E-Paper
Advertisement

Best Budget Sunroof Cars: సన్‌ రూఫ్‌ కారు కొనాలనుకుంటున్నారా? చౌకైన మోడల్స్ ఇవే!

Best Budget Sunroof Cars: సన్‌ రూఫ్‌ కారు కొనాలనుకుంటున్నారా? చౌకైన మోడల్స్ ఇవే!
Advertisement

ప్రస్తుతం కారు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు ఫీచర్ రిచ్ కార్ల కోసం చూస్తున్నారు. అందులో ముఖ్యంగా సన్ రూఫ్ ఉందా? లేదా? అని ఆలోచిస్తున్నారు. గత కొద్ది సంవత్సరాలలో సన్‌ రూఫ్ అత్యంత ప్రజాదరణ పొందిన ఫీచర్లలో ఒకటిగా మారిపోయింది. నిజానికి భారత్ లో ఈ ఫీచర్ అంత అనుకూలంగా లేకపోయినా, వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. వారి ఆసక్తి అనుగుణంగా ఆయా కంపెనీలు కూడా సన్ రూఫ్ కార్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ మోడళ్లలో కూడా సన్‌ రూఫ్‌ లను అందిస్తున్నాయి. ప్రస్తుతం దేశీ మార్కెట్ లో అందుబాటులో ఉన్న చౌకైన సన్ రూఫ్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ హ్యుందాయ్ i20

సన్‌ రూఫ్‌తో వచ్చే అత్యంత చౌకైన కార్లలో హ్యుందాయ్ i20 ఒకటి. దీని ధర సుమారు రూ. 6.99 లక్షలు ఉంటుంది.  i20 మాన్యువల్, CVT గేర్‌ బాక్స్ ఆప్షన్ తో వస్తుంది. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ ను కలిగి ఉంటుంది. ఇది 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగులు ఉంటాయి. EBDతో ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ లాంటి భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది.

⦿ హ్యుందాయ్ ఎక్స్‌టర్

Advertisement

కాంపాక్ట్ SUV హ్యుందాయ్ ఎక్స్‌ టర్ సన్‌రూఫ్‌ను కలిగి ఉంటుంది.  దీని రూ. 7.03 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇది i20 మాదిరిగానే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ ను కలిగి ఉంటుంది. CNG వేరియంట్‌ లో కూడా వస్తుంది. ఈ కారు మైలేజ్ 19.4 కిలో మీటర్లు ఇస్తుంది.

⦿ టాటా పంచ్

టాటా పంచ్ కూడా చౌకైన సన్ రూఫ్ కలిగి కార్లలో ఒకటిగా కొనసాగుతోంది. ప్యూర్+S ట్రిమ్ నుంచి సన్‌ రూఫ్‌ ను కలిగి ఉంటుంది. దీని ధర రూ. 7.35 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇది సింగిల్ పేన్ ఎలక్ట్రిక్ సన్‌ రూఫ్, 8 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, నాలుగు స్పీకర్లు, ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, EBDతో ABS, చైల్డ్ సీట్ల కోసం ISOFIX మౌంట్లు సహా పలు భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది.

⦿ టాటా ఆల్ట్రోజ్

Advertisement

టాటా ఆల్ట్రోజ్ హ్యాచ్‌ బ్యాక్ ప్యూర్ S ట్రిమ్ నుంచి సన్‌ రూఫ్‌ను అందిస్తుంది. దీని ధర రూ. 7.36 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. పెట్రోల్, డీజిల్, CNG పవర్‌ ట్రెయిన్లలో ఈ కారు అందుబాటులో ఉంటుంది. ప్యూర్ S ట్రిమ్‌ లో 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక AC వెంట్స్ ఉన్నాయి. భద్రతా ఫీచర్లలో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, EBDతో ABS, ESC, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ ఉన్నాయి. ఈ కారు సుమారు 19 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది.

⦿ కియా సోనెట్

కియా సోనెట్ THE (O) 1.2L పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ నుంచి సన్ రూఫ్‌ను అందిస్తుంది. దీని ధర రూ. 7.70 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇది ప్రాథమిక ఆడియో సిస్టమ్, నాలుగు స్పీకర్లు, ఫ్రంట్ పవర్ విండోలతో వస్తుంది. భద్రతా ఫీచర్లలో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, ESC, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ అసిస్ట్ కంట్రోల్ ఉన్నాయి.

Read Also: పెట్రోల్ vs డీజిల్.. ఏది కొంటే మంచిది?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×