E-Paper
Advertisement

Ola Offer: ఓలా క్రేజీ ఆఫర్, అదనపు ఖర్చు లేకుండా S1 ప్రో+, రోడ్‌స్టర్ X+ ఛాంపియన్స్ ఎడిషన్‌!

Ola Offer: ఓలా క్రేజీ ఆఫర్, అదనపు ఖర్చు లేకుండా S1 ప్రో+, రోడ్‌స్టర్ X+ ఛాంపియన్స్ ఎడిషన్‌!
Advertisement

Ola Launches S1 Pro+ and Roadster X+ Champions Edition: భారత్ T20 ప్రపంచ కప్ విజయాన్ని గుర్తు చేసేందుకు ఓలా ఎలక్ట్రిక్ S1 ప్రో+, రోడ్‌ స్టర్ X+ పరిమిత ఛాంపియన్స్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఛాంపియన్స్ ఎడిషన్ 5.2kWh బ్యాటరీతో 4680 భారత్ సెల్ ఆధారిత S1 ప్రో+, 9.1kWh బ్యాటరీతో రోడ్‌స్టర్ X+ను తీసుకొస్తుంది. బ్లూ థీమ్ లివరీని అందిస్తుంది. ప్రామాణిక మోడళ్లతో పోలిస్తే ధర సేమ్ ఉంటుంది. ఈ ఎడిషన్ ఏప్రిల్ 2026 చివరి వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. S1 ప్రో+ రూ. 1,54,999(ఎక్స్ షోరూమ్)  నుంచి ప్రారంభమవుతుంది. రోడ్‌స్టర్ X+ రూ. 1,09,999 (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఆయా వేరియంట్ ఆధారంగా ధరలు, కాన్ఫిగరేషన్ మారే అవకాశం ఉంటుంది.

S1 Pro+ పరిమిత ఎడిషన్ గురించి..

S1 Pro+ 5.2kWh అనేది 320km వరకు IDC రేంజ్ క్లెయిమ్ తో వస్తుంది. ఇది ఈ లైనప్ లో టాప్ రేంజ్ స్కూటర్ గా నిలిచింది. ఛాంపియన్స్ ఎడిషన్ వెర్షన్ 13kW మోటార్ తో వస్తుంది. 2.1 సెకన్లలో 0-40 కిలో మీటర్ల వేగాన్ని అందిస్తుంది.  పరిమిత మోడల్ అదే పనితీరు ప్యాకేజీని కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది.

రోడ్‌స్టర్ X+ గురించి..

Advertisement

రోడ్‌స్టర్ X+ పరిమిత ఎడిషన్ ను కూడా ఎలాంటి ధర తేడా లేకుండా ఉంటుంది. ఓలా దీనిని స్కూటర్ ఓన్లీ అప్‌ డేట్‌ గా కాకుండా క్రాస్ కేటగిరీగా పరిగణిస్తోంది. 9.1kWh బ్యాటరీతో రోడ్‌స్టర్ X+ దాదాపు 501 కిలో మీటర్ల IDC రేంజ్, 125 కిలో మీటర్ల గరిష్ట వేగాన్ని అందిస్తుంది. ఛాంపియన్స్ ఎడిషన్ రోడ్‌స్టర్ X+ 11kW మోటారును ఉపయోగిస్తుంది. 2.7 సెకన్లలో 0 నుంచి 40 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. రోడ్‌స్టర్ X+ అనేది ఓలా పోర్ట్‌ ఫోలియోలో ఇప్పటికే ఎక్కువగా ఉన్న మోడళ్లపై నిర్మించిన పరిమిత ఎడిషన్.

Read Also: టీవీఎస్ ఐక్యూబ్ కొనాలనుకుంటున్నారా? ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

Advertisement

టీమ్ ఇండియా T20 వరల్డ్ కప్ గెలవడాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ, ఈ రెండు మోడల్స్ పరిమిత ఎడిషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారులు ఈ మోడల్స్ కొనుగోలుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

Read Also: పొట్టి కప్ కొట్టిన భారత్.. అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన ఓలా!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×