// // Oben Electric Bike: ఫస్ట్ లుక్ తోనే పిచ్చెక్కిస్తున్న ఎలక్ట్రిక్ బైక్, ఓబెన్ న్యూ మోడల్ లాంచింగ్ ఎప్పుడంటే? -->
E-Paper
Advertisement

ఫస్ట్ లుక్ తోనే పిచ్చెక్కిస్తున్న ఎలక్ట్రిక్ బైక్, ఓబెన్ న్యూ మోడల్ లాంచింగ్ ఎప్పుడంటే?

ఫస్ట్ లుక్ తోనే పిచ్చెక్కిస్తున్న ఎలక్ట్రిక్ బైక్, ఓబెన్ న్యూ మోడల్ లాంచింగ్ ఎప్పుడంటే?
Advertisement

Oben Teases Sporty Electric Motorcycle: ఓబెన్ కంపెనీ క్రేజీ ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకురాబోతుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ కు సంబంధించిన టీజర్‌ ను విడుదల చేసింది. ఈ బైక్‌ ను ఏప్రిల్ 30న లాంచ్ చేయనున్నారు. ఈ టీజర్‌ ను పరిశీలిస్తే, సాధారణ కమ్యూటర్ బైక్ కాకుండా, పెర్ఫార్మెన్స్ పై ఎక్కువగా దృష్టి పెట్టిన మోడల్ గా తెలుస్తోంది. యువతను ఆకట్టుకునేలా స్టైలిష్ డిజైన్‌ తో ఈ బైక్ అందుబాటులోకి రానుంది.

ఆకట్టుకుంటున్న హెడ్‌ లైట్ డిజైన్‌

టీజర్‌ లో ముఖ్యంగా బైక్ హెడ్‌లైట్ డిజైన్‌ను చూపించారు. ఇందులో సింగిల్ LED DRLతో పాటు ప్రొజెక్టర్ హెడ్‌ ల్యాంప్ కూడా ఉంది. ఈ హెడ్‌ లైట్ స్టైల్ చాలా అగ్రెసివ్‌గా, స్పోర్టీ లుక్‌ తో కనిపిస్తోంది. గతంలో ఓబెన్ బైక్‌ లలో కనిపించిన రౌండ్,  రెట్రో డిజైన్‌ కు ఇది పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. కంపెనీ కొత్త మోడల్‌ ను మరింత మోడర్న్‌ గా, యూత్ ఫోకస్‌ గా తీసుకురాబోతోంది.

స్పోర్ట్స్, పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి..

Advertisement

ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ తో ఓబెన్, స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ కోరుకునే రైడర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు అర్థం అవుతోంది. ఇప్పటి వరకు ఈ బ్రాండ్ ప్రధానంగా ఎంట్రీ లెవల్, కమ్యూటర్ సెగ్మెంట్‌ లోనే బైక్స్ ను పరిచయం చేసింది. అయితే, ఈ కొత్త మోడల్ ద్వారా ప్రీమియం, పెర్ఫార్మెన్స్ సెగ్మెంట్‌ లోకి అడుగుపెట్టే ప్రయత్నం చేస్తోంది.

బ్యాటరీ, మోటార్ గురించి..

బ్యాటరీ,మోటార్ విషయానికి వస్తే, ఈ బైక్‌ లో పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్‌ ను  అందించే అవకాశం ఉందని తెలుస్తోంద. దీనివల్ల బైక్ మంచి స్పీడ్, మెరుగైన రేంజ్ ఇస్తుందని భావిస్తున్నారు. అయితే, ఈ  పూర్తి వివరాలు ఏప్రిల్ 30న లాంచ్ టైమ్ లో వెల్లడి కానున్నాయి. అదే రోజున ఈ బైక్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ధర, రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. అంతేకాదు, లాంచింగ్ రోజునే బుకింగ్‌ లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ బైక్ కావాలనుకునే వారికి ఈ బెస్ట్ ఆప్షన్ గా మారనుంది.

 యువతలో మంచి క్రేజ్ సంపాదించుకునే అవకాశం

Advertisement

ఓబెన్ కొత్త ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లో మరో బెస్ట్ ఆప్షన్ గా మారనుంది. స్టైలిష్ డిజైన్, మంచి పర్ఫార్మెన్స్, లేటెస్ట్ ఫీచర్లతో ఈ బైక్ యువతలో మంచి క్రేజ్ సంపాదించే అవకాశముంది. ప్రస్తుతం వచ్చిన టీజర్ చూస్తే ఈ మోడల్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఏప్రిల్ 30న జరిగే లాంచ్‌తో ఈ బైక్ గురించి పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

Read Also: ఒకటి కాదు రెండు కాదు.. మార్కెట్ ను షేక్ చేయబోతున్న10 క్రేజీ బైక్స్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×