E-Paper
Advertisement

Tata Punch EV: టాటా పంచ్ ఈవీని ఇప్పుడు ఈఎంఐలోనూ కొనవచ్చు, నెలకు ఎంత కట్టాలంటే?

Tata Punch EV: టాటా పంచ్ ఈవీని ఇప్పుడు ఈఎంఐలోనూ కొనవచ్చు, నెలకు ఎంత కట్టాలంటే?
Advertisement

Tata Punch EV EMI Guide: టాటా నుంచి ఈవీ మార్కెట్ లోకి విడుదలైన క్రేజీ కారు టాటా పంచ్ EV. తక్కువ ధరలో మంచి రేంజ్ తో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఫేస్ లిఫ్ట్ వెర్షన్ లోకి అడుగు పెట్టిన తర్వాత మరింత స్టైలిష్ గా కనిపిస్తోంది. ఈ కారును ఒకేసారి నెట్ క్యాష్ కాకుండా, ఈఎంఐ పద్దతిలోనూ కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ మీరు కూడా ఈ కారును ఈఎఐంలో తీసుకోవాలనుకుంటే, డౌన్ పేమెంట్ ఎంత చేయాలి? నెలవారీ ఎంత చెల్లించాలి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఈఎంఐలో టాటా పంచ్ EV కొనుగోలు గురించి..  

టాటా పంచ్ EVలో ఎంపవర్డ్ ప్లస్ S గురించి ఇప్పుడు తెలుసుకుందా.. ఈ కారు ఆన్ రోడ్ ధర రూ. 13.27 లక్షలు ఉంటుంది. ఈఎంఐలో తీసుకోవాలనుకుంటే ఆన్ రోడ్ ధరలో దాదాపు 20 శాతం డౌన్ పేమెంట్ చేయాలి. అంటే సుమారు రూ. 2.7 లక్షలు కట్టాలి. లోన్ రూ. 10.57 లక్షలు ఉంటుంది. వడ్డీ రేటు 9.5% చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈఎంఐ పరిమితిని 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాల్లో చెల్లించే వెసులబాటు ఉంది.

ఎన్ని సంవత్సరాలకు ఎంత చెల్లించాలంటే? 

Advertisement

⦿ 3 సంవత్సరాలు: ఈ కారును మూడు సంవత్సరాల ఈఎంఐలో కొనాలంటే నెలవారీ EMI రూ. 33,875 అవుతుంది.  డౌన్ పేమెంట్: రూ. 2.7 లక్షలు కట్టాలి. మొత్తం EMI చెల్లింపు: రూ. 12.2 లక్షలు చెల్లించాలి. రూ. 1.63 లక్షల వడ్డీ అవుతుంది. 3 సంవత్సరాల్లో మొత్తం రూ. 14.9 లక్షలు అవుతుంది.

Read Also: ఈవీ కారు బ్యాటరీ లైఫ్ పెంచుకోవాలంటే, సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!

Advertisement

⦿ 4 సంవత్సరాలు: 4 సంవత్సరాల లోన్ ను నెలవారీ EMI రూ. 26,568 చెల్లించాల్సి ఉంటుంది. డౌన్ పేమెంట్ రూ. 2.7 లక్షలు,  మొత్తం EMI చెల్లింపు రూ. 12.75 లక్షలు ఉంటుంది. రూ. 2.18 లక్షల వడ్డీతో సహా కట్టాలి.  4 సంవత్సరాల తర్వాత మొత్తం ఖర్చు రూ. 15.45 లక్షలు అవుతుంది.

Read Also:  మీ కారు ఎక్కువ మైలేజ్ ఇవ్వాలా.. ఇలా చేయండి భయ్యా.. వద్దన్నా వెళ్తుంది!

⦿ 5 సంవత్సరాలు: 5 సంవత్సరాల లోన్ కు నెలవారీ EMI రూ. 22,209 వరకు ఉంటుంది. డౌన్ పేమెంట్ రూ. 2.7 లక్షలు, మొత్తం EMI చెల్లింపు రూ. 13.33 లక్షలు కట్టాలి. రూ. 2.76 లక్షల వడ్డీ అవుతుంది.  5 సంవత్సరాల తర్వాత మొత్తం ఖర్చు రూ. 16.03 లక్షలు అవుతుంది.

⦿ 7 సంవత్సరాలు: 7 సంవత్సరాల లోన్ కు నెలవారీ EMI రూ. 17,284 ఉంటుంది. డౌన్ పేమెంట్: రూ. 2.7 లక్షలు,  మొత్తం EMI చెల్లింపు రూ. 14.52 లక్షలు కట్టాలి. రూ. 3.95 లక్షల వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.  7 సంవత్సరాల తర్వాత మొత్తం ఖర్చు రూ. 17.22 లక్షలు అవుతుంది.

Read Also: టాటా సియెర్రా కారును టెస్ట్ డ్రైవ్ చేసిన మహిళ.. నేరుగా 20 అడుగుల గుంతలోకి జంప్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×