E-Paper
Advertisement

డెలివరీ బాయ్స్ కోసం ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. లాంచింగ్ ఎప్పుడంటే?

డెలివరీ బాయ్స్ కోసం ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. లాంచింగ్ ఎప్పుడంటే?
Advertisement

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఓలా ఎలక్ట్రిక్ మరో కీలక అడుగు వేయడానికి రెడీ అవుతోంది. సాధారణ వినియోగదారులతో పాటు వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది. ఈ స్కూటర్‌ కు ఇప్పటికే అవసరమైన అనుమతులు లభించాయి.   రాబోయే కొద్ది నెలల్లోనే దీనిని అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజగా ఈ స్కూటర్‌ కు ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) హోమోలోగేషన్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ విడుదల రెడీ అయినట్లు అర్థం అవుతోంది.

S1 ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారీ

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ప్రస్తుతం విక్రయిస్తున్న S1 ప్లాట్‌ ఫారమ్ ఆధారంగా రూపొందించబడింది. దీనిని ప్రధానంగా ఫుడ్ డెలివరీ, ఈ కామర్స్ డెలివరీలు, క్విక్ కామర్స్ సేవలు, ఇతర సిటీ వాణిజ్య అవసరాల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఇందులో 4 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉండగా, గరిష్ట వేగం గంటకు సుమారు 70 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది.

Advertisement

ప్రస్తుతం పెట్రోల్ ధరలు పెరగడం, మెయింటెనెన్స్ ఖర్చులు ఎక్కువ కావడంతో డెలివరీ భాగస్వాములు, గిగ్ వర్కర్లు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు. రోజువారీ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి EVలు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఓలా ఈ కొత్త కమర్షియల్ స్కూటర్‌ ను తీసుకువస్తోంది.

ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు   

మరోవైపు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే విధానాలను అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించడం, ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం లక్ష్యంగా EVలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. వాణిజ్య రంగంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి.

లాంచింగ్ ఎప్పుడంటే?

Advertisement

వాస్తవానికి డెలివరీ సేవలు, ఫ్లీట్ ఆపరేషన్లలో ఉపయోగించే వాహనాలు రోజుకు ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. అందువల్ల ఈ విభాగంలో EVల వినియోగం వేగంగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓలా కొత్త కమర్షియల్ ఈ-స్కూటర్‌ను విడుదల చేస్తే, కమర్షియల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మార్కెట్లో కంపెనీకి కొత్త అవకాశాలు లభించే అవకాశముంది.  కంపెనీ అధికారిక లాంచ్ తేదీని ప్రకటించకపోయినా, అవసరమైన అనుమతులు పూర్తవడంతో ఈ క్వార్టర్ లోనే  మార్కెట్లోకి వచ్చే అవకాశాలు  కనిపిస్తున్నాయి. దీంతో కమర్షియల్ EV విభాగంలో పోటీ మరింత పెరగనుంది.

Read Also: ట్రయంఫ్ అభిమానులకు షాక్.. 350cc మోడల్స్ ధర పెంపు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×