E-Paper
Advertisement

ఒక్కసారే.. ఎక్కడికక్కడ ఆగిపోయిన వందలాది ట్యాక్సీలు.. ఓర్నీ ఇలా కూడా అవుతుందా?

ఒక్కసారే.. ఎక్కడికక్కడ ఆగిపోయిన వందలాది ట్యాక్సీలు.. ఓర్నీ ఇలా కూడా అవుతుందా?
Advertisement

Autonomous Taxi Breakdown: ప్రపంచ వ్యాప్తంగా రోబో ట్యాక్సీలు అందుబాటులోకి వచ్చింది. డ్రైవర్ లేకుండానే ఈ కార్లు ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతాయి. అయితే, వీటిలో సిస్టమ్ ఫెయిల్యూర్ ఏర్పడితే ఎంత ఘోరమైన పరిస్థితులు ఎదురవుతాయో తాజాగా ప్రయాణీకులు తెలిసి వచ్చింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

చైనాలోని వుహాన్ నగరంలో ఇటీవల ఓ విచిత్ర ఘటన జరిగింది. ఒకేసారి వందకు పైగా ఆటోమేటిక్ రోబోటాక్సీలు పని చేయడం ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మార్చి 31 రాత్రి ఈ సంఘటన జరిగింది.  ప్రయాణికులు దాదాపు గంటన్నరకు పైగా కార్లలోనే చిక్కుకుపోయారు. రాత్రి సుమారు 8:57 గంటల సమయంలో ఈ సమస్య ఏర్పడింది. నగరంలో నడుస్తున్న రోబోటాక్సీలు ఒక్కసారిగా స్పందించడం ఆపేయడంతో ట్రాఫిక్ మధ్యలోనే నిలిచిపోయాయి. కొన్ని కార్లలో ఉన్న ప్రయాణికులు డోర్లు ఓపెన్ చేయలేకపోయారు.  మరికొందరు రోడ్డుమధ్యలో ఉండటంతో బయటకు రావడానికి భయపడ్డారు.

సాంకేతిక లోపంతోనే సమస్య

Advertisement

ఈ రోబోటాక్సీలు చైనాకు చెందిన టెక్నాలజీ కంపెనీ బైడూ నిర్వహిస్తున్నది.  అపోలో గో అనే ఈ సర్వీసుకు సంబంధించి పూర్తిగా ఆటోమేటిక్ వ్యవస్థపై ఆధారపడి పనిచేస్తుంది. అయితే ఆ రోజు అకస్మాత్తుగా వచ్చిన సాంకేతిక లోపం కారణంగా అన్ని వాహనాలు ఒకేసారి నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడ్డారు. తాను దాదాపు 90 నిమిషాల పాటు టాక్సీలోనే చిక్కుకుపోయానని, కస్టమర్ సర్వీస్‌కు ఫోన్ చేసినా సరైన స్పందన రాలేదని ఓ ప్రయాణీకురాలు వెల్లడించింది. పలుమార్లు ఫోన్ చేసినా సమస్యను పరిష్కరించేలా ఎవరూ ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. భారీ వాహనాల మధ్య ఓవర్‌ పాస్‌ పై నిలిచిపోయి చాలా భయపడినట్లు చెప్పింది.

సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో, వుహాన్ నగరంలోని పలు ప్రాంతాల్లో రోబోటాక్సీలు రోడ్డుమధ్యలో ఆగిపోవడం కనిపించింది. కొన్ని వాహనాలు స్వల్పంగా ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పటికీ,  ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై స్పందించిన అపోలో గో సంస్థ, సిస్టమ్ ఫెయిల్యూర్  ఇలా జరిగి ఉండవచ్చని తెలిపింది. కచ్చితమైన కారణం ఏమిటన్నది ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేదు. ప్రాథమిక విచారణలో సెంట్రల్ కంట్రోల్ వ్యవస్థలో లోపం ఉండొచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ వాహనాలు ఒక్కోటి స్వతంత్రంగా పనిచేసినా, ఒక సెంట్రల్ సిస్టమ్ ద్వారా నియంత్రించబడతాయి. ఆ వ్యవస్థలో ఏదైనా సమస్య వస్తే ఒకేసారి అనేక వాహనాలు ప్రభావితమవుతాయి.

Advertisement

రోబో ట్యాక్సీల భద్రతపై అనుమానాలు

ఈ సంఘటనతో రోబోటాక్సీల భద్రతపై కొత్తగా చర్చ మొదలైంది. పూర్తిగా ఆటోమేటిక్ టెక్నాలజీపై ఆధారపడే వాహనాలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటే ప్రయాణికుల భద్రత ఎలా ఉంటుందన్న ప్రశ్నలు లేవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా కంపెనీలు మరింత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

Read Also: 1984 కైనెటిక్ DX రీ-ఎంట్రీ.. ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ అవతార్ లో!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×