E-Paper
Advertisement

Ola Electric Shares: అప్పు తీర్చిన అధినేత, ఓలా షేర్లు ఒక్కసారి 10 శాతం జంప్!

Ola Electric Shares: అప్పు తీర్చిన అధినేత, ఓలా షేర్లు ఒక్కసారి 10 శాతం జంప్!
Advertisement

ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు సంబంధించిన  మొబిలిటీ షేర్లు దాదాపు 10 శాతం పెరిగాయి. ఇవాళ మార్కెట్లు ఓపెన్ అయినప్పటి నుంచి మంచి దూకుడు కనబరిచాయి. కంపెనీ తన ప్రమోటర్, CEO భవిష్ అగర్వాల్ రుణాన్ని తిరిగి చెల్లించడానికి, తన వ్యక్తిగత వాటాలో కొంత భాగాన్ని విక్రయించడాన్ని పూర్తి చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చిన వెంటనే ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ షేర్లు ఉదయం ట్రేడింగ్ గంటల్లో ఒక్కొక్కటి రూ. 34.38కి పెరిగాయి. ఇది మూడు సెషన్ల నష్టాల పరంపరను ముగించినట్లు అయ్యింది.

ఓలా ఎలక్ట్రిక్ ఏం చెప్పిందంటే?   

Advertisement

డిసెంబర్ 18న మార్కెట్ అనంతర సమయంలో విడుదల చేసిన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో, భవిష్ అగర్వాల్ దాదాపు రూ. 260 కోట్ల ప్రమోటర్ స్థాయి రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించడానికి తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించారని ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తెలిపింది. గతంలో రుణం కోసం తాకట్టు పెట్టిన 3.93 శాతం షేర్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. “లావాదేవీ తర్వాత, ప్రమోటర్ గ్రూప్ ఓలా ఎలక్ట్రిక్‌లో 34.6% వాటాను కొనసాగిస్తోంది. ప్రమోటర్ నియంత్రణలో ఎటువంటి తగ్గుదల లేదు. ఇది పూర్తిగా ప్రమోటర్ వ్యక్తిగత స్థాయిలో అమలు చేయబడిన ప్రణాళికాబద్ధమైన, సమయానుకూలమైన నిర్ణయం. కంపెనీ పని తీరు, కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం చూపదు” అని కంపెనీ తెలిపింది.

ఓలా ఎలక్ట్రిక్ షేర్ ధర

ప్రమోటర్ భవిష్ అగర్వాల్ తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించడంతో ఓలా ఎలక్ట్రిక్ షేర్లు కేవలం మూడు సెషన్లలో 17 శాతానికి పైగా పడిపోయాయి. ఫలితంగా, డిసెంబర్ 18న స్టాక్ ఒక్కసారిగా పడిపోయి ఒక్కో షేరుకు రూ. 30.76 ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. గత సంవత్సరం ఆగస్టు 20న రికార్డు స్థాయిలో ఉన్న రూ. 157.4 నుండి ఇది 80 శాతానికి పైగా నష్టపోయింది.

Advertisement

Read Also:  బుకింగ్స్ లో దుమ్మురేపుతున్న టాటా సియెర్రా, 24 గంటల్లో ఏకంగా 70 వేల బుకింగ్స్!

శుక్రవారం ఉదయం 11:02 గంటలకు ఇప్పటివరకు 19.42 మిలియన్లకు పైగా షేర్లు ట్రేడయ్యాయి. ఇది వారి 30 రోజుల మూవింగ్ యావరేజ్ కంటే దాదాపు 4.8 రెట్లు ఎక్కువ. గురువారం, భవిష్ అగర్వాల్ కంపెనీలో 0.6 శాతం వాటాను రూ.90.28 కోట్లకు బల్క్ డీల్ ద్వారా విక్రయించారు. బుధవారం నాడు స్టాక్ ముగింపు ధర కంటే 3 శాతం కంటే ఎక్కువ తగ్గింపుతో ఆయన 2.83 కోట్ల షేర్లను ఒక్కొక్కటి రూ.31.90కి విక్రయించారు. రూ.260 కోట్ల ప్రమోటర్ స్థాయి రుణాన్ని పూర్తిగా చెల్లించడానికి తన వ్యక్తిగత వాటాలో కొంత భాగాన్ని ఒకేసారి అమ్మినట్లు భవిష్ అగర్వాల్ డిసెంబర్ 16న ఎక్స్ఛేంజీలకు తెలియజేశారు. మొత్తంగా ఈ నిర్ణయంతో ఓలా షేర్లు స్టాక్ మార్కెట్లో దూసుకెళ్తున్నాయి.

Read Also:  ఇండిగో వివాదం.. ఇంతకీ దాని యజమాని ఎవరు? ఆయన ఆస్తుల విలువెంతో తెలుసా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×