paper
Advertisement

Black Colour Car: బ్లాక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి!

Black Colour Car: బ్లాక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి!
Advertisement

ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ కలర్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. నూటికి సగానికి పైగా కారు కొనుగోలుదారులు బ్లాక్ కలర్ కారు కొనుగోలుకు మొగ్గుచూపుతారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి, ఇతర రంగుల కార్లతో పోల్చితే బ్లాక్ కారు చాలా అందంగా కనిపిస్తుంది. అయితే, బ్లాక్ కలర్ కారు కొనుగోలు చేసే సమయంలో కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి. ఈ కలర్ క్లాసీగా, స్టైలిష్‌ గా కనిపించినప్పటికీ, చాలా జాగ్రత్త అవసరం. ఈ కారును మెయింటెయిన్ చేయడం చాలా కష్టం. ఇంతకీ బ్లాక్ కారుతో కలిగే లాభాలు, నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

బ్లాక్ కలర్ తో లాభాలు

⦿ చూడ్డానికి మంచి లుక్: నలుపు రంగు చూడ్డానికి చాలా బాగుంటుంది. నల్ల పెయింట్ రోడ్డుపై నిగనిగలాడుతూ క్లాసీగా కనిపిస్తుంది. సిల్వర్, యాష్ కలర్ తో పోల్చితే, బ్లాక్ కలర్ చాలా మెరుగ్గా కనిపిస్తుంది.

Advertisement

⦿ సెన్స్ ఆఫ్ లగ్జరీ: నలుపు రంగు అనేది లగ్జరీగా అనిపిస్తుంది. చాలా లగ్జరీ కార్లు తరచుగా నలుపు రంగులో కనిపిస్తాయి. BMW ఇతర రంగులతో పోల్చితే బ్లాక్ మరింత స్టైల్ గా ఉంటుంది. రిచ్, కూల్‌ ఫీలింగ్ కలిగిస్తుంది. లగ్జరీ కార్లకే పరిమితం కాదు.. మిడిల్ రేంజ్ కార్లు కూడా చాలా అందంగా కనిపిస్తాయి.

⦿ మంచి రీ సేల్ వ్యాల్యూ: ఇతర రంగుల కార్లతో పోల్చితే నలుపు రంగు కార్లకు మంచి రీ సేల్ వ్యాల్యూ ఉంటుంది. చూడ్డానికి లగ్జరీల లుక్ ఉండటం మూలంగా మంచి విలువను కొనసాగిస్తాయి. ఇతర కార్లతో పోల్చితే బ్లాక్ కలర్ కార్లకు మంచి డిమాండ్ ఉంటుంది.

Advertisement

⦿ గీతలను దాచిపెడుతుంది: బ్లాక్ కారు మీద గీతలు పడినప్పటికీ, అంత ఎఫెక్టివ్ గా కనిపించవు. ఇంకా చెప్పాలంటే చిన్ చిన్న డ్యామేజెస్ ను కూడా బ్లాక్ కలర్ దాచి ఉంచుతుంది.  స్టోన్ చిప్ అయినా పెద్దగా చూసేందుక ఇబ్బంది కలిగించదు.

బ్లాక్ కలర్ తో నష్టాలు

⦿ బ్లాక్ పెయింట్ చాలా వేడిగా ఉంటుంది: నలుపు రంగు కార్లలో ఉన్న పెద్ద మైనస్ కారు చాలా వేడిగా మారుతుంది. బ్లాక్ అనేది సూర్యకాంతిని ఎక్కువగా గ్రహించి సులభంగా వేడి అయ్యేలా చేస్తుంది. అందుకే, వీలైనంత వరకు కారును నీడలో పార్క్ చేయడం మంచిది.

⦿ దుమ్ము, ధూళి కనిపిస్తుంది:  నల్ల రంగు కార్లు నిగనిగలాడుతూ, మెరుస్తూ కనిపించినప్పటికీ, దుమ్ము ధూళి ఈజీగా కనపడేలా చేస్తుంది. వర్షం వచ్చిన సమయంలో  ఫ్లాట్ ప్యానెల్‌లపై పేరుకుపోయే దుమ్ము ఇబ్బందికరంగా కనిపిస్తుంది. ప్రతి రెండు వారాలకు ఒకసారి మీ కారును కడిగితే ఈ సమస్య నుంచి తప్పించుకునే అవకాశం ఉంది.

⦿ గీతలు ఈజీగా కనిపిస్తాయి: కారును సరిగా కడగకపోతే దుమ్ము మరకలు కనిపిస్తాయి. అయితే, కారు కడిగే సమయంలో సున్నితమైన క్లాత్ కాకుండా హార్డ్ క్లాత్ ను వాడితే గీతలు పడే అవకాశం ఉంటుంది. అందుకే, వీలైనంత వరకు బ్లాక్ కారును కడిగే సమయంలో సున్నితమైన క్లాత్ ను లేదంటే బ్రష్ ను ఉపయోగించాలి.

⦿ డ్రైవర్లకు ఇబ్బంది: ఇతర రంగుల కార్లతో పోల్చితే రోడ్డు మీద నల్లరంగు కార్లను గుర్తించడం డ్రైవర్లకు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. నలుపు రంగు కార్లు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Read Also:  కూల్ వెదర్ లో ఎలక్ట్రిక్ కార్లు నడుపుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×