// // Oben Rorr Evo: 3 సెకన్లలో 40 స్పీడ్.. ఏముంది భయ్యా ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్! -->
E-Paper
Advertisement

3 సెకన్లలో 40 స్పీడ్.. ఏముంది భయ్యా ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్!

3 సెకన్లలో 40 స్పీడ్.. ఏముంది భయ్యా ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్!
Advertisement

Oben Launches Affordable EV Bike: ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ భారతీయ మార్కెట్‌ లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే కొత్త ఓబెన్ రోర్ ఈవో పేరుతో ఎలక్ట్రిక్ బైక్ ను విడుదల చేసింది. ఈ బైక్ డిజైన్, పనితీరు, ఫీచర్ల పరంగా యువతను ఆకర్షించేలా తయారు చేయబడింది. సరసమైన ధరలో మెరుగైన రేంజ్ ఇవ్వడం వల్ల ఈ బైక్ తనకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకోనుంది.

గంటకు 110 కి.మీ గరిష్ట వేగం

ఈ బైక్ లో 3.4kWh సామర్థ్యం కలిగిన LFP బ్యాటరీని అమర్చారు. దీనికి 9kW ఎలక్ట్రిక్ మోటార్ జత చేశారు. ఈ కాంబినేషన్ తో బైక్ ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 180 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ముఖ్యంగా స్టార్ట్ సమయంలోనే మంచి పికప్ ఇస్తుంది. జస్ట్ 3 సెకన్లలోనే 0 నుంచి 40 కిమీ వేగాన్ని అందుకుంటుంది. సిటీ రోడ్లపై ప్రయాణానికి అనుగుణంగా ఈ బైక్ ను తయారు చేశారు.

Advertisement

ఇక ఈ బైక్ కు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. సుమారు 90 నిమిషాల్లో 80 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. పూర్తి ఛార్జ్ కావడానికి దాదాపు ఐదు గంటల సమయం పడుతుంది. రోజువారీ ప్రయాణాలకు ఈ రేంజ్ అనుకూలంగా ఉంటుంది.

ARX ప్లాట్‌ఫారమ్‌ పై నిర్మాణం

ఈ బైక్‌ ను కంపెనీ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ARX ప్లాట్‌ ఫారమ్‌ పై నిర్మించారు. ట్రెల్లిస్ ఫ్రేమ్‌ తో పాటు ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో ఏడు స్థాయిల్లో సర్దుబాటు చేసుకునే మోనోషాక్ సస్పెన్షన్ అందించారు. బ్రేకింగ్ కోసం ఫ్రంట్, రియర్ వీల్స్ కు డిస్క్ బ్రేక్‌ లు ఉన్నాయి. భద్రత కోసం CBS సిస్టమ్ కూడా ఉంటుంది.

అత్యాధునిక ఫీచర్లు

Advertisement

ఫీచర్ల పరంగానూ ఈ బైక్ చాలా అడ్వాన్స్ డ్ గా ఉంది. ఈ బైక్‌ లో లేటెస్ట్ కనెక్టెడ్ టెక్నాలజీ ఉంది. స్మార్ట్‌ ఫోన్‌ తో కనెక్ట్ అయ్యే సదుపాయం, ఏఐ ఆధారిత రైడింగ్ ఫీచర్లు, పలు రైడింగ్ మోడ్‌ లు ఉన్నాయి. అదనంగా USB ఛార్జింగ్ పోర్ట్ లాంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. బ్యాటరీపై కంపెనీ ఎనిమిదేళ్ల వరకు వారంటీ ఇస్తుంది.

తొలి 10 వేల మంది కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్

ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ ధరకు సంబంధించి కంపెనీ కీలక ఆఫర్ ప్రకటించింది. మొదటి 10,000 మంది కస్టమర్ల కోసం ఈ బైక్‌ను సుమారు రూ. 1 లక్ష ఎక్స్ షోరూమ్ ధరకు అందిస్తున్నారు. ఆ తర్వాత దీని ధర సుమారు రూ. 1.25 లక్షలకు పెరుగుతుంది. కేవలం రూ. 777తో బుకింగ్ ప్రారంభించగా, డెలివరీలు జూన్ 2026 నుంచి మొదలవుతాయని కంపెనీ ప్రకటించింది. మొత్తంగా ఈ బైక్ సరసమైన ధరలో మంచి ఫీచర్లు కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: టైర్ పగిలినా నో టెన్షన్.. ఈ కారు మూడు చక్రాలతో పరుగులు తీస్తుంది!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×