E-Paper
Advertisement

Ola Champion Mahotsav: పొట్టి కప్ కొట్టిన భారత్.. అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన ఓలా!

Ola Champion Mahotsav: పొట్టి కప్ కొట్టిన భారత్.. అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన ఓలా!
Advertisement

Ola Announces Rs. 10,000 Benefits: టీ-20 వరల్డ్ కప్ లో భారత్ సత్తా చాటింది. ఫైనల్ లో న్యూజిలాండ్ ను చిత్తు చేసి పొట్టి వరల్డ్ కప్ ను పట్టేసింది. ఈ విజయాన్ని దేశ ప్రజలంతా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇదే ఉత్సాహాన్ని కొనసాగించేందుకు Ola ఎలక్ట్రిక్ ఛాంపియన్ మహోత్సవ్ అనే పరిమిత కాల బెనిఫిట్స్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ లో భాగంగా కంపెనీ మూడు రోజుల పాటు దాని ఎలక్ట్రిక్ టూ వీలర్ పోర్ట్‌ ఫోలియో అంతటా రూ.10,000 విలువ చేసే ప్రయోజనాలను అందిస్తోంది.

ఈ ఆఫర్ ఏ వాహనాలకు అందుబాటులో ఉందంటే?

ఈ ఆఫర్ అన్ని Ola స్కూటర్లతో పాటు రోడ్‌ స్టర్ శ్రేణి ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిళ్లకు కూడా వర్తిస్తుంది. T20 ప్రపంచ కప్ ఫైనల్ లో భారత్ విజయం సాధించడంతో ఈ ఛాంపియన్ మహోత్సవ్ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. వాస్తవానికి ఫైనల్ మ్యాచ్ కు ముందే ఈ ఆఫర్ ను తీసుకొచ్చింది. అయితే, ఫైనల్లో విజయం తర్వాత టీమిండియా వరుసగా మూడో టైటిల్ ను గెలవడంతో ఈ ఆఫర్ ను పొడిగించాలని నిర్ణయించింది. దాని ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రత్యేక ప్రయోజనాలను అందివ్వడం ద్వారా ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకునేందుకు కంపెనీ నిర్ణయించిందని Ola ఎలక్ట్రిక్ ప్రతినిధులు తెలిపారు.

ప్రస్తుతం ఏ మోడల్స్ అందుబాటులో ఉన్నాయంటే?

Advertisement

Ola ఎలక్ట్రిక్ ప్రస్తుత లైనప్ లో Gen 3 S1 స్కూటర్ రేంజ్, రోడ్‌ స్టర్ X మోటార్‌ సైకిల్ సిరీస్ ఉన్నాయి. ప్రీమియం S1 Gen 3 పోర్ట్‌ ఫోలియోలో 5.2kWh, 4kWh బ్యాటరీ ఎంపికలతో S1 Pro+, 4kWh, 3kWh వేరియంట్లతో S1 Pro ఉన్నాయి. కంపెనీ మరింత సరసమైన ఆఫర్లలో 4kWh బ్యాటరీతో S1 X+, 2kWh, 3kWh, 4kWh బ్యాటరీ ప్యాక్‌ లతో లభించే S1 X రేంజ్ ఉన్నాయి. ఈ మోడళ్ల ధరలు రూ. 77,999 నుంచి ప్రారంభమై రూ. 1.14 లక్షల వరకు ఉంటాయి.

Read Also: ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

మూడు రోజుల పాటు ఓలా ఛాంపియన్ మహోత్సవ్

Advertisement

ఓలా ఛాంపియన్ మహోత్సవ్ క్యాంపెయిన్ అనేది దేశ వ్యాప్తంగా మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో వినియోగదారులు ఏదైనా ఓలా ఎలక్ట్రిక్ వాహనంపై రూ. 10,000 ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ ఆఫర్ ను వినియోగించుకునేందుకు చాలా మంది వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఆఫర్ ద్వారా అమ్మకాలు పెంచుకునేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ఈ ఆఫర్ కంపెనీకి ఏమేరకు లాభం చేకూర్చుతుందనేది చూడాలి.

Read Also: ఓలా To టీవీఎస్.. మార్చి 2026లో టాప్ ట్రెండింగ్‌ ev స్కూటర్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×