E-Paper
Advertisement

ప్లగ్ ఇన్ హైబ్రిడ్ vs స్ట్రాంగ్ హైబ్రిడ్.. ఇండియన్స్ వినియోగదారులకు ఏది బెస్ట్?

ప్లగ్ ఇన్ హైబ్రిడ్ vs స్ట్రాంగ్ హైబ్రిడ్.. ఇండియన్స్ వినియోగదారులకు ఏది బెస్ట్?
Advertisement

Strong Hybrid vs PHEV: భారత ఆటోమొబైల్ మార్కెట్‌ లో ఎలక్ట్రిక్ కార్లు, హైబ్రిడ్ కార్లపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో కొత్త చర్చ మొదలైంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు మంచివా? లేక ప్లగ్ ఇన్ హైబ్రిడ్ (PHEV) వాహనాలు మంచిదా? అని కార్ల కొనుగోలుదారుల్లో కన్ఫ్యూజన్ మొదలయ్యింది. ఇంతకీ ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

భారత మార్కెట్ లో స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు

ఇప్పటి వరకు భారత మార్కెట్లో టయోటా, మారుతి లాంటి కంపెనీలు స్ట్రాంగ్ హైబ్రిడ్ వాహనాలను అందిస్తున్నాయి. మరోవైపు, BMW i8, ఫెరారీ 296 GTB వంటి లగ్జరీ కార్లలో మాత్రమే ప్లగ్ ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీ కనిపించింది. అయితే, ఇప్పుడు BYD లాంటి కంపెనీలు సాధారణ వినియోగదారుల కోసం కూడా PHEV వాహనాలను తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి.

రెండింటి మధ్య తేడా ఏంటి?

Advertisement

స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లలో బ్యాటరీలు వాహనం నడుస్తున్న సమయంలోనే ఆటోమేటిక్‌ గా ఛార్జ్ అవుతాయి. ప్రత్యేకంగా ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. కానీ, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వాహనాల్లో బ్యాటరీని బయట నుంచి ఛార్జ్ చేయాలి. అలా చేయకపోతే పూర్తి స్థాయి పనితీరు, మైలేజ్ ప్రయోజనాలు లభించవు. కొంతమంది వినియోగదారుల అభిప్రాయం ప్రకారం, PHEVలు ప్రస్తుత పరిస్థితుల్లో మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఇవి ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగా నగర ప్రయాణాలకు ఉపయోగపడతాయి. అదే సమయంలో, సుదూర ప్రయాణాల్లో పెట్రోల్ ఇంజిన్ సాయంగా ఉంటుంది. దీంతో రేంజ్ ఆందోళన ఉండదు. రోజుకు 40 నుంచి 50 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించే వారికి PHEVలు ఉపయోగకరంగా ఉంటాయి. ఇంట్లో ఛార్జ్ చేసి సిటీలో పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌ లో ప్రయాణించవచ్చు. హైవే ప్రయాణాల సమయంలో మాత్రం పెట్రోల్ ఇంజిన్ సపోర్ట్ అందుబాటులో ఉంటుంది.

స్ట్రాంగ్ హైబ్రిడ్‌ల ప్రత్యేకత ఏంటంటే?

స్ట్రాంగ్ హైబ్రిడ్‌లకు కూడా ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. ఛార్జింగ్ స్టేషన్ల కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది. ప్రత్యేకంగా ఛార్జింగ్ అవసరం లేకుండా సాధారణ కార్ల మాదిరిగానే ఉపయోగించవచ్చు. అయితే, ఆటో నిపుణులు PHEVల్లో సాంకేతిక వ్యవస్థలు మరింత క్లిష్టంగా ఉంటాయని చెబుతున్నారు. బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్, పెట్రోల్ ఇంజిన్ కలిసి పనిచేయడం వల్ల మెయింటెనెన్స్ ఖర్చులు, సర్వీసింగ్ సమస్యలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా సిటీలో ఎక్కువగా ప్రయాణించే వారికి ప్లగ్ ఇన్ హైబ్రిడ్స్ ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ, సింపుల్ వినియోగం, తక్కువ ఇబ్బందులు కోరుకునే వారికి స్ట్రాంగ్ హైబ్రిడ్స్ ఇంకా మంచి ఆప్షన్ గా కనిపిస్తున్నాయి.

Advertisement

Read Also: హైబ్రిడ్ SUVలపై హ్యుందాయ్, కియా ఫోకస్.. అదిరిపోయే మోడళ్లు రెడీ!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×