E-Paper
Advertisement

ఇండియాలోని ఈ ఫేమస్ కార్లు ఏయే దేశాలకు చెందినవో తెలుసా? దేనికదే ప్రత్యేకం!

ఇండియాలోని ఈ ఫేమస్ కార్లు ఏయే దేశాలకు చెందినవో తెలుసా? దేనికదే ప్రత్యేకం!
Advertisement

Top Car Brands in India: భారత్ లో కార్ల మార్కెట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ దేశీయ కంపెనీలు, అంతర్జాతీయ బ్రాండ్లు కలిసి వినియోగదారులకు క్రేజీ కార్లను అందిస్తున్నాయి. ప్రతి కంపెనీకి తనదైన ప్రత్యేకత ఉంటుంది. కొన్ని కంపెనీలు భద్రతపై దృష్టి పెడితే, మరికొన్ని మైలేజ్, ఫీచర్లు, డిజైన్‌ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాయి. అందుకే కారును సెలెక్ట్ చేసుకునే ముందు ఆ కారు కంపెనీ గురించి తెలుసుకోవాలి. ఇంతకీ ఇండియాలోని పాపులర్ కార్లు ఏ దేశానికి చెందినవో ముందుగా తెలుసుకుందాం..

⦿ టాటా మోటార్స్- భారత్

భారత్ లో ప్రముఖ బ్రాండ్లలో టాటా మోటార్స్ ఒకటి. ఈ కంపెనీ ముఖ్యంగా భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది. మంచి బిల్డ్ క్వాలిటీ, మంచి క్రాష్ టెస్ట్ రేటింగ్స్‌ తో వినియోగదారుల నమ్మకాన్ని పొందింది.

⦿ మహీంద్రా- ఇండియా

Advertisement

మహీంద్రా కూడా బలమైన SUVతో మంచి పేరు సంపాదించింది. గ్రామీణ ప్రాంతాల్లో, కఠినమైన రోడ్లపై  సులభంగా నడిచే వాహనాలను తయారు చేయడంలో ఈ కంపెనీకి మంచి గుర్తింపు ఉంది.

⦿ మారుతి సుజుకి- ఇండియా-జపాన్

ఇది భారత్, జపాన్ కు చెందిన కంపెనీల భాగస్వామ్యంతో రూపొందింది. ఇది సాధారణ వినియోగదారుల మొదటి ఆప్షన్ గా కొనసాగుతుంది. తక్కువ ధర, మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు లాంటి కారణాల వల్ల ఇది మార్కెట్‌ లో ముందంజలో ఉంది. మొదటిసారి కారు కొనేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది.

⦿ హ్యుందాయ్, కియా- సౌత్ కొరియా

Advertisement

ఈ రెండు కంపెనీలు సౌత్ కొరియాకు చెందినవి. ఈ కంపెనీ కార్లు ఆధునిక ఫీచర్లు, స్టైలిష్ డిజైన్లతో యువతను ఆకర్షిస్తున్నాయి. టచ్‌ స్క్రీన్లు, సన్‌ రూఫ్‌ లు, కనెక్టెడ్ టెక్నాలజీ లాంటి అంశాలు ఈ కార్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

⦿ టయోటా, హోండా-  జపాన్ 

జపాన్ కు చెందిన ఈ మోడల్స్ దీర్ఘకాలిక నమ్మకానికి ప్రసిద్ధి. వీటి కార్లు చాలా కాలం వరకు సమస్యలు లేకుండా నడుస్తాయని వినియోగదారులు నమ్ముతారు.

⦿  వోక్స్‌ వ్యాగన్, స్కోడా-  జర్మనీ, చెక్ రిపబ్లిక్ 

ఈ రెండు బ్రాండ్లు మంచి డ్రైవింగ్ అనుభవం, స్థిరత్వం కోసం ప్రసిద్ధి. హైవేలపై ప్రయాణించే వారికి మంచి ఎంపికగా ఉంటాయి.

⦿  రెనాల్ట్, సిట్రోయెన్-  ఫ్రాన్స్ 

ఫ్రాన్స్‌ కు చెందిన రెనాల్ట్, సిట్రోయెన్ కంపెనీలు భిన్నమైన డిజైన్, కంఫర్ట్‌ ను అందిస్తాయి. ఇక బ్రిటీష్ మూలాలున్న ఎంజీ మోటార్ ఆధునిక టెక్నాలజీ, పెద్ద స్క్రీన్లు, AI ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

ఇక భారత్ లోని కార్ల బిల్డ్ క్వాలిటీ ఇతర దేశాలతో పోలిస్తే కొంత భిన్నంగా  ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ధర.   ఎక్కువ మంది తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకుంటారు. అందుకే కంపెనీలు కొన్నిసార్లు బాడీ మెటీరియల్ కంటే ఫీచర్లపై ఎక్కువ దృష్టి పెడతాయి.

Read Also: టయోటాలో చవకైన కారు.. జస్ట్ రూ. 6.5 లక్షలకే కొనేయండి బ్రో!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×