// // India’s EV Market: ఓలా వెనుకబాటు, ఏథర్ ముందడుగు.. ఈవీ రంగంలో కొత్త పోటీ! -->
E-Paper
Advertisement

ఓలా వెనుకబాటు, ఏథర్ ముందడుగు.. ఈవీ రంగంలో కొత్త పోటీ!

ఓలా వెనుకబాటు, ఏథర్ ముందడుగు.. ఈవీ రంగంలో కొత్త పోటీ!
Advertisement

Electric Scooter Market Trends: దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ మరింత బలోపేతం అవుతోంది. ఒకప్పుడు ఈ విభాగంలో అగ్రస్థానంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో టీవీఎస్, బజాజ్ లాంటి కంపెనీలు మళ్లీ బలంగా ఎదిగి మార్కెట్‌ లో తమ బలాన్ని పెంచుకుంటున్నాయి.

పెరిగిన ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మకాలు

గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2026లో ఎలక్ట్రిక్ టూ వీలర్ అమ్మకాలు దాదాపు 22 శాతం పెరిగాయి. మొత్తం అమ్మకాలు 1.35 మిలియన్ యూనిట్లను దాటాయి. అయితే, ఈ వృద్ధిలో ఓలా కంటే ఇతర కంపెనీలు ఎక్కువగా లాభపడ్డాయి. ఓలా ఎలక్ట్రిక్ విషయానికి వస్తే, గతంలో ఉన్న మార్కెట్ వాటా గణనీయంగా తగ్గింది. ఒకప్పుడు 20 శాతానికి పైగా మార్కెట్ షేర్ ఉన్న ఈ కంపెనీ, ఇప్పుడు చాలా తక్కువ స్థాయికి చేరింది. ఇటీవల నెలలో కేవలం 10,000కి కొద్దిగా ఎక్కువ వాహనాలను మాత్రమే విక్రయించగలిగింది. ఇది గతంతో పోలిస్తే భారీ తగ్గుదలగా చెప్పుకోవచ్చు. మొత్తం సంవత్సరంలో కూడా అమ్మకాలు తగ్గాయి.

మరింత ముందుకు దూసుకెళ్లిన టీవీఎస్

Advertisement

అటు టీవీఎస్ మోటార్ కంపెనీ బలంగా ముందుకు దూసుకెళ్లింది. గతంలో సుమారు 20,000 యూనిట్లు అమ్మిన ఈ సంస్థ, ఇప్పుడు తన అమ్మకాలను రెండింతలు చేసి దాదాపు 50,000 యూనిట్లకు చేర్చింది. మార్కెట్ వాటా కూడా గణనీయంగా పెరిగింది. అదే సమయంలో బజాజ్ ఆటో కూడా మంచి వృద్ధిని సాధించింది. ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు ఈ విభాగంలో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. మరోవైపు ఏథర్ ఎనర్జీ కూడా సత్తా చాటుతోంది. గతంతో పోలిస్తే దీని అమ్మకాలు పెరిగి, మార్కెట్‌లో మంచి స్థానం సంపాదించింది. స్టార్టప్‌ గా మొదలైన ఈ సంస్థ ఇప్పుడు పెద్ద కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది.

ఓలా ఎందుకు వెనుకబడింది?

ఓలా వెనుకబడటానికి పలు కారణాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సర్వీస్ సమస్యలు, వెహికల్ క్వాలిటీపై వచ్చిన ఫిర్యాదులు, వినియోగదారుల అసంతృప్తి లాంటి అంశాలు ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. అయితే, కంపెనీ ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. సర్వీస్ మెరుగుపరచడం, విడిభాగాల లభ్యత పెంచడం వంటి చర్యలు తీసుకుంటోంది. అయినా, సత్తా చాటలేకపోతోంది.

ఈవీ రంగానికి సవాళ్లు

Advertisement

మరోవైపు, మొత్తం EV రంగం కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా చైనా నుంచి వచ్చే అరుదైన లోహాల సరఫరా తగ్గడం వల్ల ఉత్పత్తి ప్రభావితమైంది. ఈ పదార్థాలు ఎలక్ట్రిక్ మోటార్ల తయారీలో కీలకంగా ఉండటంతో, తయారీదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. మొత్తంగా ఇండియన్ మార్కెట్ లో  కొత్త కంపెనీలు, పాత కంపెనీలు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి.

Read Also: అమల్లోకి కొత్త ట్రాఫిక్ ఫైన్స్.. అలా చేశారో రూ. 25 వేలు జరిమానా!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×