// // Flying Taxi: ఫ్లయింగ్ టాక్సీలు వచ్చేశాయ్, ఇక హ్యపీగా గాల్లో ఎగిరిపోవచ్చు! -->
E-Paper
Advertisement

ఫ్లయింగ్ టాక్సీలు వచ్చేశాయ్, ఇక హ్యపీగా గాల్లో ఎగిరిపోవచ్చు!

ఫ్లయింగ్ టాక్సీలు వచ్చేశాయ్, ఇక హ్యపీగా గాల్లో ఎగిరిపోవచ్చు!
Advertisement

Pilotless Electric Air Taxis: నగర ప్రయాణాలు ట్రాఫిక్ ఇబ్బందులతో ఎంత నరకంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెట్రో రైళ్లు ఉన్నప్పటికీ, ట్రాఫిక్ గంటల సమయం ఇట్టే కరిగిపోతోంది. ఈ సమస్యకు త్వరలోనే చెక్ పడబోతోంది. ఎగిరే ట్యాక్సీలు రాబోతున్నాయి. విద్యుత్ తో నడిచే ఈ ట్యాక్సీలు ప్రయాణీకులను నిమిషాల వ్యవధిలోనే గమ్యస్థానాలకు చేర్చబోతున్నాయి. ఇంతకీ ఈ ట్యాక్సీలు ఎలా పని చేస్తాయంటే?

eVTOL ట్యాక్సీలను రూపొందించిన జీరోగ్ సంస్థ

విద్యుత్‌తో నడిచే ఈ ఫ్లయింగ్ ట్యాక్సీలను చైనా షెన్‌ జెన్ నగరంలో ఉన్న జీరోగ్ అనే సంస్థ తయారు చేస్తోంది.  ప్రయాణీకులను ఒక చోటు నుంచి మరోచోటుకి వేగంగా తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా  eVTOL ఫ్లయింగ్ ట్యాక్సీలను డెవలప్ చేసతోంది. eVTOL అంటే ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ వెహికల్స్. ఇవి రన్ వే అవసరం లేకుండానే నేల మీది నుంచి నేరుగా పైకి ఎగిరి, తిరిగి అదేలా కిందికి దిగుతాయి. కొత్త తరహా ట్యాక్సీలు పూర్తిగా ఆటోమేటిక్‌గా పనిచేస్తాయి. అంటే, పైలట్ అవసరం లేకుండానే ఇవి ప్రయాణిస్తాయి. ముందుగానే ప్రోగ్రామ్ చేసిన మార్గాల్లో సురక్షితంగా ప్రయాణీకులను తీసుకెళ్తాయి. అనుకున్న గమ్యస్థానానికి చేర్చుతాయి. ఇది భవిష్యత్తులో రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చే అవకాశం ఉంది.

eEvtol ప్రత్యేకత ఏంటి?

Advertisement

ఈ ప్లయింగ్ ట్యాక్సీలు మల్టీఫుల్ రోటర్లతో రూపొందించబడ్డాయి. ఒకటి లేదంటే రెండు ప్రొపెల్లర్లు కాకుండా, అనేక చిన్న రోటర్లు కలిసి పని చేస్తాయి. దీని వల్ల ట్యాకసీ స్థిరంగా ఎగురుతుంది. ఎలాంటి సమస్య వచ్చినా సురక్షితంగా దిగుతుంది. అంతేకాదు, వీటిలో అధునాతన భద్రతా వ్యవస్థలు ఉంటాయి. సెన్సర్లు, ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్స్, ఎమర్జెన్సీ బ్యాకప్ వ్యవస్థలు ప్రయాణీకుల భద్రతను మరింత మెరుగుపరుస్తాయి.

Read Also: రూ. 1.5 లక్షల్లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒక్కోదాని రేంజ్ ఏంతో తెలుసా?

సిటీ ట్రాఫిక్ కు బెస్ట్ సొల్యూషన్

Advertisement

నగర, పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో, ఎగిరే టాక్సీలు మంచి పరిష్కారంగా మారే అవకాశం ఉంటుంది. రోడ్లపై ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సిన అవసరం లేకుండా, గాల్లోనే తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో మరింత సౌకర్యంగా ఉంటుంది.  ఈ eVTOL వాహనాలు సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తే, ప్రయాణ విధానం పూర్తిగా మారిపోతుంది. రోజువారీ ప్రయాణాలు వేగంగా, సులభంగా, పర్యావరణ అనుకూలంగా మారుతాయి. పైలట్ లేని ఈ విద్యుత్ ప్లయింగ్ ట్యాక్సీలు, భవిష్యత్తులో ప్రయాణాలను మరింత సులభతరం చేయడమే కాకుండా, వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణానికి కొత్త దారులు చూపించబోతున్నాయి.

Read Also: ఈ కారుకు పెట్రోల్, ఛార్జింగ్ అసవసరం లేదు, హ్యాపీగా వెళ్లొచ్చు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×