E-Paper
Advertisement

పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్.. ఐదేళ్లలో ఏ కారుకు ఎంత ఖర్చు అవుతుందంటే?

పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్.. ఐదేళ్లలో ఏ కారుకు ఎంత ఖర్చు అవుతుందంటే?
Advertisement

Total Cost of Ownership in India: కారు కొనడం ముఖ్యం కాదు, దాన్ని చక్కగా మెయింటెయిన్ చేయడం ముఖ్యం.  కారు కొనడం అంటే కేవలం షోరూమ్‌ ధర మాత్రమే కాదు.. అసలు ఖర్చు కారును కొన్ని సంవత్సరాలు ఉపయోగించిన తర్వాతే స్పష్టంగా తెలుస్తుంది. ఫ్యూయెల్, సర్వీస్, ఇన్సూరెన్స్ తో పాటు రీసేల్ ధర కలిపి చూసినప్పుడే నిజమైన ఖర్చు బయటపడుతుంది. ఈ విషయాన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో లభించే ఒకే మోడల్ SUV ఆధారంగా ఐదేళ్ల ఖర్చు ఎలా ఉంటుందో ఇప్పుడు అంచనా వేసే ప్రయత్నం చేద్దాం..

కొనుగోలు ధర గురించి..

మొదట కొనుగోలు ధర విషయానికి వస్తే, పెట్రోల్ వాహనం సాధారణంగా చవకగా ఉంటుంది. డీజిల్ కొంచెం ఎక్కువ ఖరీదు అవుతుంది. ఎలక్ట్రిక్ వాహనం చాలా ఎక్కువ ఖరీదు అవుతుంది. చాలామందికి EV కొనడం మొదట్లో ఇబ్బందిగా భావిస్తారు. అయితే, రోజువారీ ప్రయాణంలో ఫ్యూయెల్ ఖర్చు అనేది కీలకపాత్ర పోషిస్తుంది. పెట్రోల్ కార్లు సాధారణంగా కిలో మీటరుకు ఎక్కువ ఖర్చుకు కారణం అవుతాయి. డీజిల్ వాహనాలు కొంచెం మెరుగైన మైలేజీ ఇస్తాయి కాబట్టి ఖర్చు తగ్గుతుంది. కానీ, ఎలక్ట్రిక్ వాహనాలకు ఇంట్లో ఛార్జ్ చేస్తే కిలోమీటరుకు అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఐదేళ్లలో చూస్తే, ఇంధనంపై ఖర్చయ్యే మొత్తం EVలో చాలా తక్కువగా ఉంటుంది.

మెయింటెనెన్స్ విషయంలోనూ..

Advertisement

మెయింటెనెన్స్ విషయానికి వస్తే.. పెట్రోల్ కార్ల సర్వీసింగ్ సాధారణంగా మధ్యస్థంగా ఉంటుంది. డీజిల్ కార్లలో కొన్ని అదనపు భాగాలు ఉండటం వల్ల ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో అయితే ఇంజిన్ లేకపోవడం, తక్కువ మెకానికల్ భాగాలు ఉండటం వల్ల సర్వీస్ ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి.

ఇన్సూరెన్స్ ఖర్చు గురించి..

ఇన్సూరెన్స్ విషయంలో EVలకు కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. కారణం, వాటి ధర ఎక్కువగా ఉంటుంది. బ్యాటరీ ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, మొత్తం లెక్కల్లో పెద్ద తేడా ఏమీ ఉండదు.

రీసేల్ గురించి..

Advertisement

రీసేల్  వ్యాల్యూలో పెట్రోల్ కార్లు ఎక్కువ ధర పలుకుతాయి. డీజిల్ కార్లకు కొన్నిచోట్ల నిబంధనలు ఉండటం వల్ల వాటి విలువ కొంచెం తక్కువగా ఉంటుంది. ఎలక్ట్రిక్ కార్ల విషయంలో మాత్రం మార్కెట్ అంతా కొనసాగడం లేదు. బ్యాటరీ హెల్త్ మీద ఆధారపడి వాటి రీసేల్ విలువ మారుతుంది.

అన్ని అంశాలను కంపార్ చేస్తే..

అన్ని అంశాలను కలిపి చూసినప్పుడు ఆసక్తికరమైన విషయం తెలిసింది. పెట్రోల్ కారు మొత్తం ఖర్చు మధ్యస్థంగా ఉంటుంది. డీజిల్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనం ప్రారంభంలో ఖరీదైనప్పటికీ, రన్నింగ్ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. తక్కువగా డ్రైవ్ చేస్తే పెట్రోల్ బెస్ట్. ఎక్కువగా హైవేల్లో ప్రయాణిస్తే డీజిల్ కారు మంచి ఆప్షన్.  రోజూ ఎక్కువ దూరం ప్రయాణిస్తూ, ఇంట్లో ఛార్జింగ్ సౌకర్యం ఉంటే ఎలక్ట్రిక్ వాహనం తీసుకోవడం మంచిది.

Read Also: సమ్మర్ డ్రైవ్ లో ఫ్యూయెల్ సేవింగ్ ఎలా? ఏసీ వేయాలా? కిటికీలు తెరవాలా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×