E-Paper
Advertisement

స్కూటర్‌పై ఆఫీసులో రౌండ్ కొట్టిన సీఈఓ.. కారణం తెలిస్తే మెచ్చుకుంటారు!

స్కూటర్‌పై ఆఫీసులో రౌండ్ కొట్టిన సీఈఓ.. కారణం తెలిస్తే మెచ్చుకుంటారు!
Advertisement

Office Celebration Goes Viral: సాధారణంగా కంపెనీల్లో టార్గెట్ రీచ్ అయిన ఉద్యోగులను స్టేజి మీదికి పిలిచి  సత్కరించడం, బహుమతులు ఇవ్వడం చూస్తుంటాం. కానీ, బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ సీఈఓ మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించారు. తన కంపెనీ సాధించిన విజయాన్ని ఉద్యోగులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి ఆఫీసులోనే కొత్త స్కూటర్‌పై చక్కర్లు కొట్టారు. ఆ తర్వాత ఆ స్కూటర్‌ ను మంచి పర్ఫార్మెన్స్ కనబరిచిన ఉద్యోగికి బహుమతిగా అందించి అందరి దృష్టిని ఆకర్షించారు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఈ ఆసక్తికర ఘటన ప్రముఖ రియల్ ఎస్టేట్ టెక్ కంపెనీ నో బ్రోకర్ లో చోటుచేసుకుంది. కంపెనీ కో ఫౌండర్, సీఈఓ అమిత్ కుమార్ అగర్వాల్ ఈ వేడుకకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదిక Xలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. కంపెనీ ప్యాకర్స్ అండ్ మూవర్స్ విభాగం ఇటీవల అత్యుత్తమ పనితీరును నమోదు చేసింది. ఈ విజయాన్ని గుర్తిస్తూ ఉద్యోగులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలని కంపెనీ నిర్ణయించింది. అందులో భాగంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగికి కొత్త స్కూటర్‌ను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు. అనుకున్నట్లుగానే అమిత్ కుమార్ అగర్వాల్ కొత్త స్కూటర్‌పై ఆఫీసు ఫ్లోర్‌ లో చక్కర్లు కొడగారు. ఆయన స్కూటర్ నడుపుతుండగా చుట్టూ ఉన్న ఉద్యోగులు చప్పట్లు కొడుతూ, కేరింతలు వేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఆఫీసు మొత్తం హ్యాపీ మోడ్ లోకి వెళ్లిపోయింది.

బెస్ట్ ఉద్యోగికి బహుమతిగా..

Advertisement

కొద్దిసేపు స్కూటర్‌ మీద ఆఫీసులో తిరిగిన అనంతరం, దానిని గెలుచుకున్న ఉద్యోగికి స్వయంగా అందజేశారు. ఈ బహుమతి కేవలం ఒక ఉద్యోగికి ఇచ్చిన గిఫ్ట్ మాత్రమే కాదని, నెలల తరబడి కష్టపడి లక్ష్యాలను సాధించిన మొత్తం బృందం కృషికి గుర్తింపుగా ఇచ్చిన ప్రోత్సాహమని  చెప్పారు. ఒక కంపెనీ విజయం ఒక్క విభాగం వల్ల సాధ్యం కాదని, అనేక టీమ్‌లు కలిసి పనిచేసినప్పుడే ఇలాంటి ఫలితాలు వస్తాయని ఆయన వివరించారు. సేల్స్ టీమ్ కొత్త కస్టమర్లను తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తే, సర్వీసింగ్ టీమ్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించిందని చెప్పారు. అలాగే పార్ట్‌ నర్ మేనేజ్‌మెంట్ టీమ్ తెర వెనుక ఉండి అన్ని కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించిందని వెల్లడించారు. ఈ టీమ్‌లలో ఏ ఒక్కటి లేకపోయినా ఈ విజయం సాధ్యమయ్యేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యోగులకు కృతజ్ఞతలు చెప్పడానికి పెద్ద కార్యక్రమాలు అవసరం లేదని, వారితో కలిసి ఆనందాన్ని పంచుకోవడమే నిజమైన గుర్తింపు అని అమిత్ కుమార్ అగర్వాల్ అన్నారు. ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి వారితో కలిసి వేడుకలు జరుపుకోవడం కంపెనీ సంస్కృతిలో భాగం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.

సీఈవోపై నెటిజన్ల ప్రశంసలు

Advertisement

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు.  ఉద్యోగులతో కలిసి సీఈఓ స్వయంగా సంబరాల్లో పాల్గొనడం బాగుందని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి చిన్నచిన్న కార్యక్రమాలు ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచడమే కాకుండా, కంపెనీపై మరింత నమ్మకం, అనుబంధాన్ని పెంచుతాయని అభిప్రాయపడుతున్నారు.

Read Also: 158 కి.మీ రేంజ్‌తో టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు చూస్తే షాక్ అవుతారు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×